ఇతరులకు సహాయం చేయండి
Sunday School Story
జ్ఞానసత్య స్వరూప్ చాలా ధనవంతుడు. అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్ధన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు విశ్రాంతి కొరకై ఊటీ వెళ్లాడు. ఊటీలో నిర్మలమైన ఆకాశమూ, అందమైన పర్వతాలూ, చల్లని గాలి, అందమైన చెట్లూ, పుష్పాలు చూస్తూ – “దేవా! నీవు ఈ భూమిని ఎంత అందంగా చేశావు” అంటూ దేవునిని స్తుతించ సాగాడు.
అంతలో ఒక స్త్రీ కుంటుతూ అక్కడకు నడిచివచ్చింది. ఆమె బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఆమె చేతిలో చిన్నబిడ్డ కూడా ఉన్నది. ఆ బిడ్డ చాలా మురికిగా ఉన్నది. ఆమె చాలా చిక్కిపోయి ఎముకలు బయటకు కనబడుతూ ఉన్నవి.
దేవుడు సృష్టించిన అందమైన సృష్టిని చూసి ఆనందిస్తున్న జ్ఞాన సత్య స్వరూప్ వీరిని చూడగానే చాలా దుఃఖపడ్డాడు.
మహా కనికరం గల దేవుడు ఇంత మహిమగల చక్కని సృష్టి చేసి ఇలాంటి దీనావస్థలో ఉన్న స్త్రీని, ఆమె బిడ్డను కూడా సృష్టించాడు. వారి గురించి, వారి క్షేమం గురించి, వారి అభివృద్ధి గురించి దేవుడు ఎందుకు ఏ యేర్పాటూ చేయలేదు? అనుకుంటూ మనస్సులో తలంచుకొంటుండగా, వెంటనే దేవుడు అతనితో మాట్లాడాడు…
“నేను ఎప్పుడో ఏర్పాటు చేసాను. నేను నిన్ను సృష్టించాను”
మనచుట్టూ మనకంటే దీనులుగా ఉన్నవారిలో కొందరిని మనం ఆదుకోవలసిన బాధ్యత మనపై ఉన్నది. మనం ఎప్పుడైతే ఇతరులకు సహాయపడతామో అప్పుడు దేవుడు మనకు సహాయపడతాడు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కప్రకారం ప్రపంచంలో 40 శాతం ప్రజలు సరైన ఆహారం లేకుండా బాధపడ్తున్నారట. మరొక విచిత్రమైన లెక్క ఏమిటంటే, ప్రపంచ జనాభాలో 40శాతం మంది అధిక బరువుతో బాధపడ్తున్నారని లెక్కగట్టి చెప్పారు. 40శాతం ప్రజలు తమకు కావలసిన దానికంటే ఎక్కువగా భుజిస్తున్నారు.
వారు అధికంగా భుజించేది లేని ప్రజలకు అందజేస్తే అందరూ సుఖముగా ఉండవచ్చు. దేవుడు అంతా సమముగా సృష్టించాడు. కాని మానవుడు స్వార్థపరుడై ఇతరులకు ఇవ్వవలసిన దాన్ని తాను దోచుకోవటం వలన కొందరు అధిక బరువుతో బాధపడుచున్నారు. మరికొందరు లేమితో బాధపడుచున్నారు.
దీనులను ఆదుకొనుటయే దేవుణ్ణి సేవించుట అనేసంగతి జ్ఞాపకం చేసుకుందాం.
పిల్లలూ, కథ విన్నారుగా! మీకు ఉన్నదానిని, మీతోటి వారితో పంచుకుంటే, ప్రభువు మిమ్మును బట్టి ఎంతో సంతోషిస్తాడు. బైబిలు – నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అని సెలవిస్తోంది.
యేసయ్య కూడా మనతో అన్నీ పంచుకున్నారు. ముఖ్యంగా తన ప్రేమను మనకు ఇచ్చాడు. ఆయన ఎప్పుడైనను దీనదశలో ఉన్నవారిని చూసినప్పుడు, ఎంతో జాలిపడేవాడు. మనం పలాని చోట ఉన్నామంటే, మన చుట్టు ప్రక్కల నుండే లేమిగల వారి కొరకే ప్రభువు మనల్ని అక్కడ నిలబెట్టారని గ్రహించుదాం. మీరేమైతే చేస్తారో… ప్రభువు తప్పక జ్ఞాపకం చేసుకొని గొప్ప బహుమానాలతో మిమ్ములను తృప్తిపరుస్తాడు.
“దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును. అట్టివాడు దీవెన నొందును” అని సామెతలు 22వ అధ్యాయం 9వ వచనం చెబుతోంది.
Sunday School Story Sunday School Story Sunday School Story Sunday School Story Sunday School Story Sunday School Story Sunday School Story Sunday School Story Sunday School Story Sunday School Story Sunday School Story Sunday School Story