బైబిల్ దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడితే లేఖనములలో వ్యతిరేకతలెందుకు?
Why the Defiance in the Bible Telugu
విమర్శ : పరిశుద్ధ గ్రంధమగు బైబిలు దేవుని ఆత్మద్వారా మనుష్యుల చేత వ్రాయబడిన గ్రంథమైతే, ఒక ఆత్మ చేత వ్రాయబడిన లేఖనములలో తారతమ్యము లెందుకు? ఒక పుస్తకానికి యింకొక పుస్తకాని వృత్యాసమెందుకు లేఖికులు వందమందైన వ్రాయించింది ఒక్క ఆత్మయేగా ఆలాంటప్పుడు ఒక దానికొకటి పొసగకపోవుటెందుకు? ఉదాహరణకు ఇశ్రాయేలీయులు, ఐగుప్తీయులకు 400 సంవత్సరాలు దాసులుగా వుంటారని యెహోవా అబ్రాహముతో చెప్పుచుండగా, మోషే 430 సంవత్సరాలని వ్రాస్తున్నాడు మరియు, దావీదు రాజు మందసపు పెట్టెను తీసికొని వస్తున్నాప్పుడు ఎడ్లకు కాలు జారింది ఎక్కడ? సమూయేలు గ్రంథమునందు నాకోను కళ్ళమని దినవృత్తాంత గ్రంథమునందు కీదోను కళ్ళమని వ్రాయబడియున్నది ఈలాంటి అసంబద్ధాలు బైబిలు గ్రంధము ఎన్నొకనబడుచున్నవి? ఒకే ఆత్మచేత వ్రాసినప్పుడు యిటువంటి అసంబద్ధాలెందుకు?
జవాబు: ఇటువంటి ప్రశ్నలడుగు వారంటే నేనెంతో యిష్టపడతాను ఎందుకనగా క్రైస్తవులకన్నా మంచిగాను క్షుణ్ణముగా బైబిల్ గ్రంధాన్ని చదువుతారు అందుచేత యిటువంటి ప్రశ్నలడుగుచున్నారు. అడుగు వారికి తగిన హేతువును చూపవల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవునిపై నున్నది.
బైబిల్ గ్రంధాన్ని 40మందికిపైగా ఒకే దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి వ్రాసియున్నారు. వీరందరు ఒకే ప్రాంతానికి చెందినవారుకారు ఒకే కాలానికి చెందినవారుకారు. ఆయాకాలములలో ఆయా ప్రజలను ప్రేరేపించి ఆయనే (దేవుడు) వ్రాయించిన అపారమైన అమూల్య గ్రంథము పరిశుద్ధ గ్రంథము. యెహోవా సెలవిచ్చుచున్నాడు అను వాక్యము 2000 పర్యాయాలకు పైగా పాతనిబంధనలో వ్రాయబడియ్నుది. యెహోవా యొద్దనుండి వచ్చిన వాక్కు దాదాపు 1000 సార్లు, దేవుడు అను పదము 3,356 పర్యాయాలు, ప్రభువు అను మాట 7,738 మార్లు బైబిల్ నందు చూడగలము. పాతనిబంధన మరియు క్రొత్త నిబంధనలోని 66 పుస్తకాలను వివిధ లేఖికుల చేత వ్రాయించాడు దేవుడు. విద్యావంతులున్నారు, వైద్యులు, గొర్రెల కాపరులు, జాలరులు, పండితులు, మొదలగు పలువురు వ్రాసారు. ఎందరు వ్రాసిన అందరిలో కార్యచరణ జరిగించింది దేవుని ఆత్మయే అని పేతురు వ్రాస్తున్నాడు. “ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి” (1 పేతురు 1:20). మరి బైబిల్ వాక్యము ఈలాగు చెప్పుచుండగా అసబంద్ధాలు ఎట్లు కలిగెను? అను సందేహము సహజముగా బైబిల్ వ్యతిరేకులకు మాత్రమే గాక యిప్పుడు మీలో కూడా కలిగి యుండవచ్చును.
పరిశుద్ధ గ్రంథమగు బైబిల్ వాక్యములు కవి కలము నుండి కాక దేవుని హృదయములో నుండి బయలువెడలినది గనుక యిందు ఎచ్చోటును తారతమ్యాలు, అసంబద్ధాలు, అలాంటివి మరేవి కూడ వుండనేరవు. కాకపోతే తొందరపాటు లేక లేఖనములను చిత్తశుద్ధితో పరిశీలిస్తే నిజానిజాలను సత్యాన్వేషులు గ్రహించగలరు.
అసంబద్ధాలుగా అగపడి, పై సూచించిన రెండు ఉదాహరణములలో మొదటిదానిని పరిశీలింతుము. “ఆయన (యెహోవా) నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు నాలుగు వందల (400) ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు” (ఆదికాండము 15:14-15) మరియు నిర్గమకాండము నందు మోషే మాటలను గమనింతుము.
“ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివశించినకాలము నాలుగు వందల ముప్పది (430) సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తు దేశములో నుండి బయలు వెళ్ళెను” (నిర్గమ 12:40 -41) అనుంది.
అయితే ఆదికాండుమ 15:14 నందు 400 సంవత్సరములని యెహోవా చెప్పుచుండగా నిర్గమకాండము నందు మోషే 430 సంవత్సరాలని చెప్పుచున్నాడే వీరిలో అనగా యెహోవా మాట సరియా? మోషే మాట సరియా? అని ప్రశ్నించిన ఎర్రబల్లి ఎర్రన్న క్రైస్తవ్యాన్ని క్రైస్తవులను కదిలించివేశాననుకొన్నాడు. అయితే వారి ఊహ శుద్ధ తప్పు. బైబిలు ఎప్పుడు చేయదు తప్పు. అంచేత – యెహోవా, మోషే మాటలను పరిశీలించి చరిత్రను పరిశోధించుము. అప్పుడు పరిశుద్ధ గ్రంథము ఎంత సత్యమైనదో గ్రహించగలవు. యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తు దేశమునకు చేరిన విధానము అందరికి విధితమే. యోసేపు శోధన కాలాంతమందు, ఫరోయొక్క కలకు భావము తెలియజేసిన పిమ్మట వారు ఐగుప్తులో సుఖముగా వుండిన కాలము, ఇశ్రాయేలియులు ఐగుప్తు దేశములో దాస్యము చేసిన కాలము మరియు వారు అక్కడ నుండి బయలు వెళ్ళిన కాలము మొదలగు వాటిని పరిశీలనగా పరీక్షించిన యెడల సత్యాన్ని గ్రహించగలరు.
యాకోబు అతని కుటుంబీకులు కనాను దేశమునుండి ఐగుప్తు దేశమునకు వచ్చినది క్రీ॥పూ॥ 1720 సంవత్సరము. 1720వ సం॥నుండి వారందరు యోసేపు సమక్షమున సుఖ జీవమును జరిగిస్తూ వచ్చారు. అయితే యాకోబు కుమారుడైన యోసేపు మరణించిన తరువాత యోసేపుకు తెలియని (ఎరుగని) రాజగు “హిక్సోస్ ఫరో” రాజ్యాధికారము పొందినప్పుడు అనగా 1690 సం॥ నుండి “హిక్సోస్” అను ఫరో ఇశ్రాయేలీయులను దాసులనుగా చేసికొని వారిని శ్రమపెట్టుటకు ప్రారంభించాడు. ఆ దినములలో హెబ్రీయుల (ఇశ్రాయేలీయుల) మగ పిల్లలను నరికి ముసళ్ళకు ఆహారముగా పడవేసారు. ఆ శ్రమకాలములోనే మోషే జన్మించడము, జమ్ము పెట్టెలో వున్న మోషేను ఫరో కుమార్తె తీసుకొనుటయు, మోషే పెరిగి పెద్దయిన పిమ్మట ఐగుప్తీయుని హత్య చేసి అక్కడ నుండి పారిపోవుటయు జరిగెను. ఐగుప్తులోని ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేసి మొర్రపెట్టగా ప్రభువగు యెహోవా మోషే అహరోను మిర్యాము మొదలగు వారి అధ్యర్యములో ఇశ్రాయేలీయుల విడుదల చేయునట్లు ఉద్ధేశించి వారిని పంపగా మోషే నాయకత్వంలో జరిగిన విడుదల పోరాటమందు ఐగుప్తు దేశము దద్దరిల్లునట్లు దేవాది దేవుడు ఆ దేశము పైకి పదితెగుళ్ళు పంపినప్పుడు ఫరో గుండె బద్దలై ఇశ్రాయేలీయులను వారి దేశమునుండి అనగా ఐగుప్తు నుండి బయలు వెల్లునట్లు శాసించాడు. ఆలాగు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరిన సంవత్సరమేదనగా క్రీ.పూ. 1290 సంవత్సరమని చరిత్ర సాక్ష్యమిస్తుంది.
ప్రియా పాఠకులారా, యిప్పుడు ఆ కాలము (సంవత్సరాలను) గుణించినచో యర్రబల్లి ఎర్రన్న అడిగిన ప్రశ్నకు సమాధానము మీరివ్వగలరు.
యాకోబు కుటుంబీకులు ఐగుప్తునకు వచ్చినది క్రీ॥పూ॥ 1720. యోసేపును ఎరుగని రాజైన హిక్సోస్ ఇశ్రాయేలీయులను బాధింప ప్రారంభించిన కాలము క్రీ॥పూ॥ 1690. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయలు దేరిన కాలము క్రీ॥పూ॥1290.
