రాహాబు రక్షణ – The Faith and Salvation of Rahab Telugu1

Written by biblesamacharam.com

Published on:

అంశం:రాహాబు రక్షణ పొందటానికి కారణాలు

The Faith and Salvation of Rahab Telugu

మూలవాక్యము : విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులవారిని

సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను.

(హెబ్రీయులకు) 11:31

31.విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపకపోయెను.

11:31 యెహో 2:1-21; 6:24-25. గొప్ప పాపం, అజ్ఞానంపై జయించే నమ్మకం, దేవుని శాపం నుంచి తప్పించే నమ్మకం ఇది (గలతీ 3:10-14; యోహాను 5:24 పోల్చి చూడండి).

11:31 A యెహో 6:22-25; యాకోబు 2:25; B మత్తయి 1:5; హీబ్రూ 3:18; C యెహో 1:1; 2:1-24; మత్తయి 1:1; 1 పేతురు 2:8; 3:20

1.) ఆమె దేవుని గూర్చి విన్నది.

 (యెహొషువ) 2:9,10

9.యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును.

2:9 A నిర్గమ 23:27; B ద్వితీ 2:25; C ఆది 35:5; నిర్గమ 15:15-16; యెహో 2:11; యోబు 19:25; కీర్తన 112:10; 115:16; ప్రసంగి 8:12; యిర్మీయా 27:5; హీబ్రూ 11:1-2; D ఆది 13:14-17; 15:18-21; నిర్గమ 3:6-8; 18:11; ద్వితీ 11:25; 28:10; 32:8; న్యాయాధి 7:14; 1 సమూ 14:15-16; 2 సమూ 17:10; 2 రాజులు 5:15; 7:6; యెషయా 19:1; నహూము 2:10; మత్తయి 20:15

10.మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. The Faith and Salvation of Rahab Telugu

 (రోమీయులకు) 10:13,14,15,16,17

13.ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.

14.వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?

15.ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారిపాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది

16.అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా?

17.కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. The Faith and Salvation of Rahab Telugu

2.) ఆమె విని గ్రహించినది.

 (యెహొషువ) 2:11

11.మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశ మందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.

2:11 A ద్వితీ 4:39; యెహో 7:5; యెషయా 13:7; B యెహో 5:1; C నహూము 2:10; ప్రకటన 6:16; D నిర్గమ 15:14; ద్వితీ 1:28; 20:8; యెహో 14:8; 1 రాజులు 8:60; కీర్తన 22:14; 83:18; 102:15; యిర్మీయా 16:19-21; దాని 4:34-35; 6:25-27; జెకర్యా 8:20-23

3.) ఆమె విశ్వసించినది.

 (హెబ్రీయులకు) 11:31

31.విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపకపోయెను.

ఉదా : అపో.కా. 16:31; లూకా 7:50

 (అపొస్తలుల కార్యములు) 16:31

31.అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి.

16:31 పాపవిముక్తి మార్గాన్ని తెలుసుకొందామని ఇష్టమున్న వారందరికీ జవాబు ఇక్కడ ఉంది. యేసుప్రభువునూ, ఆయన సందేశాన్ని ప్రకటించేవారంతా పదే పదే ఇచ్చిన జవాబు ఇదే (13:39; యోహాను 1:12; 3:16, 36; 5:24; 6:47; రోమ్ 5:1; గలతీ 2:16; ఎఫెసు 2:8-9; మొ।।). నిజ విశ్వాసం పశ్చాత్తాపంతో ఆరంభమవుతుంది. పౌలు ఇక్కడ పశ్చాత్తాపాన్ని గురించి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఆ మనిషి పశ్చాత్తాపపడుతున్నాడని స్పష్టమే. మనుషులు పశ్చాత్తాపపడవలసి ఉండగా పశ్చాత్తాపపడండని దేవుని సేవకులు చెప్పారు (2:38; 17:30; మత్తయి 3:2). ఇక్కడ పౌలు ఆ మనిషి కుటుంబాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉన్న పక్షంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ పాప విముక్తి, రక్షణ దయ చేయడంలో ఆనందిస్తాడు దేవుడు (11:14; ఆది 7:1; యెహో 2:11-13; 6:22-23; హీబ్రూ 11:7). The Faith and Salvation of Rahab Telugu

