క్రీస్తు దేహము
Sevakula Prasangaalu Bible Telugu
1.) శిరము ముండ్ల కిరీటమును ధరించెను.
(మత్తయి సువార్త) 27:29
29.ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూనియూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి
27:29 A యెషయా 53:3; మత్తయి 20:19; B మార్కు 15:18; C కీర్తన 69:19-20; యెషయా 49:7; యిర్మీయా 20:7; మత్తయి 26:49; 27:37; లూకా 23:36-37; యోహాను 19:2-3; హీబ్రూ 12:2-3; D కీర్తన 35:15-16; E కీర్తన 69:7
2.) చెక్కిళ్ళు రాణువ వారి అరచేతి దెబ్బలు తినెను.
(యోహాను సువార్త) 18:22
22.ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.
18:22 యోబు 16:10; 30:10-12; యెషయా 50:5-7; యిర్మీయా 20:2; మీకా 5:1; మత్తయి 26:67-68; మార్కు 14:65; లూకా 22:63-64; యోహాను 18:3; 19:3; అపొ కా 23:2-5
3.) ముఖము ఉమ్మివేయబడెను.
(మార్కు సువార్త) 15:19
19.మరియు రెల్లుతో ఆయన తలమీదకొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారముచేసిరి.
15:19 A మార్కు 14:65; B ఆది 24:52; 43:28; 1 రాజులు 19:18; ఎస్తేరు 3:2-5; యోబు 13:9; 30:8-12; కీర్తన 22:6-7; 35:15-17; 69:12, 19-20; యెషయా 45:23; 49:7; 50:6; 52:14; 53:3-5; మీకా 5:1; మత్తయి 20:18-19; మార్కు 9:12; 10:34; లూకా 18:32-33; 22:63; 23:11, 36; రోమ్ 11:4; 14:10-11; ఫిలిప్పీ 2:10; హీబ్రూ 12:2-3; 13:13
4.) భుజము సిలువను గొల్గొతావరకు మోసెను.
(యోహాను సువార్త) 13:5
5.అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.
13:5 A లూకా 7:44; B ఆది 18:4; 19:2; కీర్తన 51:2; 1 తిమోతి 5:10; C 1 సమూ 25:41; 2 రాజులు 3:11; హీబ్రూ 10:22; D నిర్గమ 29:4; లేవీ 14:8; 2 రాజులు 5:10-13; యెషయా 1:16; యెహె 36:25; జెకర్యా 13:1; లూకా 7:38; యోహాను 13:8, 10, 12-14; 19:34; అపొ కా 22:16; 1 కొరింతు 6:11; ఎఫెసు 5:26; తీతు 3:3-5; 1 యోహాను 1:7; 5:6; ప్రకటన 1:5; 7:14
5.) చేతులు శిష్యుల పాదములను కడిగెను.
(యోహాను సువార్త) 13:5
5.అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.
6.) కన్నులు యెరూషలేము కొరకు ఏడ్చెను.
(లూకా సువార్త) 19:41
41.ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి
19:41 సిలువ, హింసలు అక్కడ ఆయనకోసం ఎదురు చూస్తున్నాయి. గానీ ఆయన తనకోసం ఏడవలేదు. దుఃఖాలకు గురి అయినవాడు అని ఆయనకు పేరు (యెషయా 53:3). అయితే ఆయన దుఃఖం ఇతరుల విచారకరమైన స్థితి కారణంగానే.
7.) చెవులు సిలువపై దొంగయొక్క ప్రార్థనను వినెను.
(లూకా సువార్త) 23:43
43.అందుకాయన వానితోనేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.