క్రీ॥పూ॥ 1720 సం॥ నుండి క్రీ॥పూ॥ 1690 సం॥ వరకు అనగా 30 సంవత్సరాలు యోసేపు కాలమందు సుఖ సంతోషాలతో జీవించిరి. ఆ పిమ్మట క్రీ॥పూ॥ 1690 సం॥ నుండి క్రీ॥పూ॥1290 సం॥ వరకు బానిసలుగా దాసత్వం చేసిరి అనగా 1690×1290=400 సం.రాలు దాసులైయుండిరి.
దేవుడైన యెహోవా అబ్రాహామునకు సెలవిచ్చినదేమనగా “ఆయన నీ సంతతి వారు తమదికాని పరదేశమందు నివశించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు” అని ఆదికాండము 15:13-14లో వారు దాసులుగా వుండి శ్రమ అనుభవించు కాలమగు 400 సం॥రాలను గూర్చి చెప్పెను.
అయితే మోషే – శ్రమ నొందిన దినములను మాత్రమేకాక వారక్కడ సుఖముగా గడిపిన ముప్పది సంవత్సరాలను కూడ కలిపి (చేర్చి) వ్రాసెను.
“ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరాలు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సెనలన్నియు ఐగుప్తు దేశములో నుండి బయలు దేరి పోయేను” (నిర్గమ 12:40-41). అనగా ఐగుప్తులో ఇశ్రాయేలీయులు జీవించిన నివశించిన కాలమును గూర్చి మోషే వ్రాసెను. వీరిలో అనగా యెహోవా మోషే యిద్దరిలో ఎవరి మాట నిజము అంటే యిద్దరిది నిజమే. మోషే చెప్పినట్లు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివశించినది 430 సంవత్సరాలే. హిక్సోస్ అను రాజు రాజ్యాధికారమునకు 1690 సం॥న వచ్చేంత వరకు 30సం॥రాలు సుఖ సంతోషాలతో నివసించిరి. హిక్సోస్ కాలమునుండి 400 సం॥రాలు దాస్యము చేసిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో సుఖముగా నున్న సంవత్సరాలు 30 శ్రమ పొందిన సంవత్సరాలు 400 వారచ్చట నివసించిన కాలము 430.
గనుక యెహోవా ఇశ్రాయేలీయులు దాస్యపు కాలమగు 400స„లను గూర్చి చెప్పెను. మోషే వారక్కడ వుండిన కాలమును గూర్చి చెప్పెను. కావున ఆదికాండము 15:13-14లోను, నిర్గమ 12:40-41లోను వాక్యముల మధ్య పరస్పర సంబంధము తప్ప అసంబందము లేదని సద్విమర్వషకులు సత్యన్వేషులు గ్రహింతురు. హల్లెలూయా.
విమర్శ: ఎడ్లకు కాలు జారింది ఎక్కడ?
రాజైన దావీదు దేవుని మందసపు పెట్టె బండిమీద తీసికొని వస్తుండగా ఎడ్లకు కాలు జారింది ఎచ్చోట? 2 సమూయేలు 6:6లో నాకోను కళ్ళము దగ్గరనియు,1 దినవృత్తాంతము 13:9లో కీదోను కళ్ళమనియు వ్రాయబడియున్నది. ఎడ్లకు రెండు చోట్లలో కాలు జారినదా? రెండు మారులు ఉజ్జా చనిపోయాడు? లేదా ఒక్కమారే కాలు జారుంటే, నాకోను కళ్ళము దగ్గర జారినది నిజమా? లేక కీదోను కళ్ళము దగ్గర జారినది నిజమా? ఎదోకటి నిజమైన మరొకటి అబద్దమేగా: అలాంటప్పుడు బైబిలు ఎట్లు సత్య వేదము కాగలదు?
జవాబు: అవును కదా! నిజమే కదా! అన్నట్టు యిదెట్లబ్బా వీటిలో ఏది నిజమైయుండవచ్చు! అని దేవుని ప్రజలు అశ్చర్య పోకూడదు. దేవుని గూర్చియు, బైబిల్ను గూర్చియు మిడి మిడి జ్ఞానము గలవాడు ఈలాగు అపార్థముగా విమర్శంచి విజ్ఞానులు మనకొంటారు. యిప్పుడు ఎడ్లను జారినది ఎక్కడ? నాకోను కళ్ళము దగ్గరా? లేదా కీదోను కళ్ళము దగ్గరా? అను ఈ ప్రశ్నకు జవాబు పెద్ద పనికాదండి రెండు మూడు చిన్న చిన్న ఉదాహరణములు నేను వ్రాస్తుండగా మీరే నిర్ణయిస్తారు. నాకోను దగ్గరా? కీదోను దగ్గరా యని? నేను సంఘ కాపరిని సంఘముంది గనుక గుర్తింపు కొరకు దానికొక నామము (పేరు) కలదు. అదేదనగా సి.బి.ఎఫ్. చర్చ్. సరేనా? యిప్పుడు మా సంఘస్తులలో కొందరిని మీరు పలుకరించి మీరు సహవాసానికి ఎక్కడికి వెళ్లుచున్నారు అని అడిగితే వారిలో కొందరు – మేము వసంత బాబన్న చర్చికి వెళ్తున్నామని చెబుతారు. కొందరు సి.బి.ఎఫ్ సంఘానికి వెళ్తున్నామని చెబుతారు. దీన్ని బట్టి వారు రెండు సంఘాలకు వెళ్తున్నారని అర్థమా? మరియు మీరు ఓటు ఎవరికి వేసారు? అని అడిగాము అనుకోండి ఒకరు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అనియు యింకొకడు జగన్ కనియు చెప్పారు అనుకోండి, వారిద్దరు యిద్దరికి వేసినట్టా? లేదా ఒకరికి వేసినట్టా? ఆలోచించండి! డా॥ రబ్బీకి పెయిత్ హస్పటల్ వుంది. అక్కడ నుండి వస్తున్న రోగులను చూచి మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళారని అడిగితే వారేమంటారో తెలుసా? ఒకరేమో డా॥ రబ్బీ ఆసుపత్రికి అనంటే. యింకొకరు ఫెయిత్ ఆసుపత్రికియని అంటారు. అవునా? సి.బి.యఫ్ చర్చికి అనిన వసంతబాబన్న సంఘానికి అని చెప్పిన ఒక్కడే! వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ లేదా జగన్కు అనిన ఒక్కరినే సూచిస్తుంది. డా॥ రబ్బి యనిన, పెయిత్ ఆసుపత్రియని ఒకరినే సూచిస్తుంది. ఆ ప్రకారమే నాకోను అనునది ఒకమనుష్యుని పేరు. కీదోను అనునది నాకోను యొక్క కల్లమున్న ప్రాంతపు పేరు అంచేత 2 సమూయేలు 6:6లో కళ్ళముయొక్క సొంతదారుడైన వ్యక్తి పేరుతో నాకోను కల్లమనియు 1 దినవృత్తాంతము 13:9లో ప్రాంతమును ఉద్దేశించి కీదోను కళ్ళము అనియు వ్రాయబడెను. నాకోను మనుష్యుని పేరనియు కీదోను స్థలము పేరనియు తెలియక, అంటే తెలిసి తెలియక మిడి మిడి జ్ఞానముతో ఎడ్లకు రెండు మారులు కాలు జారినదా? ఉజ్జా రెండు మారులు చనిపోయాడా? అంటే అది వారి అవివేకమును, అమాయకత్వమును వెల్లడి జేస్తోంది. పై నివ్వబడి మూడు ఉదాహరణముల మేరకు మరియు చరిత్ర ప్రకారము కీదోనులో వున్న కళ్ళము నాకోనుదైనందున దానిని నాకోను కళ్ళమనియు, కీదోను కళ్ళమనియు చెప్పుట యుక్తమేనని జ్ఞానవంతులు సత్యాన్వేషకులు సమ్మతింతురు పాఠకులారా, బైబిలునందు అసంద్ధాలున్నాయి వ్యతిరేకతలున్నాయి తప్పులున్నాయని చెప్పువారందరు ఈలాటివి అర్థము చేసికొనలేక తప్పుపట్టాలన్న యుద్దేశ్యముతో చదువబూనుకొంటారు గనుక పరిశీలించుటకు ప్రయత్నించక పప్పులో కాలువేసి, విశ్వాసులను సేవకులును కలవరపెడుతుంటారు. ఎవరైనను సరే స్వస్థ బుద్ధితో పరిశుద్ధ గ్రంథాన్ని చదివారంటే, సత్యాన్ని తెలుసుకోవాలను తాత్పర్యముతో చదివారంటే నిశ్చయము పరిశుద్ధ గ్రంథమును చదువు వారినందరిని ఉత్తములునుగా తీర్చి దిద్దగలదు. అట్టి శక్తి దేవుని వాక్కులతో నిండిన బైబిలుకు మాత్రమే కలదు.
Why the Defiance in the Bible Telugu Why the Defiance in the Bible Telugu Why the Defiance in the Bible Telugu Why the Defiance in the Bible Telugu Why the Defiance in the Bible Telugu Why the Defiance in the Bible Telugu Why the Defiance in the Bible Telugu Why the Defiance in the Bible Telugu Why the Defiance in the Bible Telugu Why the Defiance in the Bible Telugu Why the Defiance in the Bible Telugu Why the Defiance in the Bible Telugu
మరిన్ని ప్రశ్నలకోసం .. click here