యూదా వ్రాసిన పత్రిక | The book of Jude Explanation Telugu 1

Written by biblesamacharam.com

Published on:

యూదా వ్రాసిన పత్రిక 

The book of Jude Explanation Telugu

 యూదా పత్రిక పరిమాణంలో స్వల్పమైనదైనప్పటికి, పరిమితమైన అంశములే ఉన్నప్పటికి అధికారయుతమైనదిగా అంగీకరించబడినది. ఆది సంఘ పితరులు దీనిని తమ రచనలలో వినియోగించారు. మురటోరియన్ (క్రీ.శ. 130) తన ప్రామాణిక గ్రంధముల జాబితాలో ఈ పత్రికను కూడా చేర్చారు. ఆది సంఘ నాయకులైన టెస్టులియన్ మరియు ఆరిజన్ మొదలగు వారు కూడా ఈ పత్రికను ప్రామాణికమైనదిగా అంగీకరించారు. యూదా తన పత్రికలో అపోక్రిపా గ్రంధములోని వాక్యమును (14-15వలు) వినియోగించినందువలన దీని ప్రామాణికత కొంతకాలం ప్రశ్నించబడింది. అయితే కాలక్రమేణా సార్వత్రిక గుర్తింపు పొందుకొన్నది. 

గ్రంధకర్త: 

 “యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడైన యూదా” అని రచయిత తనను తాను పరిచయం చేసుకొంటున్నారు (1వ). దీనిని బట్టి మరియు 17వ వచనములో అపొస్తలులను గూర్చి పేర్కొనుటను బట్టి గ్రంధకర్త అపోస్తలుడైన యూదా (లూకా 6:16; అపో.కా. 1:13) కాదని చెప్పవచ్చు. ఇతడు వేరొక యూదా అయివున్నారు.  The book of Jude Explanation Telugu

ఎవరీ యూదా? 

  1. ప్రభువైన క్రీస్తు సహోదరులలో ఒకడు (మత్త. 13:55, మార్కు 6:3) 
  2. యెరుషలేము సంఘమునకు ప్రముఖ నాయకుడు మరియు యాకోబు పత్రిక గ్రంధకర్తయైన యాకోబుకు సహోదరుడు (అపో.కా. 15:13-21) 
  3.  తన యితర సహోదరులవలెనే యూదా కూడా పునరుత్థానమునకు ముందు క్రీస్తును అంగీకరించలేదు (యోహా 7:1-9, అపో.కా. 1:14) 
  4.  1కొరి. 9:5లో పౌలు పేర్కొన్న ‘ప్రభువు సహోదరులలో యితడు కూడా ఒకడయి వుండవచ్చు 
  5. అపో.కా. 15:22-32లో కనిపించే యూదా యితడే కావచ్చు 

గ్రహీతలు : 

“తండ్రియైన దేవుని యందు ప్రేమించబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, పిలువబడినవారు” (1వ). దీనిని బట్టి ఈ పత్రిక గ్రహీతలెవరో? ఏ ప్రాంతానికి చెందినవారో? గ్రహించుట కష్టము. వారు యూదా క్రైస్తవులుగాని అన్యులలోనుండి ప్రభువు నెరిగినవారు గాని కావచ్చు. 2పేతురు 2లో మరియు యూదా 4-18వచనాలలో ఒకే పరిస్థితిని గూర్చి చర్చించుటవలన ఈ రెండు పత్రికలు ఒక ప్రజనే ఉద్దేశించి వ్రాయబడినవని చెప్పలేము. ఎందుకంటే 2పేతు. లో వివరించబడిన అబద్ధ బోధ ఈ పత్రికలు వ్రాయబడుటకు ముందే యితర ప్రాంతాలలో కూడా అభివృద్ధి చెందింది (అపో.కా. 20:29-30, రోమా 6:1; 1కొరి. 5:1-11, 2కొరి. 12:21; గలతీ. 5:13; ఎఫె. 5:3-17, 1థెస్స 4:6).  The book of Jude Explanation Telugu

యూదా పత్రిక వ్రాయడానికి గల ముఖ్య ఉద్దేశ్యము : 

కలుషితమౌతున్న బోధను కాపాడుటకు పోరాడుమని విశ్వాసులను పురికొల్పుటకు, విశ్వసించిన అతి పరిశుద్ధమైన దానిమీద వారి జీవితములను కట్టుకొనవలసినదిగా ప్రోత్సహించుటకు యూదా ఈ పత్రికను వ్రాసినట్లు గ్రహించగలము. 

