మహిమ వస్త్రం.
Sunday School Stories In Telugu
అది కొరియా దేశం. డిశెంబరు నెల. చలి గడగడ వణికిస్తుంది. మంచు దట్టంగా కురుస్తోంది. ఆ సమయంలో బాకాయూన్ అను ఒక గర్భిణీ స్త్రీ తనకు ప్రసవ సమయం ఆసన్నమైనదని గుర్తించింది. కొంచెం దూరంలో ఉన్న మిషన్ ఆస్పత్రికి వెళితే తనకు సహాయం లభిస్తుందని ఆమె బయలుదేరింది.
చలిగాలి బాగా వీస్తుంది. ఆమె నడవలేక బ్రిడ్జి క్రిందకు చేరింది. అడుగు తీసి అడుగు వేయలేకపోతుంది. అక్కడే ఆ బ్రిడ్జి క్రిందనే ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. తాను లేచి తన బిడ్డను ఎత్తుకొని ఆసుపత్రికి వెళ్లలేనని గ్రహించింది. పుట్టిన ఆ బిడ్డ తల్లి కడుపులో నుంచి వచ్చి బయట చలిలో ఇమడలేకపోతున్నాడు. ఆ చిన్నవాడు గడగడ వణికిపోతూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండిపోతే, తానూ, ఆ బిడ్డయు ప్రాణాలతో బతికి బయటపడలేరు అని గ్రహించింది. వెంటనే తాను తన బిడ్డను కాపాడుకొనుటకు తన బట్టలను విప్పి ఆ చిన్నవానికి వెట్ట తగిలేట్టుగా చుట్టింది. చిన్నవాడు ఏ అపాయం లేకుండా చుట్టబడిన మూటలో క్షేమంగా ఉన్నాడు.
మరునాడు ఉదయం మిషన్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసే “మిస్ వాట్సన్” గారు బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తున్నారు. బ్రిడ్జి క్రింద ఒక శిశువు ఏడుస్తున్న స్వరం తనకి వినిపించింది. ఆమె వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి తొంగి చూసింది. బిడ్డ ఆకలికి ఏడుస్తున్నాడు. ప్రక్కనే తల్లి పడుకొని బట్టలు లేకుండా దిగంబరిగా ఉంది.
అప్పటికే ఆ చలికి బిగుసుకొనిపోయి చనిపోయింది ఆ తల్లి!
ఆ నర్స్ ఆ బిడ్డను తీసుకొని తన ఇంటికి వెళ్లింది. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఆ బిడ్డకు “సూపార్క్” అని పేరు పెట్టింది. అప్పటికే ఆ పిల్లవానికి 12 సంవత్సరములు నిండాయి. ఒకరోజు ఆ నర్స్ ఆ పిల్లవాని స్టోరీ చెబుతుంది. తన తల్లెవరో? తనెక్కడ పడిపోయి ఉంటే – అక్కున చేర్చుకొని ఇంతవరకు పోషించుకుంటూ వచ్చినదో… తనకు జన్మనిచ్చిన తల్లి చలికి ఎలాగు బిగుసుకుపోయి వేదనతో చనిపోయిందో వివరించింది. అంతేకాదు, నీవు జన్మించిన దినం – ఓ క్రిస్మస్ రోజు కావడం విశేషం అని చెప్పింది.
అప్పుడా పిల్లవాడు తనను పెంచుతున్న నర్సుతో “అమ్మా! నా తల్లి సమాధిని చూడాలనుకుంటున్నాను. ఒకసారి నాకు చూపించగలరా? ప్లీజ్” అంటూ వేడుకున్నాడు. ఆమె అతన్ని తీసుకొని తన తల్లి సమాధి వద్దకు వెళ్లింది. ఆ అబ్బాయి తన తల్లి సమాధివద్ద నిలబడి ప్రార్ధన చేసాడు. అతడు ప్రార్థిస్తూ ఉండగా అతని కళ్లవెంట కన్నీరు కారసాగింది. అతడు తన కోటు విప్పాడు, లోపలున్న స్వెట్టర్ని కూడా విప్పేసాడు. అతన్ని చూస్తున్న నర్స్ చాల చలిగా ఉంది. చలికి బిగుసుకుపోతాడేమో అనుకొని – “నాయనా, సూపార్క్ ఎందుకు ఆ బట్టలను తీసేస్తున్నావు. చలిగా ఉంది. వాటిని వెంటనే తొడుక్కో” అంటూ బతిమాలింది. కాని ఆ అబ్బాయి ఆ మాటలను వినిపించుకోలేదు. అతడు షర్టు బనియన్ తీసి ఆ బట్టలన్నీ సమాధిపైన పెట్టాడు. అతడు మోకరించినాడు. ఆ భయంకరమైన చలిలో గడగడ వణకడం ప్రారంభించాడు. ఆ నర్స్ వచ్చి త్వరత్వరగా బట్టలు తీసి తనకు తొడుగుతూ ఉంటే, సమాధిలోని తనకు తెలియని తల్లితో ఏడుస్తూ….
“అమ్మా, ఆ రోజు నీకు ఇంతకంటే చలిగా ఉందా?” అని బిగ్గరగా ఏడ్చాడు.
పిల్లలూ! వింటున్నారా? యేసుప్రభువు కూడా ఈ లోకమునకు వచ్చినప్పుడు పరలోకములో తన మహిమ వస్త్రములను, రాజ వస్త్రములను తీసివేసి సామాన్యునిగా ఈ లోకంలోనికి ప్రవేశించారు. మీకును నాకును రక్షణ ఇవ్వాలని ఆయన ఎంతగానో ఆశపడ్డారు. ఆయన మన అందరి కొరకు శిలువలో బట్టలు లేని స్థితిలో, దిగంబరిగా చనిపోయారు. మనలను నిత్యజీవము (పరలోకము)నకు చేర్చుట కొరకై – ఆయన ఈ లోకంలో అనేక హింసలు పడి ప్రాణమును అర్పించుకున్నారు. మరి మీరు, మనలను ఎంతో ప్రేమించుచున్న యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరించారా? ఇప్పుడే మీరు యేసయ్య దగ్గర మీ పాపములను ఒప్పుకొని ప్రార్థించండి – దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక!
Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu Sunday School Stories In Telugu