23:43 “పరమానంద నివాసం”– 16:22 నోట్ చూడండి. దీన్ని పరదైసు అని కొందరు అంటారు. ఈ నేరస్థుడి విషయాన్ని గమనిస్తే ఒక వ్యక్తి పాపవిముక్తి పాందడానికి అతడు చేయవలసినదంతా మనకు అర్థం అవుతుంది. బాప్తిసం గాని, సంఘ సంబంధమైన సంస్కారాలు, ఆచారాలు గాని, ఏ విధమైన సత్కార్యాలు గాని ఏమీ లేకుండానే అతడు పాపవిముక్తి పొందాడు. వెనువెంటనే పాపవిముక్తి పొంది తాను చనిపోయిన రోజునే పరమానంద నివాసం చేరుకున్నాడు. గానీ ఏదో ఆత్మలను శుద్ధి చేసే లోకం (పర్గటోరి) కాదు. విమోచన కోసం అతడు ఎదురు చూడనవసరం లేదు. అతడు మరి కొంత కాలం జీవించి ఉంటే గనుక తప్పకుండా బాప్తిసం పొందేవాడే, మంచి పనులు చేసేవాడే అనుకోవచ్చు. అయితే అవేమీ లేకుండా ఇతడు పాపవిముక్తి పొందడం చూస్తుంటే పాపవిముక్తికి ఇవి అవసరం కాదని అర్థమౌతున్నది. అదంతా పశ్చాత్తాపం, నమ్మకాల మూలంగా కేవలం దేవుని కృపవల్లే జరిగింది. ఎఫెసు 2:8-9; తీతు 3:3-7. కేవలం క్రీస్తు తానే స్వయంగా మానవులకు దేవుని కృప లభించే మార్గం.
8.) వక్షస్థలము ప్రియశిష్యుడు యోహాను అనుకొనెను.
(యోహాను సువార్త) 13:23
23.ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను
13:23 A యోహాను 19:26; 20:2; 21:7, 20; B యోహాను 11:3, 5, 36; ప్రకటన 1:16-18; C 2 సమూ 12:3; యోహాను 1:18; 13:25; 21:24
9.) నడుము బానిసవలె తువాలును కట్టుకొనెను.
(యోహాను సువార్త) 13:4
4.భోజన పంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుమునకు కట్టుకొనెను.
13:4-5 తాను కుమారుడైన దేవుణ్ణని, తండ్రి అయిన దేవుని దగ్గరనుంచి వచ్చానని, అక్కడికే తిరిగి వెళ్ళనున్నానని ఆయనకు తెలుసు. అయినా ఇక్కడ ఆయన అల్ప స్థితిలోని దాసుడు చేసే పనికి సమకట్టాడు. ఇది ఆయన అణకువను వెల్లడి చేస్తున్నది. సేవలు పొందడానికి మారుగా సేవించడానికి ఆయన మనసును ఇది తెలియజేస్తున్నది. మత్తయి 11:29; 20:25-28; ఫిలిప్పీ 2:6-8 చూడండి. ఈ రోజుల్లో సేవకులం, శిష్యులం అని చెప్పుకునే చాలామందికి ఆయనకూ ఎంత తేడా!
10. వీపు పిడి గుద్దులను, కొరడా దెబ్బలను తినెను.
(మార్కు సువార్త) 15:15
15.పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయనప్పగించెను.
15:15 A మత్తయి 27:26; యోహాను 19:1; B యెషయా 50:6; C కీర్తన 57:11; మార్కు 10:34; యోహాను 19:16; 1 పేతురు 2:24; D కీర్తన 129:3; సామెత 29:25; మత్తయి 20:19; లూకా 18:33; 23:24-25; అపొ కా 24:27; 25:9; గలతీ 1:19
11.) పాదములు సముద్రపు తుఫాను కెరటములపై నడచెను.
(మార్కు సువార్త) 6:48
48.అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను.
6:48 A యోబు 9:8; లూకా 12:38; 24:28; B ఆది 19:2; 32:26; నిర్గమ 14:24; 1 సమూ 11:11; కీర్తన 93:4; 104:3; యెషయా 54:11; మత్తయి 14:24; యోహాను 1:13
12.) మోకాళ్ళు ప్రార్థించుటకై మోకరిల్లెను.
(లూకా సువార్త) 22:41
41.ఆ చోటు చేరి ఆయన వారితోమీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి
13.) దేహము సిలువ వేయబడెను.
(లూకా సువార్త) 23:23
23.అయితే వారొకేపట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.
All Pdf…………..Download