Sevakula Prasangaalu Telugu – మనుష్యులు మోయుచున్న3 భారాలు

Written by biblesamacharam.com

Published on:

మనుష్యులు మోయుచున్న3 భారాలు

 

1 పాప భారం 2. రోగ భారం 3 భారాలు 

మొదటిది పాపభారం : 

1.) అందరూ పాపం చేసినవారే.

 (రోమీయులకు) 3:23

23.ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

3:23 మనుషులందరూ అలాంటి అవసరతలో ఉన్నారు కాబట్టి వారందరికీ ఈ నిర్దోషత్వాన్ని ప్రసాదించేందుకు దేవుడు ఇలాంటి అద్భుతమైన, అమూల్యమైన కార్యాలు జరిగించాడు. కొంతమంది ఇతరులకన్న ఘోర పాపులు కావచ్చు గానీ అందరూ పాపులే, దేవుని ప్రమాణాలకు ఎవరూ సరితూగలేరు. అందువల్లే దేవుడు “భేదమేమీ లేదు” అంటున్నాడు (వ 9,22 చూడండి). ఒక మనిషి గుంటలో ఉన్నాడు, వేరొకడు కొండ శిఖరంపై ఉన్నాడు గానీ ఇద్దరిలో ఎవరూ చెయ్యి చాపి నక్షత్రాలను అందుకోలేరు.

2.) నీతిమంతుడు ఒక్కడును లేడు.

 (రోమీయులకు) 3:11

11.గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు

3. పాపంవలన వచ్చు జీతం మరణం.

 (రోమీయులకు) 6:23

23.ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

6:23 వ 16-22 లాగేనే పాపానికి బానిసలుగా ఉండడానికీ, దేవునికి బానిసలుగా ఉండడానికీ మధ్య గల వ్యత్యాసాన్నే ఈ వచనంలో చెప్తున్నాడు. పాపం తన బానిసలకు కూలి ఇస్తుంది. అది మరణం. దేవుని సన్నిధినుంచి శాశ్వతంగా దూరమై ఉండడమే మరణమంటే. ప్రకటన 21:8; 2 తెస్స 1:8-9; మత్తయి 25:41. పాపం యొక్క బానిసలకు వారికి తగినదే, తమ ప్రవర్తనవల్ల సంపాదించుకున్నదే లభిస్తుంది. దేవుడు తన “బానిసలకు” ఇచ్చేది ఒక ఉచిత కృపావరమే. అది శాశ్వత జీవం. వారి పనుల్ని బట్టి చూస్తే అది వారికి తగినది కాదు. దాన్నెవరూ సొంతగా సంపాదించుకోలేరు (4:4-5; 5:17; లూకా 17:10; ఎఫెసు 2:8-9; యోహాను 3:16; 4:14).

4.) దుర్మార్గపు పనులవల్ల మరణం.

 (ప్రసంగి) 7:17

17.అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు;నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు?

5.) పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను.

 (మొదటి తిమోతికి) 1:15

15.పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.

6.) యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రముగా చేయును.

 (మొదటి యోహాను) 1:9

9.మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

రెండవది రోగభారం : 

1.) రోగంలేని మానవుడు ఎవరైన ఉన్నాడా?

2.) రక్తస్రావము కలిగిన స్త్రీ.

 (మార్కు సువార్త) 5:34

34.అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.

3.) కుష్ఠరోగియైన నయమాను.

 (రెండవ రాజులు) 5:1,2,3,4,5,6,7,8,9,10,11,12,13,14

1.సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను. అతడు మహా పరాక్రమశాలియై యుండెను గాని అతడు కుష్ఠరోగి.

2.సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశముమీదికి పోయి యుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను.

3.అది-షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను.

4.నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా

5.సిరియా రాజు-నేను ఇశ్రాయేలు రాజునకు దూతచేత పత్రిక పంపించెదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మణుగుల వెండియు లక్ష యిరువది వేల రూపాయిల బంగారును పది దుస్తుల బట్టలను తీసికొని పోయి ఇశ్రాయేలురాజునకు పత్రికను అప్పగించెను.

6.ఆ పత్రికలో ఉన్న సంగతి యేదనగా-నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగుచేయవలెనని యీ పత్రికను అతని చేత నీకు పంపించి యున్నాను.

7.ఇశ్రాయేలురాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని-చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నాయొద్దకు ఇతడు పంపుటయేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను.

8.ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములునీ వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త యొకడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను.

9.నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా

10.ఎలీషా-నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను.

11.అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను-అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని.

12.దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను.

13.అయితే అతని దాసులలో ఒకడు వచ్చి-నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు

14.అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.

4.) యేసుప్రభువు అనేకమంది రోగులను బాగుచేసెను.

 (మార్కు సువార్త) 1:34

34.ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.

యేసుప్రభువు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది

 (యెషయా గ్రంథము) 53:5

5.మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

6.) నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.

 (నిర్గమకాండము) 15:26

26.మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధే యులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను;నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.

మూడవది ఋణ (అప్పు) భారం : 

1.) మనుష్యునికి మరోక మనుష్యునికి అప్పు

2.) దేశానిక మరొక దేశం అప్పు

3.) అప్పు చేసేటప్పుడు సులువగా చేస్తారు కాని తీర్చేటప్పుడు చాల కష్టం

4.) అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

5.) అప్పుచేయువాడు అప్పు ఇచ్చినవానికి దాసుడు.

 (సామెతలు) 22:7

7.ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.

6.) అప్పు ఇచ్చినవాడు తీసుకున్నవాని పిల్లలను తీసుకొని పోవుట

 (రెండవ రాజులు) 4:1,2,3,4,5,6,7

1.అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని ఎలీషాకు మొఱ్ఱ పెట్టగా

2.ఎలీషా నా వలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె నీ దాసురాలనైన నా యింటిలో నూనెకుండ యొకటి యున్నది; అది తప్ప మరేమియు లేదనెను.

3.అతడు నీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరి యొద్ద దొరుక గలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము;

4.అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపల నుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా

5.ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను.

6.పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమియు లేవని చెప్పెను. అంతలొనూనె నిలిచిపోయెను.

7.ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.


All Pdf……….Download

Leave a comment