ఇంకా నేర్చుకొనుడి!
Pastors Messages In Telugu Bible
1.) విధేయత నేర్చుకొనుడి.
(హెబ్రీయులకు) 5:8
8.ఆయన,కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.
5:8 “విధేయత…నేర్చుకున్నాడు”– అంటే ఒకప్పుడు దేవుని పట్ల అవిధేయంగా ఉండి క్రమంగా విధేయత నేర్చుకున్నాడని కాదు. అవిధేయత పాపం, ఆయన ఒక్క సారైనా అవిధేయంగా లేడు (యోహాను 4:34; 6:38; 8:29; ఫిలిప్పీ 2:6-8; 1 పేతురు 2:21-22). అసలు విధేయత అంటే ఏమిటో, ఈ భూమిమీద మనిషిగా విధేయత చూపడంలో ఎంత త్యాగం, విషమ పరీక్షలు, బాధలు ఇమిడివున్నాయో అనుభవ పూర్వకంగా నేర్చుకున్నాడాయన. “గిన్నె” (మత్తయి 26:39) తన ఎదురుగా ఉన్నప్పుడు విధేయత అనేది తేలిక విషయం కాదని అనుభవాన్ని బట్టి నేర్చుకున్నాడు.
2.) మేలు చేయ నేర్చుకొనుడి.
(యెషయా గ్రంథము) 1:17
17.కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.
1:17 “మంచి”– కీర్తన 34:14; 37:27. చెడుతనం చేయడం మనుషులు వేరే నేర్చుకోనక్కరలేదు. ఊపిరి తీసుకున్నంత సహజంగా అది వారికి అబ్బుతుంది (ఆది 6:5; 8:21; కీర్తన 51:5; 58:3; యిర్మీయా 17:9; మత్తయి 15:19-20). సరైనది చెయ్యడమే నేర్చుకోవలసి ఉంది. ఒక్కడే అయిన నిజ దేవుని వైపుకు మళ్ళడం ద్వారానూ, దేవుని వాక్కు పఠిస్తూ, దానికి లోబడుతూ ఉండడం ద్వారానూ దీన్ని సాధించవచ్చు. దేవుని వాక్కు లేకుంటే కొన్నిసార్లు మనుషులకు “మంచి” ఏమిటో చూచాయగానైనా తెలియదు (5:20 పోల్చి చూడండి). దేవుని వాక్కు మనకెంత బాగా తెలిస్తే మంచి ఏమిటో అంత బాగా బోధపడుతుంది. ఈ భూమిపై ఉన్నంత కాలం దేవుని ప్రజలు మంచి చేయడం నేర్చుకుంటూనే ఉండాలి.
3.) సంతృప్తి కల్గియుండ నేర్చుకొనుడి.
(ఫిలిప్పీయులకు) 4:11
11.నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను.
4:11-12 1 తిమోతి 6:6-8; హీబ్రూ 13:5; లూకా 3:14. భూమిపై నిజమైన ధనికుడెవడు? తనకున్నదానిలో తృప్తి చెందేవాడే. తృప్తి అనేది పౌలు “నేర్చుకున్న” గుణం, స్వతహాగా అతనికి ఉన్నది కాదు. దేవుణ్ణి నమ్మినవారి హృదయాలకు కావలి ఉండే శాంతితోబాటే ఈ తృప్తి కూడా ఉంటుంది. పౌలు ఏ పరిస్థితుల్లో తృప్తిగా ఉండడం నేర్చుకున్నాడో వాటిలో కొన్ని చూడండి – 2 కొరింతు 4:8-9; 6:4-10; 11:23-27. ఈ లేఖ అతడు ఒక భవంతిలో ఉండి సిరిసంపదలతో తులతూగుతూ రాయడం లేదు. ఖైదులో ఉండి రాస్తున్నాడు – 1:12-13. ధనం, ఆస్తిపాస్తులు, విలాసాలు కూడబెట్టుకోవాలన్న కొందరి ఆశలు దేవుని వాక్కుకు వ్యతిరేకం, ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో హానికరం.
4.) ప్రత్యుపకారము చేయుట నేర్చుకొనుడి.
(మొదటి తిమోతికి) 5:4
4.అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.
“తమ భక్తి…చూపేందుకు”– ప్రతి విశ్వాసికి ఇది ఎంతో ముఖ్యం. సత్యాన్ని కేవలం నమ్మడం మాత్రమే కాదు, ఆచరించాలి కూడా. దేవుడేదో చెప్పాడని తెలుసుకోవడమే కాదు ఆయన చెప్పినది చేయాలి కూడా. ఈ విధంగా చేస్తేనే దేవునికి సంతోషం కలిగించగలం. పిల్లలు గానీ పిల్లల సంతానం గానీ ఆర్థిక సహాయం చేయగలిగి కూడా అవసరంలో ఉన్న తమ తల్లిదండ్రులకు, లేక తాత అమ్మమ్మలకు అలా చేయకపోతే వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారన్నమాటే.
5.) వాక్యభావము నేర్చుకొనుడి.
(మత్తయి సువార్త) 9:13
13.అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుకకనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అనువాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
9:13 యేసు హోషేయ 6:6 గురించి చెప్తున్నాడు. దేవుడు తాను కరుణ చూపేవాడైనట్టుగానే మనుషులు కూడా కరుణ చూపాలని కోరుతున్నాడు. మతాచారాలకంటే ఇది ఎంతో ప్రాముఖ్యం. 5:7 కూడా చూడండి. ఈ వచనంలో “న్యాయవంతులు” అంటే తాము న్యాయవంతులం, ఇతరుల కన్నా పవిత్రులం అని ఎంచుకునేవారు అని భావం. నిజానికి అందరూ పాపులే (రోమ్ 3:23). అయితే మనుషులు అర్థం చేసుకోవలసిన రీతిలో దీన్ని ఇంకా అర్థం చేసుకోలేదు. క్షమాపణ, పాపవిముక్తి, రక్షణ పాందాలని పాపులను పిలవడానికి యేసు వచ్చాడు (లూకా 19:10; యోహాను 3:17; 1 తిమోతి 1:15).
9:13 సామెత 21:3; యెషయా 55:6-7; హోషేయ 6:6; మీకా 6:6-8; మత్తయి 3:2, 8; 4:17; 11:20-21; 12:3, 5, 7; 18:10-13; 19:4; 21:28-32, 42; 22:31-32; మార్కు 2:17; 12:26; లూకా 5:32; 10:26; 15:3-10; 19:10; 24:47; యోహాను 10:34; అపొ కా 2:38; 3:19; 5:31; 11:18; 17:30-31; 20:21; 26:18-20; రోమ్ 2:4-6; 3:10-24; 1 కొరింతు 6:9-11; 1 తిమోతి 1:13-16; 2 తిమోతి 2:25-26; 2 పేతురు 3:9
6.) క్రమశిక్షణ నేర్చుకొనుడి.
(సామెతలు) 6:6,7
6.సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
6:6-11 సామెతలు గ్రంథంలో సోమరితనం గురించి చాలా చోట్ల రాసి ఉంది. సోమరి లక్షణాలను, అందువల్ల వచ్చే ఫలితాలను నేర్చుకుంటాం (10:26; 13:4; 15:19; 19:24; 20:4; 22:13; 24:30-34; 26:13-16). ఎలాంటి ప్రాధాన్యతా లేని అల్ప ప్రాణి చీమకు కూడా సోమరికంటే ఎక్కువ బుద్ధి ఉంది (వ 6).
7.వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను
7.) ఇవ్వడం నేర్చుకొనుడి.
(అపొస్తలుల కార్యములు) 20:35
35.మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.
20:35 యేసు చెప్పిన ఈ మాటలు శుభవార్త గ్రంథాల్లో ఎక్కడా రాసిలేవు గానీ ఈ నియమాన్ని తన జీవితంలో సేవలో ఎప్పుడూ ప్రదర్శించాడు (ఎక్కడా రాసిలేని అనేక కార్యాలు యేసు చేశాడు, అనేక విషయాలు చెప్పాడు – యోహాను 21:25). పేదలపట్ల, దిక్కులేనివారిపట్ల యేసు చూపిన మనసు మత్తయి 9:36; 11:5; 19:21; లూకా 4:18; 6:20; 11:41; 14:13; యోహాను 5:6-8లో కనిపిస్తున్నాయి (యేసు చేసిన అద్భుతాల్లో అధిక భాగం బీదలకోసం చేశాడు). ప్రజలకోసం తననూ, తనకున్న వాటన్నిటినీ ఇచ్చాడు, తాను సహాయం చేసినవారినుంచి ఏదైనా కావాలని ఆశించలేదు. మత్తయి 20:28; యోహాను 10:11 పోల్చి చూడండి. ఇందులో పౌలు యేసును అనుసరించాడు – 1 కొరింతు 9:12-17; 2 కొరింతు 12:15. ఈ రోజుల్లో దైవభక్తివల్ల తమకు ఆర్థిక లాభం చేకూరుతుందని ఆశించేవారు చాలా మంది ఉన్నారు (1 తిమోతి 6:5). ఈ లోకంలో తమకోసం ఆస్తినీ డబ్బునూ పోగుచేసుకో గలిగే “దీవెన” మాత్రమే వారికి ప్రీతిపాత్రం (యోహాను 12:6; మత్తయి 6:19-21 పోల్చి చూడండి). ఇదే దేవుని దీవెన అని వారు తప్పుగా భావిస్తారు. పౌలు ఇలాంటివాడు కాదు. దేవునికీ ఆయన సేవకూ ఇవ్వడం గురించి 2 కొరింతు 9:15 నోట్‌లో రిఫరెన్సులు చూడండి. యేసు తానే చెప్పిన ఈ ముఖ్య నియమాన్ని నేర్చుకొని ఆచరణలో పెట్టామా మనం?
20:35 A సామెత 19:17; యెషయా 58:7-12; మత్తయి 10:8; 25:34-40; లూకా 14:12-14; రోమ్ 15:1; 2 కొరింతు 8:9; 9:6-12; ఫిలిప్పీ 4:17-20; 1 తెస్స 5:14; హీబ్రూ 12:12-13; 13:16; B యెషయా 32:8; 35:3; అపొ కా 20:20, 27; ఎఫెసు 4:28; హీబ్రూ 13:3; C కీర్తన 41:1-3; 112:5-9; 2 కొరింతు 11:9, 12; 12:13; D 1 తెస్స 4:11
Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible
క్రీస్తు జీవిత చరిత్ర.. click here