బైబిల్ చదివే పెట్రోల్ – కనుగొన్నారు.
Bible Unknown Facts Telugu – Petrol
బైబిలులో ఎన్నో వైజ్ఞానిక సంగతులు రాయబడి ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరముల కిందట రాయబడిన ఈ మాటలలో “విజ్ఞానం” దాగి ఉంది. అసలు, వైజ్ఞానిక సంగతులు చూడవలెనంటే బైబిలు అనే “గవాక్షం” (కిటికీ) నుంచే చూడాలి.
నేటి దేశాలన్ని కూడ “ఇంధనం, ఇంధనం” అంటూ వెదకులాడు తున్నాయి. ఇంధనం లేకపోతే మనిషి యొక్క మనుగడ కష్టమైపోయే రోజులివి. “చమురు” మనిషికి లెక్కలేనన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. పశ్చిమాసియా, ఇరాక్, ఇరాన్, జోర్డాన్, సిరియా, లెబనాన్, సౌది అరేబియా, కువైట్ ఇంకా ఎన్నో దేశాలు ఒకప్పుడు ఎంతో పేద జీవితాన్ని గడిపాయి.
సరైన తిండి, బట్ట, వనరులు లేక, ఎన్నో అవస్థలు పడ్డాయి. అలాంటి దేశాలు ఒక్క దెబ్బతో సంపన్న దేశాలుగా మారిపోయాయి. కారణము ఏమిటి? – “చమురు” దొరికింది.
ఈ చమురుకు వైజ్ఞానికులు పెట్టిన పేరు – “పెట్రోలియం” (PETROLEUM)
భూమిలోపల మొదట ఒక రాతి పొరను దాటితే కొంత లోతులో మరొక రాతి పొర ఉంటుంది. రెండు రాతి పొరల మధ్యనున్న ప్రదేశంలో పెట్రోలియం దాగిఉంటుంది. పైనుంచి భూమి లోపలికి రంధ్రమువేసి “ఆయిల్ రిగ్స్” ద్వారా పెట్రోలియమును పైకి తీస్తారు.
భూమిలోపల ఉన్న ఈ రాతి పొరలు కఠినమైన శిలలు. వీటినే చెకుముకిరాతి శిలలుగా పిలుస్తారు. ఈ చెకుముకి బండ, ఆయిల్ని భూమిలోపలికి ఇంకిపోనియ్యకుండ కాపాడుతోంది.
ఈ రాతి పొరల మధ్యనుంచి మొదట ఈ పెట్రోలియమును ముడిచమురుగా తీస్తారు. ఇది ఘన, ద్రవ, వాయురూపాలలో ఉన్నటువంటి హైడ్రోకార్బన్లు, నీరు, లవణాలు మరియు మన్నుతోకలసిన మిశ్రమం.
చమురుకు “పెట్రోలియం” అనే పేరు రావటం గమనార్హం. “పెట్రోలియం” అనే పదం గ్రీకునుంచి వచ్చింది. “పెట్రో” (PETRO) అనగా బండ, లేదా రాయి అని అర్థం. “ఓలియం” అనగా నూనె అని అర్థం.
ఈ “పెట్రో” అనే మాటనే ఇంగ్లిషులో రాక్ (Rock) అనీ, “ఓలియం”ను (Oil) ఆయిల్ అని అంటారు.
అంటే గ్రీకులోని పెట్రోలియమును, ఇంగ్లిషులో “రాక్ ఆయిల్” అని అంటారన్నమాట! ఇంకా వివరంగా చెప్పాలంటే, రెండు రాతి పొరల మధ్యనుంచి వస్తుంది కనుక, దీనిని బండనూనె అనీ, లేక బండనుంచి వచ్చే నూనె అని పిలిస్తే ఇంక అర్థవంతంగా ఉంటుంది.
ఈ అద్భుతమైన వైజ్ఞానిక సంగతిని గూర్చి బైబిలు ఇంచుమించు 3600 సంవత్సరముల కిందట తెలియజేసింది. యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనంలో “బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను” అంటూ జ్ఞానులు అన్నవారిని సహితం నివ్వెరపోయేలా చేసింది లేఖనం.
పై లేఖన భాగాన్ని గ్రీకు భాషలో చదివితే, “పెట్రోనుండి నా నిమిత్తము ఓలియం ప్రవాహముగా పారెను” అని చదువుకొనవలసి ఉంటుంది. వాస్తవానికి గ్రీకు బైబిలు ప్రతిలో అలాగే వుంటుంది.
మోషే ప్రవచిస్తూ, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 13వ వచనంలో చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱించెను” అంటూ పలికాడు. జుట్టించడం అంటే భూమిలోపలికి గొట్టాలు వేసి, వాటి ద్వారా పెట్రోలును పైకి తీయడం అని అర్థం.
బండనుంచి నూనె (చమురు) వస్తుందని బైబిలు చెప్పింది, అలాగే బండనుంచి మనుష్యులు చమురును నేడు పైకి తీస్తున్నారు. ప్రపంచాని కంతటికీ అత్యవసరమైన దానిని ఏనాడో బైబిలు తెలియచేసింది అంటే, బైబిలు మనుష్యులు రాసిన గ్రంథమని అర్థమవుతోందా? దేవుడు రాయించిన గ్రంథమని అర్థమవుతోందా?? దేవుడు పలికించి, రాయించిన మహత్తర దివ్య వేద గ్రంథరాజం అని అర్థం అవుతోంది!
Bible Unknown Facts Telugu – Petrol Bible Unknown Facts Telugu – Petrol Bible Unknown Facts Telugu – Petrol Bible Unknown Facts Telugu – Petrol Bible Unknown Facts Telugu – Petrol
ప్రత్యక్ష గుడారం మెటీరియల్ .. click here