ఇండియా నిజంగా హిందూ దేశమా – Is India really a Hindu country

Written by biblesamacharam.com

Published on:

ఇండియా నిజంగా హిందూ దేశమా.

Is India really a Hindu country

  మధ్య ఆసియాలో ట్రైగ్రిస్, యుఫ్రేటిస్ నదుల మధ్య గల భూభాగమైన మెసొపొటేమియాకు చెందిన పర్షియా భాషలో ‘ఆర్యన్’ (తెలుగులో ఆర్యుడు) అంటే ఇరానియన్ (ఇరాన్వాడు) అని అర్ధం. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత చరిత్రకారుడు, పరిశోధకుడు మైఖేల్ విట్జల్ ప్రకారం, ప్రాచీన ఇరానియన్లు, వైదిక సంస్కృతం, ఇంకా ఇతర ఇండో ఆర్యన్ భాషలు మాట్లాడే ప్రజలు తమ ప్రత్యేకతను చాటుకునేందుకు తమను తాము ‘ఆర్యులు’ అని పిలుచుకున్నారని తన పరిశోధనా పత్రంలో పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్యులపై జరిగిన చాలా పరిశోధనలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఆర్యుల ఈ అంశాన్ని మొట్టమొదట ప్రపంచం దృష్టికి మాక్స్ ముల్లర్ తీసుకువచ్చాడు. జర్మనీకి చెందిన ప్రఖ్యాత చరిత్రకారుడు మాక్స్ ముల్లర్ ఈ విషయాన్ని తన పరిశోధనల్లో తవ్వి, వెలికి తీసి దాన్ని ప్రపంచానికి ప్రకటించి, ధృవీకరించాడు. 

 ‘ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతం’ (Aryan Invasion Theory- ATI) అని తన పరిశోధనకు ఆయన పేరు పెట్టాడు. అయితే ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులు తమ పరిశోధనల్లో ధృవీకరించారు. ఆ సిద్ధాంతం ప్రకారం, మెసొపొటేమియా ప్రాంతానికి చెందిన ఆర్యలనే శ్వేత వర్జీయులు, సంచార జాతి ప్రజలు, 1500 BC లో ఉత్తర ఇండియాపై దురాక్రమణ చేసి ఆ ప్రాంతాన్ని జయించారు. ఉత్తర ఇండియాలో అప్పుడున్న ద్రవిడ సంస్కృతిని, నాగరికతను వాళ్ళు ధ్వంసం చేసి తమ వేద సంస్కృతిని, సంస్కృత భాషను వారిపైన రుద్దారని చరిత్రకారుల పరిశోధనలు ధృవీకరించాయి. 

