పురుగు నేర్పే పాఠాలు!
TELUGU-CHRISTIAN-MESSEGES-FOR-PASTORS
ప్రభువు పురుగులనుంచి, పక్షులనుంచి, జంతువుల నుంచి ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తాడు. అదికూడ ఆత్మీయ ప్రపంచంలోని సూత్రాలకు అనుగుణంగా మనకు నేర్పిస్తాడు. దావీదు నేను నరుడను కాను పురుగును అన్నాడు.
(కీర్తనల గ్రంథము) 22:6
6.నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.
22:6 ఇక్కడ యేసు తనను తాను పూర్తిగా అణచుకొని ఉన్నాడు. దేవుడు తన పూర్వీకుల ప్రార్థనలకు జవాబిచ్చాడు. వారికంటే, అసలు మానవులందరి కంటే అల్పుడినని యేసు చెప్పుకొన్నాడు. “ఉన్నవాడను” అనే మహా ఘనుడు (నిర్గమ 3:14-15; యోహాను 8:24, 58) “నేను పురుగును” అంటున్నాడు. పురుగు అంటే మనుషుల చెప్పుల క్రింద నలిగిపోయే అల్పజీవి. పురుగు కంటే బలహీనమైనదీ వికారమైనదీ మనుషుల తృణీకారానికి గురయ్యేది మరేదైనా ఉందా? అయితే తాను పురుగునని యేసు ఎందుకు చెప్పుకున్నాడు? ఆయన పాపులకు ప్రతిగా వారిలో అతి నీచులు, హీనులు, బలహీనుల స్థానంలో ఉన్నాడు కాబట్టే గదా. పాపానికి వ్యతిరేకంగా మండే దేవుని కోపాగ్ని భరిస్తూ పాపి స్థానంలో నిలిచి ఉండబట్టే గదా.
22:6 A యోబు 25:6; యెషయా 49:7; 53:3; B యెషయా 41:14; C మత్తయి 11:19; 27:20-23; D కీర్తన 31:11; 69:7-12, 19-20; 88:8; విలాప 3:30; మత్తయి 12:24; యోహాను 7:15, 20, 47-49; 8:48; హీబ్రూ 13:12; ప్రకటన 15:3; E కీర్తన 31:1
I పురుగు బుస కొట్టదు.
(కీర్తనల గ్రంథము) 37:8
8.కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము.
37:8 A యోబు 5:2; సామెత 14:29; 16:32; ఎఫెసు 4:26, 31; కొలస్సయి 3:8; యాకోబు 1:19-20; 3:14-18; B యోబు 18:4; కీర్తన 31:22; యోనా 4:1, 9; లూకా 9:54-55; C 1 సమూ 25:21-23; యిర్మీయా 20:14-15; D కీర్తన 73:15; E కీర్తన 116:11
(ఎఫెసీయులకు) 4:26
26.కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.
4:26 కీర్తన 4:4; మత్తయి 5:22. కోపం వ 31లో చెప్పిన పాపాల్లో మనల్ని పడెయ్యగలదు. విశ్వాసుల హృదయాల్లో ఇది మొలకెత్తిన దినాన్నే దాన్ని పెరికివేయాలి.
4:26 A సంఖ్యా 20:10-13, 24; కీర్తన 4:4; 37:8; సామెత 14:29; 19:11; ప్రసంగి 7:9; మత్తయి 5:22; రోమ్ 12:19-21; ఎఫెసు 4:31-32; యాకోబు 1:19; B నిర్గమ 11:8; 32:21-22; సంఖ్యా 25:7-11; నెహెమ్యా 5:6-13; కీర్తన 106:30-33; సామెత 25:23; మార్కు 3:5; 10:14; C ద్వితీ 24:15
(ఇది – పగ, కక్ష, కోపమునకు సాదృశ్యం! అన్నలు కీడు చేసినా యోసేపు వారిపై ప్రతీకారం తీర్చుకోలేదు – “కోపం తెచ్చుకోవటం ఎవరికైనా తేలికేగానీ, అవసరమైన వ్యక్తిపై, అవసరమైన సమయంలో, అవసరమైన ప్రయోజనం కోసం, అవసరమైన కోపం తెచ్చుకోవటం మాత్రం సులభం కాదు” అన్నాడు అరిస్టాటిల్)
2. పురుగుకు వెన్నెముక లేదు.
(యోహాను సువార్త) 4:34
34.యేసు వారిని చూచి నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.
4:34 దేవుని సంకల్పం ప్రకారం ఆయన పని చెయ్యడంలోనే యేసుకు అసమానమైన సంతృప్తి ఉంది (5:30; 6:38; 8:29; 9:4; 14:31; 15:10; 17:4 పోల్చి చూడండి). దేవునికి విధేయత చూపుతూ, హృదయ పూర్వకంగా ఆయన పనిలో నిమగ్నమై, ఇతరులను క్రీస్తుపై నమ్మకంలోకి నడిపిస్తూ ఉండడంలో ఉన్న ఆనందంతో ఈ లోకంలో ఉన్న అన్ని శ్రేష్ఠమైన పదార్థాలతో విందుల్లో మునిగి తేలడం సాటి రాదు.
4:34 A యోబు 23:12; కీర్తన 40:8; మత్తయి 26:39; లూకా 15:10; 19:10; యోహాను 4:32; 5:30, 36; 6:33, 38; 17:4; 19:30; హీబ్రూ 12:2; B యెషయా 61:1-3; అపొ కా 20:35; C లూకా 15:4-6
(వెన్నెముక స్వచిత్తానికి సాదృశ్యం! యేసు క్రీస్తు నా తండ్రి చిత్తం నెరవేర్చటం నాకు భోజనమూ పానీయమును అన్నాడు)
3. పురుగు విరగదు.
(మొదటి కొరింథీయులకు) 9:19,20,21,22
19.నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని.
20.యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.
21.దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని.
22.బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.
(అంటే, వంగిపోవు స్వభావము అన్నమాట! “అల” వస్తూండగా దానికి నిటారుగా నిలబడితే అది మనల్ని కొట్టేస్తుంది. మనం కాసేపు వంగిపోతే, అది మన మీదినుంచి వెళ్ళిపోతోంది. అలాగే మనం కొన్నిసార్లు పరిస్థితిని బట్టి నడుచుకోవలసి ఉంటుంది)
4. పురుగు బండక్రింద మరుగై జీవిస్తుంది!.
(గలతీయులకు) 2:20
20.నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.
(“నన్ను” కాదు – క్రీస్తునే నాలో చూడాలి అన్న అభిలాషగల జీవితం ఇది! అంతేకాదు, ఏకాంత ప్రార్థన జీవితానికి కూడ ఇది గురై ఉన్నది! క్రీస్తు సిలువ చాటున మరుగైన జీవితము మనం కలిగి యుండటం ముఖ్యం)
- నువ్వు పై లక్షణాలు కలిగిన పురుగువా? తోకపై నుంచొని పడగ ఆడించే పామువా?
ప్రత్యక్ష గుడారం నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.