1 కీర్తనలు వివరణ | 1 Psalms Explanation In Telugu | Telugu Bible

Written by biblesamacharam.com

Updated on:

కీర్తనలు 1:1 వివరణ

1 Psalms Explanation In Telugu | Telugu Bible

  పాపుల మార్గమున ఎందుకు నిలువకూడదు? కీర్తన 1:1 మనము నిలబడే స్థలము మంచిదియై వుండాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనల్ని ప్రభావితం చేయకుండా, జయజీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే, మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం. పాపుల మార్గములో నిలబడితే దేవుని శాపానికి గురికాక తప్పదు. 

బైబిల్ చెప్పుచున్నది : 

1.) పాపుల మార్గమున నడువకుము.

 (సామెతలు) 4:14

14.భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.

 (సామెతలు) 1:15

15.నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.

2.) పాపుల సహవాసము చేయకుము.

 (సామెతలు) 1:10

10.నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.

1:10-16 మంచి తల్లిదండ్రుల పిల్లలు కూడా దుర్మార్గులు స్నేహంలో పడిపోయే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు దౌర్జన్యం, దోపిడీ, నేరాలకు నడిపించే జారుడు నేలమీద వారున్నారన్నమాట (22:24-25; 1 కొరింతు 15:33). ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువకులు తామెవరితో స్నేహం చేస్తున్నామో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే స్నేహాలు మన ప్రవర్తనపై ఎంతో ప్రభావాన్ని చూపి అటు మితిలేని మేలుకైనా, అంతులేని కీడుకైనా దారితీస్తాయి.

(సామెతలు) 22:24

24.కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము

3.) పాపుల మార్గము దేవునికి అసహ్యము.

 (కీర్తనల గ్రంథము) 5:5

5.డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు

5:5 “గొప్పలు చెప్పుకునేవాళ్ళు”– 18:27; 75:4-5; 94:4; సామెత 6:16-17; యెషయా 2:12.

4.) పాపుల మార్గము ప్రాణమునకు ఉరి.

 (సామెతలు) 22:25

25.నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.

5.) పాపుల మార్గమున మరణము కలదు.

 (రోమీయులకు) 6:23

23.ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

ఎవరైనా దేవునికి “బానిస”గా ఎలా కాగలరు? తమ పాపాలకు పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకముంచడం ద్వారానే. విశ్వాసులంతా దేవుడు కొనుక్కున్న ఆస్తి. ఆయన్ను సేవించాలని వారందరికీ మనసు ఉంది. వారాయన్ను సేవించేది శాశ్వత జీవాన్ని సంపాదించుకొనేందుకు కాదు వారికి శాశ్వత జీవం ఉంది కాబట్టే సేవిస్తున్నారు.

6:23 వ 16-22 లాగేనే పాపానికి బానిసలుగా ఉండడానికీ, దేవునికి బానిసలుగా ఉండడానికీ మధ్య గల వ్యత్యాసాన్నే ఈ వచనంలో చెప్తున్నాడు. పాపం తన బానిసలకు కూలి ఇస్తుంది. అది మరణం. దేవుని సన్నిధినుంచి శాశ్వతంగా దూరమై ఉండడమే మరణమంటే. ప్రకటన 21:8; 2 తెస్స 1:8-9; మత్తయి 25:41. పాపం యొక్క బానిసలకు వారికి తగినదే, తమ ప్రవర్తనవల్ల సంపాదించుకున్నదే లభిస్తుంది. దేవుడు తన “బానిసలకు” ఇచ్చేది ఒక ఉచిత కృపావరమే. అది శాశ్వత జీవం. వారి పనుల్ని బట్టి చూస్తే అది వారికి తగినది కాదు. దాన్నెవరూ సొంతగా సంపాదించుకోలేరు (4:4-5; 5:17; లూకా 17:10; ఎఫెసు 2:8-9; యోహాను 3:16; 4:14).

పాపుల మార్గమున నడిస్తే…. 

1.) నడచువాడు ఎవడైననూ శాంతి నొందడు

 (యెషయా గ్రంథము) 59:8

8.శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.

59:8 “వంకర మార్గాలు”– 53:6; అపొ కా 13:10; గలతీ 1:7.

2.) నడుచువారికి న్యాయం దూరముగా ఉంటుంది.

 (యెషయా గ్రంథము) 59:8,9

8.శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.

9.కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము

59:9-15 తన జాతి పాపిష్ఠి స్థితిని ఒప్పుకోవడంలో యెషయా ప్రవక్త తనను కూడా తన ప్రజలతో కలుపుకుంటున్నాడు. 64:5-7; ఎజ్రా 9:6-7; యిర్మీయా 3:22-25; దాని 9:4-19; రోమ్ 3:9 పోల్చి చూడండి. బైబిలు ప్రవక్తలు, పవిత్రులు తామేదో అందరికంటే గొప్పవారం అయినట్టూ పరిశుద్ధులూ, న్యాయమంతులూ అయినట్టూ ఎంచుకోలేదు.

3.) నడుచువారికి వెలుగు దూరముగా ఉంటుంది.

 (యెషయా గ్రంథము) 59:9

9.కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము

4.) నడుచువారు జయజీవితం పొందలేరు.

 (కీర్తనల గ్రంథము) 1:3

3.అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.

1:3 దేవుని ఉపదేశాల్లో ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉండడం వల్ల కలిగిన ఫలితాలివి – ఆధ్యాత్మిక పోషణ, ఎడతెగని ఫలాలు, విజయం. న్యాయవంతులు దేవుడు నాటిన చెట్లు – యెషయా 60:21; 61:3; మత్తయి 15:13. వారు “కాలువల దగ్గర నాటి ఉన్న” చెట్లలాంటివారు. బైబిల్లో నీరు కొన్ని సార్లు దేవుని ఆత్మకు గుర్తు. చెట్లకు నీరెలా అవసరమో దేవుని ప్రజల జీవానికి, అభివృద్ధికి దేవుని ఆత్మ అంత అవసరం. దేవుని సత్యంలో అస్తమానం ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉండే వ్యక్తి తాను దీవెనలు ప్రవహించే నది పక్కనే ఉన్నాననీ దేవుని ఆత్మ తన చుట్టూ తనలో ఉన్నాడనీ తెలుసుకుంటాడు. యోహాను 7:37-39 పోల్చిచూడండి.

ఎక్కడ నిలబడాలి? 

1.) యెహోవా సన్నిధిని నిలబడాలి.

 (రెండవ దినవృత్తాంతములు) 20:13

13.యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి.

2.) దేవుని మాటలయందు నిలబడాలి.

 (యోహాను సువార్త) 15:7

7.నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.

15:7 “మీకేది ఇష్టమో”– 14:13-14; కీర్తన 37:4 పోల్చి చూడండి. విశ్వాసులు లోకం దృష్టిలో లక్ష్యాన్ని సాధించినవారుగా కనిపించేందుకూ, ధనికులైపోయేందుకూ, ఈ భూమిపై ఉన్న విలాసాలూ, సౌఖ్యాలు అన్నిటినీ అనుభవించేందుకు అనుసరించవలసిన పద్ధతిని యేసు ఇక్కడ చెప్పడం లేదు. ఆధ్యాత్మిక విజయానికీ, కార్యసాధకమైన ప్రార్థనకూ మార్గాన్ని సూచిస్తున్నాడు. ఒక విశ్వాసి హృదయంలో క్రీస్తు మాటలు ఏలుతూ ఉంటే అతని కోరికలు పవిత్రాత్మ ఆధీనంలో ఉంటాయి. క్రీస్తు అతనికి ఏం కలగాలని కోరుకుంటాడో అతడు కూడా అదే కోరుకుంటాడు. క్రీస్తు మాటలు ఎవరినైతే పరిపాలిస్తున్నాయో ఆ విశ్వాసులు క్రీస్తు నేర్పినట్టుగానే ప్రార్థిస్తారు (ఉదాహరణకు మత్తయి 6:9-13). కొలస్సయి 3:16-17; 1 యోహాను 5:14-15 పోల్చి చూడండి.

3.) శ్రమలలో నిలబడాలి.

 (మొదటి సమూయేలు) 17:51

51.వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారి పోయిరి.  

17:51 హీబ్రూ 11:34. విశ్వాసంలో ఉన్న బలప్రభావాలు వేరు వేరు రకాలైన శత్రువులనుకూడా ఓడించగలవు (రోమ్ 8:37; 1 కొరింతు 15:57; 2 కొరింతు 2:14; యాకోబు 4:7).

4.) బండసందులలో నిలబడాలి.

 (యెహెజ్కేలు) 22:30

30.నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడ లేదు.

22:30 యెషయా 51:18; 59:16; 63:5. అంటే దేవుని ఉద్దేశం జెరుసలంలో అధికారంలో ఉండి దేవుని పక్షాన స్థిరంగా నిలిచి ప్రజలను దేవుని వైపుకూ సత్యం, పవిత్రతల వైపుకూ త్రిప్పగలవారు ఎవరూ లేరు అని. దేవుని పక్షాన జెరుసలంలో ఉన్నది యిర్మీయా. అయితే అతడు బయటనుండి వచ్చినవాడు. అతనికి ఏ పదవీ లేదు. నాయకులంతా అతణ్ణి తృణీకరించారు. తన కోపాన్ని జెరుసలం పై కుమ్మరించేందుకు దేవుడెంత అయిష్టంగా ఉన్నాడో, ఆ ఉపద్రవాన్ని తొలగించేందుకు నాయకులు ఎంత చేయగలిగారో ఈ వచనం చెప్తున్నది. నిర్గమ 32:9-14; 34:8-9; కీర్తన 106:23; సంఖ్యా 16:42-50.

5.) సాతానుని కార్యాలపై నిలబడాలి.

(కీర్తనల గ్రంథము) 91:13

13.నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు.

91:13 ఇక్కడ విష సర్పం, సింహం కనబడడం సైతానును గుర్తుకు తెస్తుంది. సైతాను మింగివేయడానికి గర్జిస్తూ తిరుగుతూ ఉండే సింహం (1 పేతురు 5:8), కాలకూట విషంతో నిండిన సర్పం (ప్రకటన 12:9). దేవునిలో నివసించేవారికి ఇంత బలమైన శత్రువును కూడా కాలికింద తొక్కివేయగల శక్తి ఉంటుంది. లూకా 10:19-20; యాకోబు 4:7 చూడండి.

నోట్ : నీవు నిలబడే స్థలము ఎలాంటిదో ఆలోచించు! 


క్రీస్తు జీవిత చరిత్ర మెటీరీయల్ కోసం .. క్లిక్ హియర్ 

 

Leave a comment