 వైదిక సంస్కృతికి ఇండియా జాతీయతే పునాది అని చెప్పుకొంటూండగా, ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతం దాన్ని సవాలు చెయ్యడంతో, తమ వైదిక సంస్కృతి, వైదిక మతం ఇండియాదేనంటూ చెప్పుకొంటున్న వారి వాదనలకు ఈ పరిశోధనలు తూట్లు  పొడవడంతో, ఇక హడావుడిగా నష్టనివారణ చర్యలకు వాళ్ళు ఉపక్రమించారు. చరిత్రకారుడు మాక్స్ ముల్లర్ను విలన్గా అభివర్ణిస్తూ, అతని సిద్ధాంతాలు తప్పుల తడకలంటూ గోబెల్స్ దుష్ప్రచారం ఆరంభించారు. కానీ మాక్స్ ముల్లర్ ఆవిష్కరించిన ‘ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతం’ పైన ఇతర చరిత్రకారులు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు చేశారు. ఇండియాపై ఆర్యుల దురాక్రమణకు సంబంధించిన అనేక ఇతర వివరాలు వాళ్ళ పరిశోధనల్లోనే ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఆర్యులు ఉన్నట్టుండి ఇరాన్ వదిలి కిందికి అనటోలియా (ఇప్పటి టర్కీలో ఉంది), ఆఫ్ఘనిస్తాన్, ఇప్పటి పాకిస్తాన్, పశ్చిమ పంజాబ్ మీదుగా ఇండియా ఉపఖండానికి 1500 BC లో రావడానికి, ఇరాన్తో సహా మధ్య ఆసియాలో వాతావరణ ప్రతికూల ప్రభావంతో భయంకరమైన నీటి ఎద్దడి ఆరంభమై అదంతా ఎడారిగా మారిపోవడమే ప్రధానకారణమని శాస్త్రీయ ఆధారాలతో సహా వాళ్ళు తమ పరిశోధనల్లో రుజువు చేశారు. ఆ కారణంగా దక్షిణ మధ్యాసియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్లో అక్కడి పట్టణ నాగరిక వ్యవస్థ కూడా కుప్పకూలిందని వెల్లడయింది. ఆ కారణంగా ఇరాన్ నుండి ప్రజలు పెద్ద ఎత్తున వలస వెళ్లి ఇండియాలాంటి ఇతర ప్రాంతాల్లోని ప్రజలతో కలిసిపోయారు. ఆర్యులనే సంచార జాతి ఇరాన్ ప్రజలు కూడా దక్షిణాది వైపునకు వలస వెళ్లి, హిమాలయాల కారణంగా నిరంతరం నీళ్లు ప్రవహించే జీవనదులున్న ఇండియా ఉ పఖండానికి వచ్చి స్థిరపడ్డారని పర్యావరణ, భాషాసంయమన శాస్త్రం, పురాతత్వ, జనాభా శాస్త్ర సంబంధమైన అన్ని రుజువులతో చరిత్రకారులు తమ పరిశోధనల్లో వెల్లడించారు. ఇండియా ఉపఖండంలో అపుడు 

 ద్రావిడులనే అత్యంత ప్రతిభావంతులు, సంపన్నులు, ఉదార ప్రజలు, అత్యంత నాగరికులు నివసించేవారని హరప్పా, మొహంజోదారో తవ్వకాలు రుజువు చేస్తున్నాయి. ఆర్యులు నీళ్లు, ఆహారం కోసం వెదుకుతూ ఇండియాకు వచ్చారన్న విషయమై ఎలాంటి అనుమానాలూ లేవు. అయితే వాళ్ళు వలసదారులా లేక దురాక్రమణదారులా అన్నదే కొంత వివాదాస్పదం. నాకు నమ్మకం కలిగించిన సిద్ధాంతం ఏమిటంటే, వాళ్ళు ముందుగా వలనదారులుగా వచ్చి ఆ తర్వాత దురాక్రమణదారులయ్యారు. అన్నం కోసం వలస వచ్చిన ఆర్యులకు అప్పటి స్థానికులైన ద్రావిడులు ఔదార్యంతో ఆశ్రయమిచ్చారు. అయితే ఇండియాలో స్థిరపడిన తర్వాత ఆర్యుల అసలు రంగులు బయటపడ్డాయి. ద్రావిడుల నుండి వారి సంపదలు, భాష, దేవుళు ఎ), సంస్కృతిని ఆర్యులు క్రమంగా దూరం చేసి తమ భాషను, సంస్కృతిని, తమ వైదిక హైందవమతాన్ని వారిపై రుద్దడం ఆరంభించారు. ఇండియా ఉపఖండానికొచ్చిన తర్వాత ఆర్యులు తమ వైదిక మతానికి తాము కొత్తగా కనుగొన్న ఇండస్ నది పేరుతో హిందూ మతం అని పేరు పెట్టుకున్నారు. ఆర్యులు రామాయణం, మహాభారతం, ఇంకా ఇతర పురాణాలు రాసి, వాటిలో స్థానికులు, దేశ మూలవాసులైన ద్రావిడులు దేవుళ్లను రాక్షసులుగా (అసురులు), ద్రావిడ ప్రజల్ని శత్రువులు, వినాశనపాత్రులైన అనాగరికులుగా అభివర్ణించారు. ఆర్యుల ‘ఋగ్వేదం’ క్రీస్తుకు ఎన్నో ఏళ్లకు పూర్వం అంటే ఏడెనిమిది వేల ఏళ్లకు పూర్వపుదంటూ వాళ్ళు చేసే వాదనలను చరిత్రకారులే అవహేళన చేస్తారు. ఋగ్వేదాన్ని 1500 BC లో రాశారంటూ సశాస్త్రీయంగా బల్ల గుద్ది మరీ చరిత్రకారులు రుజువు చేశారు. మరి రామాయణం, మహాభారతం అయితే ఇంకా ఆ తర్వాతే రాసినట్టు కదా? అన్నం కోసం, నీళ్ల కోసం శరణార్థులుగా వచ్చిన ఆర్యులకు ఎంతో మానవతా దృక్పధంతో ఆశ్రయమిచ్చిన ద్రావిడులకే చుక్కలు చూపించి, వింధ్యాపర్వతాల కింది ప్రాంతాలకు వారిని ఆర్యులు తరిమికొట్టారు. అప్పటికి వాళ్ళు ఆర్యుల నుండి హిందువులుగా పేరు మార్చుకున్నారు. కానీ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణా వంటి అక్కడి ప్రజల్లో, జీవన శైలిలో ఆతిథ్యం, ప్రేమ, అభిమానం, డైనమిజంవంటి ద్రవిడ నాగరికతలోని ప్రతిభావంతమైన అంశాలు ఇప్పటికీ కొట్టవచ్చినట్టుగా కనిపిస్తాయి. ఇండియా దేశానికి నిజమైన మూలవాసులైన ద్రావిడులను వాళ్ళ సొంత ప్రాంతమైన ఉత్తరం నుండి కిందికి మెడపట్టి గెంటేసినా తామిపుడున్న దక్షిణ ప్రాంతాన్నే సుసంపన్నమైన, నాగరికమైన ప్రాంతంగా అభివృద్ధి చేసుకున్న ప్రతిభావంతులు ద్రావిడ ప్రజలు. సంగీతం, సాహిత్యం, విద్యా, తత్వ శాస్త్ర రంగాల్లో దక్షిణాదిన ఉన్న ద్రావిడులనుండి ఎంతో మంది ప్రతిభావంతులు వచ్చారు. అయినా సరే, ఉత్తరాదిన ఉన్న ఆర్యలనే తమ సోదరులతో కలిసిమెలిసి జీవించాలనుకునే ప్రశాంత స్వభావులు, నిస్వార్ధ ప్రజలు వారు. కానీ మంచితనమెపుడూ సమాజం దృష్టిలో బలహీనతగానే ఉంటుంది. ఈ విషయాల్ని వచ్చే వ్యాసాల్లో పైపులంగా చర్చిస్తాను. 

