తెలివైన చిలకమ్మా – Sunday School Parrot Story In Telugu

Written by biblesamacharam.com

Published on:

తెలివైన చిలకమ్మా.

Sunday School Parrot Story In Telugu

 పిల్లలూ ఎలా ఉన్నారు? బావున్నారా? మీ చదువు, మీ ప్రార్ధన ఎలా ఉంది? ఆత్మీయంగా దినదినం అభివృద్ధి అవుతున్నారా? మీ కొరకు ప్రార్ధిస్తున్నాం. నేటి పిల్లలే రేపటి దేవుని గొప్ప సేవకులు. మీలో ఎంతో మందిని గొప్ప సాధనాలుగా దేవుడు వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక! సరే మీకు కథ చెబుతాను వినండి. 

 ఒక వేటగాడు బాణాలు తీసుకొని అడవికి వెళ్లాడు. అడవంతా తిరిగి తిరిగి ఒక చిలుకను పట్టి తెచ్చాడు. దానిని పంజరంలో పెట్టి, కూరకు కావలసిన సరుకులు సిద్ధం చేయమని చెప్పి, ఒక కత్తి తీసుకొని బండపై పదును పెడుతున్నాడు. చిలుక వానిని… వాడు పదును పెట్టే కత్తిని చూసి – “ఓయ్, బోయవాడా!” అంటూ పిల్చింది. తలపైకెత్తి చూసాడు. తనకు ఎవరూ కనిపించలేదు. మరల తన పనిలో నిమగ్నమైపోయాడు. మరల చిలుక పంజరంలోంచి – “ఓయ్ బోయవాడా, నిన్నే పిలుస్తున్నాను” అంది. 

 అతడు మరల తలపైకెత్తి చూసి నన్నెవరబ్బా పిల్చింది? యిక్కడ ఎవరూ లేరే” అనుకుంటూ బండపై మరల కత్తిని పదును పెడుతున్నాడు. మూడవసారి, “ఓయ్, బోయవాడా, నిన్నే నేను పిలుస్తున్నాను. పంజరం వైపు చూడు” అంది చిలుక. 

 చిలుకమ్మేనా నన్ను పిల్చింది! అనుకుంటూ పంజరం వేపు కదిలాడు. 

 “ఏం చేస్తున్నావు” అని అడిగింది. “చూస్తూనే ఉన్నావుగా, ప్రత్యేకంగా ఏం చేస్తున్నావు? అంటూ అడగడం ఎందుకు?” అన్నాడు బోయవాడు. 

 “కత్తికి ఎందుకు పదును పెడుతున్నావు?” అని అడిగింది. “ఆ మాత్రం నీకు తెలీదా? పగలు అంతా ఎండలో కష్టపడి నిన్ను పట్టి తెచ్చాను. నిన్ను కోసుకొని కూరవండుకొని తినడానికీ” అన్నాడు. 

 “అయ్యయ్యో, ఒక్క పూట కూటి కొరకు నా ప్రాణాలు తీస్తావా? నన్ను వదిలెయ్యి” అంది చిలుక. “ఆఁ! నిన్ను వదిలేయడానికేనా ఎండలో బాధపడి నిన్ను 

 తెచ్చుకుంది?” అన్నాడు. “బాబ్బాబు … నన్ను వదిలేయ్. నీవు గనుక నన్ను వదిలేస్తే నీకు రెండు లక్షలు ఇస్తాను” అంది చిలుకమ్మ. 

 “రెండు లక్షలా…!” అంటూ ఆశ్చర్యపోయాడు బోయవాడు. “అవును, రెండు లక్షలు ఖచ్చితంగా నేను ఇస్తాను. నేను మాట తప్పను. నన్ను వదిలేయ్” అని బతిమాలుకుంది. “సరే, నిన్ను వదిలేస్తాను. మాట తప్పవుగా!” అన్నాడు బోయవాడు. 