యూదా పత్రికలోని ముఖ్య విషయాలు : 

1) వర్ణన : యూదా పత్రికను “క్రొత్త నిబంధన న్యాయాధిపతుల గ్రంధము”గా పలువురు వేద పండితులు అభివర్ణించారు 

2) సంబంధము : పేతురు వ్రాసిన రెండవ పత్రికతో ఈ పత్రికకు అనేక విషయాలలో దగ్గర సంబంధం వుంది. ముఖ్యంగా యూదావలెనే పేతురు కూడా తన రెండవ పత్రికలో అబద్ధ బోధలను, బోధకులను గూర్చి వివరించి, హెచ్చరించాడు. 2 పేతు. 2:1-3:4 యూదా 4-18 వచనములకు మధ్యగల సారూప్యత కేవలం యాదృశ్ఛికమైనదేనని కొట్టివేయలేం. దురూపదేశములను వివరించిన విధము, దానిని ఎదుర్కొనుమని సవాలు చేసిన తీరుతెన్నులను బట్టి వీరిరువురికి వాటిపట్ల గల అవగాహన, అవి కలిగించే హానిని గురించిన ఆందోళన స్పష్టంగా కనిపిస్తాయి.  The book of Jude Explanation Telugu

3) అప్రామాణిక గ్రంధాలు : తన చిన్న పత్రికలో యూదా రెండు అప్రామాణిక గ్రంధములను ఉపయోగించినట్లు కనుగొనగలం.

ఎ) మోషే జ్ఞాపకము (The Assumption of Moses) 9వ వచనము 

బి) హానోకు గ్రంధము (The Book of Enoch 14-15 వచనములు 

4) మూడు మూళ్ళు : మూడు చొప్పున వర్ణించిన విషయములు ఎంతో గమనించదగినవి 

ఎ) తీర్పును గూర్చిన మూడు పాతనిబంధన మాదిరులు (5-7 వచనములు) 

బి) దుర్భోధకులను గూర్చిన మూడు వర్ణనలు (8 వచనములో) 

సి) దుష్టులైన ముగ్గురు పాతనిబంధన వ్యక్తులు (11 వచనములో) 

యూదా పత్రికలోని సారాంశము : 

క్రొత్త నిబంధనలోని అన్ని పత్రికలు అబద్దబోధకులు మరియు వారి బోధనలను గురించిన సూచనలను కలిగివుంటే, కొన్ని పత్రికలు ఈ సమస్యను ఎదుర్కొనే విషయాన్ని గూర్చి మనకు బోధిస్తాయి. గాని వీటన్నిటికి మించి యూదా తన పత్రికలో అబద్ధ బోధకులను, వారి ధనలను బహు ఆగ్రహముతో ఖండిస్తున్నారు. ప్రారంభంలో శుభములు (1,2 వచనాలు) ముగింపులో దీవెనలను (24,25 వచనములు) నహాయిస్తే మిగిలిన వచనములన్నీ ఈ సమస్య చుట్టూనే తిరుగాడాయి. దీనిలోని సారాంశమును మూడు భాగములుగా విభజించవచ్చును. 

మొదటి భాగము : పత్రిక యొక్క ఉద్దేశ్యమును వివరించుట (Explanation of purpose) 1-4 వ.లు 

యూదా తన పాఠకులను మూడు పేర్లతో పిలిచారు. 

  • – పిలువబడినవారు (రోమా 8:28) 
  • – ప్రేమించబడినవారు (యోహా. 3:16; రోమా 28-29) 
  • – భద్రము చేయబడిన వారు (హెబ్రీ 1:3; 1 పేతు. 1:3-5) 

వీరికి కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించాలని అభిలషిస్తున్నాడు. 

మనకందరికి కలిగెడు రక్షణను గురించి వ్రాయాలని యూదా ముందుగా తలంచాడు గాని సంఘములలో చొరబడుతున్న అబద్ధ శోధకులను గూర్చిన వార్త తన పత్రిక ముఖ్యాంశమునే మార్చుకొనేలా ప్రేరేపించింది. ఇప్పుడు యూదా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధనిమిత్తం పోరాడవలెనని విశ్వాసులను కోరుతూ అబద్ధ బోధకులను, వారి బోధనలను ధైర్యంగా ఎదుర్కోవాలని వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఈ భాగంలో ‘పోరాడవలెను’ అని అనువదించబడిన గ్రీకు పదము ‘యుద్ధరంగములోని’ పోరును తలపించే పదము (ఎఫె. 6:11-18; 1తిమో. 6:12). 

అబద్ధ బోధకులు సంఘములోనికి రహస్యంగా చొరబడియున్నారు (2 పేతురు 2:1). తమ అబద్ధ బోధలను సత్యంతో మిళితంచేసి మరింత మోసకరంగా తయారుచేసి చాటుతారు.  వారు భక్తిహీనులు, వారి ప్రవర్తనను బట్టి వారు నిజ క్రైస్తవులు కారని ఋజువవుతుంది. వారు దేవుని కృపను దుర్వినియోగపరుస్తారు, యేసుప్రభువును విసర్జిస్తారు. ఇలాంటి అబద్ధ బోధకులను, వారి బోధలను ఖండించి వారు శిక్షావిధికి గురి అవుతారని చాలాకాలం క్రితమే వారిని గూర్చి వ్రాయబడివుంది అని పేర్కొంటూ అందుకు కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు.  The book of Jude Explanation Telugu

రెండవ భాగము : అబద్ధ బోధకులను గూర్చిన వివరణ (Exposure of false teachers) 5-16 

ఎ) పాతనిబంధన ఉదాహరణలు (5-7) : 