 ప్రియమైన సహా క్రైస్తవ విశ్వాసులారా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని నా ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు. దాన్ని నేను అక్షరాలా పాటిస్తాను. ఈ దేశంలోని అన్ని మతాల ప్రజలతోను నేను శాంతియుతంగా జీవిస్తాను. అయితే నా పూర్వీకులైన క్రైస్తవులు దురాక్రమణదారులు, దోపిడీదారులంటూ అజ్ఞానంతో, కేవలం అక్కసుతో చేసే దాడులనుండి నన్ను నేను, నా పూర్వీకులను కాపాడుకునే హక్కు నాకుంది. నేనెవరి మీదా దాడి చెయ్యడం లేదు. నా మీద, నా స్వజనుల మీద జరిగిన దాడికి ఇది మేధోపరమైన ప్రతి దాడి మాత్రమే. నా మీద, నా మతం మీద, నా ప్రజల మీద జరిగిన, జరుగుతున్న లెక్కలేనన్ని దాడులకు ఇది నేనిస్తున్న జవాబు మాత్రమే. ఈ దేశానికి మనమెంతో ఇచ్చాం, ఎంతో చేసాం. అందుకు ప్రతిగా మనకు ఇవ్వాల్సిన ఆత్మగౌరవాన్ని, మద్దతును, కనీసం మనపట్ల కృతజ్ఞతను కూడా చూపించడం లేదు. 

Is India really a Hindu country Is India really a Hindu country Is India really a Hindu country Is India really a Hindu country Is India really a Hindu country Is India really a Hindu country Is India really a Hindu country Is India really a Hindu country Is India really a Hindu country Is India really a Hindu country Is India really a Hindu country 


 ప్రశ్నలు – జవాబులు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: restricted