విగ్రహారాధన
vigragaradhana valana nastamulu
మూలవాక్యము : మనష్షే… విగ్రహముల వలన యూదా వారు పాపము చేయుటకు కారకుడాయెను 2రాజులు 21:11
1. విగ్రహారాధన వలన నష్టపోయిన భక్తులు
1. సొలొమోను.
(మొదటి రాజులు) 11:5,10,11
5.సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.
11:5 “అష్తారోతు”– న్యాయాధి 2:13; 10:6. 2 రాజులు 23:13లో దీనికి “అసహ్యమైన దేవత” అని పేరు ఉంది. కనాను దేశంలో దీనిని బయల్ దేవుడి భార్య అని ప్రజలు అనుకొన్నారు. దీనిని యుద్ధానికి, సంతాన బాహుళ్యానికి ఆధిదేవతగా ఎంచి లైంగిక సంబంధమైన కర్మకాండలతో పూజించేవారు. దీనికి శుక్రుడికి సంబంధం ఉందని అనుకొనేవారు. బబులోనువారు “ఇష్టారు” అనీ, గ్రీకులు “అస్తార్తె” లేక “అఫ్రోడైటె” అనీ, రోమ్‌వారు “వీనస్” అనీ దీనిని పిలిచేవారు.
“మిల్కొమ్”– కొన్ని సార్లు వాణ్ణే “మోలెకు” లేక “మొలొకు” అని కూడా అన్నారు. ఇక్కడ వాణ్ణి “అసహ్యమైన దేవుడు” అనడం గమనించండి. కొన్ని సార్లు వీడికి అర్పణగా చిన్నపిల్లలను మంటల్లో కాల్చేసేవారు. 2 రాజులు 16:3; 17:17; 21:6; లేవీ 18:21; 20:2-5 చూడండి.
10.నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి
11.సెలవిచ్చినదేమనగా-నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను.
2.యరోబాము.
(మొదటి రాజులు) 12:28,29,30
28.ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;
29.ఇశ్రాయేలువారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.
30.దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.
దేవుని తీర్పు
(మొదటి రాజులు) 13:1,2,3,4
1.అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవు నొంది యూదాదేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి యుండగా
13:1 “ధూపం వేయడానికి”– 12:32. 1 సమూ 13:8-14 పోల్చిచూడండి. తన మతం దేవునికి అసహ్యం అయిందని యరొబాంకు అంతగా తెలియదు. దాన్ని ఇప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు.
2.ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటనచేసెను-బలిపీఠమా బలి పీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా-దావీదు సంతతిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.
13:2 “యోషీయా”– ఈ భవిష్యద్వాక్కు దాదాపు 300 సంవత్సరాలకు గాని నెరవేరలేదు. నెరవేరినప్పుడు అది అక్షరాలా తు.చ. తప్పకుండా నెరవేరింది – 2 రాజులు 23:15-20. భవిష్యద్వాక్కుల్లో ఒక వ్యక్తి పేరు చెప్పడం అసాధారణం. యోషీయా కాకుండా ఇలా పేరు చెప్పినది ఒక్క కోరెషు విషయంలోనే. యెషయా 44:28; 45:1 చూడండి. పాత ఒడంబడికలోని భవిష్యద్వాక్కుల్లో యేసుప్రభువు గురించి స్పష్టంగా వెల్లడి అయింది. ఆయనకు అనేక బిరుదులు అక్కడ కనిపిస్తున్నాయి.
3.ఈ బలిపీఠము బద్దలై పోయి దానిమీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన యొకటి యిచ్చెను.
13:3 ఆ ప్రవక్త దేవుని వాక్కులే పలుకుతున్నాడని రుజువును దేవుడు యరొబాంకు, ఇస్రాయేల్‌ప్రజకు చూపించాడు. ఇది వారికి తెలియడం ప్రాముఖ్యం. ఎందుకంటే ఇస్రాయేల్ చరిత్రలో అది బహు క్లిష్టమైన సమయం. నిర్గమ 4:1-9; ద్వితీ 18:21-22; హీబ్రూ 2:4 పోల్చి చూడండి.
4.బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి, వానిని పట్టు కొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండి పోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తిలేక పోయెను.
3. ఇశ్రాయేలీయులు.
(నిర్గమకాండము) 32:6,7,8,9,10
6.మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.
7.కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.
32:7 దేవుడు మోషేతో “నీ” ప్రజలు అంటున్నాడు. బహుశా ఇది మోషే వారి పక్షంగా చేయవలసిన విజ్ఞాపనలో తాను కూడా వారిలో ఒకడుగానే ఉండాలని ముందుగా హెచ్చరిక ఇవ్వడం అయివుండవచ్చు.
8.నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించిఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.
9.మరియు యెహోవా ఇట్లనెనునేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.
10.కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా – నిర్గమ. 32:6,7,8-10; నిర్గమ. 32:20
4. మనష్షే.
(రెండవ రాజులు) 21:11
11.యూదారాజైన మనష్షే యీ హేయమైన కార్యములను చేసి, తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను.
5. మనష్షే కుమారుడు ఆమోను.
(రెండవ రాజులు) 21:22
22.తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను.
1.హృదయములో విగ్రహము .
(యెహెజ్కేలు) 14:3
3.నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృద యములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొని యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా?
III. విగ్రహముల అంత్యదినములలో ఏమి చేయుదురు?
1. బయట పారవేయుదురు.
(యెషయా గ్రంథము) 2:20
20.ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను
2:20 తమ విగ్రహాలెంత పనికిమాలినవో చిట్టచివరకు మనుషులు గ్రహిస్తారు. నిజ దేవుని విశ్వాసులకు అంతకు ముందునుంచీ తెలిసి ఉన్న సత్యాన్ని వారూ గుర్తిస్తారు – కీర్తన 115:2-8.
4. మనుష్యుల మీదికి ఎలాంటి శిక్ష?
1.) అవమానము.
(యిర్మీయా) 2:26
26.దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలుకుటుంబము వారు సిగ్గుపడుదురునీవు మా తండ్రివని మ్రానుతోనునీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు, వారును వారి రాజులును వారి అధిపతులును వారి యాజకులును వారి ప్రవక్తలును అవమానము నొందుదురు.
2.) ఉరి.
(ద్వితీయోపదేశకాండము) 7:16
16.మరియు నీ దేవు డైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనముచేయుదువు. నీవు వారిని కటా క్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును.
3.) అగ్నిగుండము.
(ప్రకటన గ్రంథము) 21:8
8.పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
5.) దేశము మీదికి వచ్చే శిక్ష
1.) పాడుగా ఎడారుగా మారును.
(యిర్మీయా) 44:22
22.యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనము గాను ఆయన చేసెను.
2.) కరువు కలుగును.
(యెహెజ్కేలు) 14:13,14
13.నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండ జేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును
14.నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మునుమాత్రమే రక్షించు కొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ముగింపు : విగ్రహారాధన పాపము నుండి మనస్సు త్రిప్పుకొనగలవా?
ప్రశ్నలు – జవాబులు .. click here