1) దేవుని నమ్మలేకపోయిన ఇశ్రాయేలీయులు : ఐగుప్తు నుండి విడిపించినది ప్రభువే. అయినప్పటికి ఆయన తనును వాగ్దాన దేశములోనికి నడిపించగలరని వారు నమ్మలేకపోయారు (హెబ్రీ 3:12-19). వారి అవిశ్వాసమే వారి శిక్షావిధికి, అరణ్యములోనే వారి శవములు రాలిపోవడానికి, వారు విశ్రాంతిలోనికి ప్రవేశించలేక పోవుటకు కారణభూతమైంది.  The book of Jude Explanation Telugu

2) పడిపోయిన దేవదూతలు : తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్య పాశముతో ఆయన బంధించి భద్రము చేశారు. 

3) సొదొమ, గొమొఱ్ఱా : పై రెండింటికి దేవుడు ఏవిధంగా తీర్పు తీర్చారో ఈ పట్టణాల విషయంలో కూడా ఆవిధంగానే చేశారు. భక్తిహీనులగు వారికి ఈ పట్టణములు దృష్టాంతములుగా ఉన్నాయి. 

బి) యూదా కాలంలోని ఉదాహరణలు (8-16) : 

వారు కలలు కంటూ వాస్తవానికి దూరంగా వుంటున్నారు, శరీరమును అపవిత్రపరచుకొనుచున్నారు, ప్రభుత్వమును నిరాకరిస్తున్నారు, మహాత్ములను దూషిస్తున్నారు. గ్రహించని విషయాలను గూర్చి దూషించువారుగా, మృగములుగా వ్యవహరిస్తూ, నిర్భయంగా జీవిస్తున్నారు అంటూ వారిని గురించి ఎన్నో వివరణలిచ్చి తుదకు పాత నిబంధన వ్యక్తులవలె వారికిని తీర్పు దిగిరాబోతుందని హెచ్చరించారు. కయీను, 

బిలాము, కోరహులు దైవచిత్తానుసారంగా కాక తమ ఆలోచనానుసారంగా నడుచుకొని చివరికి దేవుని ఆగ్రహాన్ని కొనితెచ్చుకొన్నారు. గనుక మనకు యిచ్ఛవచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం, క్రియలకు పూనుకోవడం ఘోర పతనానికి దారి తీస్తుందని గుర్తించవలెను.  The book of Jude Explanation Telugu

మూడవ భాగము : పరిపూర్ణత కొరకైన హెచ్చరికలు (Exhortation to maturity) 17-25 వచనములు 

యూదా తన పాఠకులను ప్రియులారా అని సంబోధిస్తూ అంత్య దినాలలో పరిహాసకులు, దురూప దేశకులు సంఘాలలోనికి ప్రవేశిస్తారని క్రీస్తు ముందుగానే చెప్పిన సంగతిని గుర్తుచేస్తూ వారిని ఎదుర్కొనుటకు చేయాల్సిన వాటిని క్రింద పేర్కొన్నారు. 

  1.  విశ్వసించిన అతి పరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుడి 
  2.  పరిశుద్ధాత్మలో ప్రార్ధన చేయుము 
  3.  నిత్యజీవార్ధమైన మన ప్రభువగు క్రీస్తు యేసు కనికరము కొరకు కనిపెట్టుము 
  4.  దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి 
  5. అపవిత్ర ప్రవర్తనను అసహ్యించుకొనుచు దానికి దూరంగా వెళ్ళవలెను 

“తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకు….. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి… సర్వయుగములును కలుగునుగాక ఆమెన్” (24-25వ). బైబిలు గ్రంధమంతటిలో అత్యంత మహత్తరమైన దీవెన వచనముతో యూదా తన పత్రికను ముగించారు. 

యూదా పత్రికలో క్రీస్తును వర్ణించిన విధము : 

విశ్వాసులను తొట్రిల్లకుండా కాపాడుటకు, తన మహిమ యెదుట ఆనందముతో నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల వానిగా క్రీస్తు వర్ణించబడ్డారు (24-25). 

యూదా పత్రికలో అన్వయించుకొనదగిన సత్యములు 

  1.  ప్రతి విశ్వాసి సత్య సువార్తను కాపాడుటకు పోరాడవలసియున్నాడు 
  2.  సంఘములోనికి దుర్భోదకులు ప్రవేశిస్తారని క్రీస్తు ముందుగానే చెప్పారు 
  3.  తనకు తెలియనిదాని విషయంలో వాదించుటకు తెగబడేవారు సత్య వాక్య విరోధులు 
  4.  చెడ్డవారిని చూసి చూడనట్లు విడిచిపెట్టువాడు కాడు క్రీస్తుప్రభువు 
  5.  ఇవ్వబడిన సమయంలో కొందరినైనా ప్రభువు యొద్దకు నడిపించడానికి ప్రతి విశ్వాసి పూనుకోవాలి 

బైబిల్ ప్రశ్నలు – జవాబులు click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: restricted