 16:31 A ఆది 17:7; యెషయా 45:22; మార్కు 16:16; యోహాను 1:12; 3:15-16, 36; 7:37-38; 11:25-26; అపొ కా 2:38-39; 4:12; 11:13-14; 15:11; 18:8; రోమ్ 5:1-2; 10:9-10; గలతీ 3:22, 26; ఎఫెసు 2:7-8; 1 యోహాను 5:10-13; B ఆది 18:19; యిర్మీయా 32:39; హబక్కూకు 2:4; యోహాను 6:40, 47; 20:31; అపొ కా 8:36; 13:38-39; 16:15, 32; రోమ్ 11:16; గలతీ 3:14

(లూకా సువార్త) 7:50

50.అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.

7:50 ఆమెకు పాపవిముక్తి కలిగించి శాంతిని ప్రసాదించినది దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ కాదు, క్రీస్తు పాదాల దగ్గర ఏడవడమూ కాదు. ఆమెకు పాపవిముక్తి కలిగించినది ఆమె నమ్మకమే. పాపవిముక్తి అంటే క్షమాపణ పొందడం, పాపభరితమైన జీవితంనుంచి విడుదల, దేవునితో సంబంధం సరి కావడం. రోమ్ 3:22-24; 5:1; గలతీ 2:16; 3:26; ఎఫెసు 2:8-9 చూడండి. The Faith and Salvation of Rahab Telugu

4. దేవుని పిల్లలను చేర్చుకొనెను.

 (హెబ్రీయులకు) 11:31

31.విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపకపోయెను.

ఉదా : మత్తయి 10:40

 (మత్తయి సువార్త) 10:40

40.మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.

10:40-42 క్రీస్తును స్వీకరించినవారు ఆయన్ను పంపిన తండ్రి అయిన దేవుణ్ణి స్వీకరించినట్టే. ఎందుకంటే క్రీస్తు తండ్రితో ఏకంగా ఉన్నాడు (యోహాను 10:30). క్రీస్తు శిష్యులను స్వీకరించినవారు క్రీస్తును స్వీకరించినట్టే. ఎందుకంటే శిష్యులు క్రీస్తుకు ప్రతినిధులు. ఆయన వారితో ఏకంగా ఉన్నాడు (అపొ కా 9:1-5). ఆయన శిష్యులు “చిన్నవారు”– వ 42; 18:2-3; యోహాను 13:33; 1 యోహాను 2:1. లోకం వారిని చిన్నచూపు చూస్తుంది. వారికి అనేక సార్లు ధనం, విద్య, పదవి, లోకసంబంధమైన సామర్థ్యాలు కొదువగా ఉంటాయి (1 కొరింతు 1:26-29). అయితే వారిపట్ల దయ చూపడం అంటే క్రీస్తుపట్ల దయ చూపడమే. వారిపట్ల ఎంత స్వల్పంగా దయ చూపించినా దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. 5:12 కూడా చూడండి. మనం దీన్ని నిజంగా నమ్మితే క్రీస్తు శిష్యులకు సహాయం చేసేందుకు వెనుకంజ వేయము. The Faith and Salvation of Rahab Telugu

5.) ఆమె వేడుకొనెను.

 (యెహొషువ) 2:13

13.నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించు నట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనెను.

6. దేవుని పిల్లలు చెప్పినట్లు చేసెను.

 (యెహొషువ) 2:18,19,20,21

18.నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి యింటివారి నందరిని నీయింట చేర్చుకొనుము.

19.నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగు దుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము.

20.నీవు మా సంగతి వెల్లడిచేసినయెడల నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి.

21.అందుకు ఆమెమీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ల నంపెను. వారు వెళ్లినతరువాత ఆమె ఆ తొగరుదార మును కిటికీకి కట్టెను.

7.దేవుని పిల్లలను దాచెను.

 (యెహొషువ) 24:15

15.యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను. The Faith and Salvation of Rahab Telugu

24:15 ఆది 18:19; నిర్గమ 23:24, 32-33; 34:15; ద్వితీ 13:7; 29:18; న్యాయాధి 6:10; రూతు 1:15-16; 1 రాజులు 18:21; కీర్తన 101:2; 119:106, 111-112; యెహె 20:39; యోహాను 6:67-68; అపొ కా 11:23


ప్రశ్నలు – జవాబులు .. click here 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: restricted