 “నేను మాట తప్పే రకం కాదు. మా జాతి అటువంటిది కానే కాదు” అంది. 

 “సరే” నంటూ చిలుకను వదిలేసాడు. వెంటనే అది రెక్కలు ఆడించుకుంటూ తుర్రుమని ఎగిరి తన యింటిముందు ఉన్న వేపచెట్టు చిటారు కొమ్మపై కూర్చుంది. అతడు పరుగెత్తుకొని వెళ్లి – “చిలుకమ్మా మాట తప్పొద్దు. రెండు లక్షలు ఇటివ్వు” అన్నాడు. 

 మొదటి లక్ష తీసుకో – “దొరికిన దానిని పోగొట్టుకోవద్దు” అంది చిలుక. 

 “అబ్బా, లక్షరూపాయలు ఇయ్యకపోయినను, లక్షరూపాయల వంటి మాట చెప్పావు. మరి రెండవ లక్ష?” అన్నాడు. 

 “పోయిన దాని గురించి బాధపడొద్దు” అంది చిలుక. 

 ప్రియమైన పిల్లలూ, కథ విన్నారుగా! దేవుని కొరకు సాక్ష్యమిచ్చే సమయాలూ, వాక్యం వినే అవకాశాలూ, బైబిలు చదివే తరుణాలూ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? “దొరికిన దానిని పోగొట్టుకోవద్దు” అనే సూత్రంపై మిమ్మును మీరే కట్టుకుంటుండాలి. 

 దేవుని పని విషయంలోగానీ, దేవుని కొరకు గానీ మీరేమి చేయవలసి వచ్చినను మీరు అటువంటి అవకాశమును పోగొట్టుకోవద్దు. ఇతరులకు సహాయం చేసే విషయంలో కూడా మీరు ఆ అవకాశం పోగొట్టుకోవద్దు. 

 ఒకవేళ మీరు ఇంతకు ముందు అటువంటి అవకాశాలు పోగొట్టుకున్నారేమో! అయినను మీరు పోయిన దానిని గురించి బాధపడవద్దు. ర్యాంకు పోగొట్టుకున్నారా? మంచిగా చదువుకోవాలి అనుకొని చదవలేకపోయారా? మీకు వచ్చిన బంగారు అవకాశాలను జారవిడుచుకున్నారా? మీరు బాధపడవద్దు. మరల మీ జీవితములో గొప్ప తరుణాలను ప్రభువు తేబోవుచున్నాడు. 

 సౌలు రాజును దేవుడు విసర్జించాడు. అందుకు కారణం – సౌలు యొక్క అవిధేయతయే. దాని విషయంలో సమూయేలు ప్రవక్త మిక్కిలి బాధపడుచున్నప్పుడు, దేవుడు సమూయేలుతో – ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? అంటూ ప్రశ్నించాడు. (1సమూయేలు 16:1) 

 పోగొట్టుకున్న దాన్ని గూర్చి సమూయేలు చింతించుట దేవునికి ఇష్టం లేదు. అయితే అతడు చేయవలసిన పని మరొకటి ఉంది. తైలం కొమ్ము తీసుకొని బేత్లహేముకి వెళ్లి దావీదుకి అభిషేకము చేయడం అనేది ఒకటి సిద్ధముగా ఉంది. దొరికిన ఈ అవకాశమును సద్వినియోగం చేసుకుంటే చాలు! 

 “యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి” యెషయా 55:6. 

\

 

 

 

 

 

 

 

 

Sunday School Parrot Story In Telugu Sunday School Parrot Story In Telugu Sunday School Parrot Story In Telugu Sunday School Parrot Story In Telugu Sunday School Parrot Story In Telugu Sunday School Parrot Story In Telugu Sunday School Parrot Story In Telugu


బైబిల్ ప్రశ్నలు జవాబుల కొరకు .. click here 

 

 

 

 

 

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted