అంశం:దేవుని ఆదరణ
Pastors Messages In Telugu Bible
మూలవాక్యము : వారి దఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ‘ఆదరించెదను”
(యిర్మీయా) 31:13
13.వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆద రించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.
31:13 A నెహెమ్యా 12:27; ఎస్తేరు 9:22; కీర్తన 30:11; యెషయా 51:11; 61:3; యిర్మీయా 31:4; B ఎజ్రా 6:22; నెహెమ్యా 12:43; కీర్తన 149:3; యెషయా 35:10; 51:3; 60:20; 65:18-19; జెకర్యా 8:19; యోహాను 16:22; C జెకర్యా 8:4-5
1.) యెహోవా తన ప్రజలను ఆదరించెను.
(యెషయా గ్రంథము) 52:9
9.యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూష లేమును విమోచించెను.
2.) భయములో ఆదరణ.
(యెషయా గ్రంథము) 51:12
12.నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?
3.) దుఃఖములో ఆదరణ.
(యెషయా గ్రంథము) 61:2
2.యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును
61:2-3 ఈ వచనంలోని మొదటి వాక్యం తరువాత యేసుప్రభువు ఇక చదవడం మానుకున్నట్టు కనిపిస్తుంది (లూకా 4:18). యెహోవా అనుగ్రహ సంవత్సరం అంటే అక్షరాలా ఒక సంవత్సరం కాదు గాని ఆయన అనుగ్రహం చూపే కాలమంతా (2 కొరింతు 6:2). “ప్రతిక్రియ దినం” ఇంకా రాలేదు (34:2, 8; 35:4; 63:4). అంతేగాక సీయోనులో విలపించే వారిని ఓదార్చే కాలం కూడా ఇంకా రాలేదు (40:1-2; 49:13). 3వ వచనంలో ఉన్నవాటిని సీయోనులో దుఃఖించేవారికి ధరింపజేసే దినం కూడా రాలేదు. “అవేమిటంటే” – అందం, ఆనందం, స్తుతి – ఇవి ఇస్రాయేల్ జాతి సంపూర్ణ విమోచనను, క్షేమస్థితి పునఃస్థాపనను సూచిస్తున్నాయి (12:1-6; 26:1-4; 35:1-10; 51:3; మొ।।). ఈ వచనాల్లో ఈ కృపా యుగం కోసం ఆధ్యాత్మికమైన అర్థం ఏమీ లేదా? ఉంది. ఇప్పుడు యేసుప్రభువు వైపు నమ్మకంతో విధేయతతో తిరిగేవారికి వీటిని ఆయన ఇస్తాడు. అయితే ఇంతటితోనే ఈ భాగానికున్న అర్థం పూర్తి అయినట్టు కాదు (60:1-22 పై నోట్ చూడండి).
4.) తండ్రిలేనివారిని, విధవరాండ్రను ఆదరించువాడు.
(కీర్తనల గ్రంథము) 146:9
9.యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేని వారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.
5.) ప్రాణమును ఆదరించువాడు.
(కీర్తనల గ్రంథము) 54:4
4.ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు
6.) విచారములో ఆదరణ.
(కీర్తనల గ్రంథము) 94:19
19.నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.
94:19 బాధలు, అన్యాయం ఉంటున్న సమయంలో ఆందోళనతో కూడిన తలంపులు సహజంగానే మనకు కలుగుతాయి. అయితే వారి వల్ల మనం ఉక్కిరిబిక్కిరి అయిపోనవసరం లేదు. పరీక్షల్లో, బాధల్లో మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యాకోబు 1:2 చూడండి.
7.) నిత్యమైన ఆదరణ.
(రెండవ థెస్సలొనీకయులకు) 2:17
17.మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక.
2:17 “ఓదార్పు”– 2 కొరింతు 1:3-4. మనుషులు ఒకరినొకరు ఆదరించుకోవచ్చు కానీ అన్నిటికన్నా శ్రేష్ఠమైన ఆదరణ దేవునినుంచే కలుగుతుంది.
8.) రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును.
(కీర్తనల గ్రంథము) 41:3
3.రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.
41:3 దేవునిపట్ల ఎక్కువ నమ్మకంగా ఉన్న విశ్వాసులకు కూడా అనారోగ్యం కలగవచ్చు. అయితే అతని పాలిట డాక్టరు, నర్సు ఎవరో చూడండి (103:3; నిర్గమ 15:26).
9.) శ్రమలలో ఆదరణ.
(రెండవ కొరింథీయులకు) 1:4
4.దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.
1:4 “అన్నిటిలోనూ”– దేవుడు “అన్ని విధాలా” ఆదరణ కలిగించేవాడు. ఏ కష్టమైనా ఆయన ఆదరణ ఇస్తాడు. విశ్వాసులు ఓదార్పును నిరాకరిస్తే (మత్తయి 2:18 పోల్చి చూడండి) ఆ ఆదరణను అనుభవించకుండా ఉంటారు. కేవలం పౌలు కోసమనే దేవుడు అతణ్ణి ఆదరించలేదు, పౌలు ఇతరులను ఆదరించగలగాలని అలా చేశాడు (వ 6).
10.) పోరాటములో ఆదరణ.
(రెండవ కొరింథీయులకు) 7:5,6,7
5.మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను.
6.అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను.
7.తీతు రాకవలన మాత్రమే కాకుండ, అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగ సంతోషించితిని.
Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible Pastors Messages In Telugu Bible
ప్రసంగ శాస్త్రం .. click here