మీ సేవకునికి సహాయం చేస్తున్నారా – Pastors Messages In Telugu

Written by biblesamacharam.com

Published on:

మీ సేవకునికి సహాయం చేస్తున్నారా?

Pastors Messages In Telugu

1.) థెస్సలొనీకలోకూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటలో సహాయము చేసితిరి అని అపొ. పౌలు ఫిలిప్పీ సంఘమునుగూర్చి  సాక్ష్యమిచ్చెను.

 (ఫిలిప్పీయులకు) 4:16

16.ఏలయనగా థెస్సలొనీకలో కూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి.

2.) వస్తువుల రూపములో సహాయం చేసిన ఫిలిప్పీ సంఘస్థులు.

 (ఫిలిప్పీయులకు) 4:18

18.నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైయున్నవి.

4:18 A 2 కొరింతు 9:12; ఎఫెసు 5:2; ఫిలిప్పీ 4:12; హీబ్రూ 13:16; B ఫిలిప్పీ 2:25-26; C యోహాను 12:3-8; రోమ్ 12:1; 2 కొరింతు 2:14-16; 2 తెస్స 1:3; 1 పేతురు 2:5

3.) సేవకునికి సహాయము చేయుట దేవునికి ఇష్టమైన యాగముగా చెప్పబడింది.

 (ఫిలిప్పీయులకు) 4:18

18.నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైయున్నవి.

4:18 “యజ్ఞం”– 2:17; హీబ్రూ 13:16.

4.) సారెపతు విధవరాలు – దేవుని సేవకుడైన ఏలీయాను అప్పముద్వారా పోషించెను.

 (మొదటి రాజులు) 17:8,9,10,11,12,13,14,15,16

8.అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను-నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;

9.నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెలవిచ్చితిని.

10.అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి – త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.

11.ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి-నాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.

12.అందుకామె-నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.

13.అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను-భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.

14.భూమి మీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని

15.ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పినమాటచొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటి వారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి.

16.యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.

5.) ఘనురాలైన స్త్రీ – దైవజనుడైన ఎలీషా బసచేయుటకు వసతిని ఏర్పరచెను –

 (రెండవ రాజులు) 4:8,9,10

8.ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.

9.కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.

10.కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.

Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu


బైబిల్ ప్రశ్నలు – జవాబులు కొరకు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted