మోర్మన్స్ చరిత్ర- Mormonism History In Telugu

Written by biblesamacharam.com

Published on:

మోర్మన్స్ చరిత్ర 

Mormonism History In Telugu

 మోర్మనిసమ్ ఏప్రిల్ 6, 1830 వ సంవత్సరంలో న్యూయార్క్ రాష్ట్రంలోని ఓ గృహంలో ఆరుగురితో ప్రారంభమైంది. దాని స్థాపకుడు జోసఫ్ స్మిత్ జూనియర్. 1820లో జోసఫ్ స్మిత్ ఓ దర్శణం చూచాడు అందులో తండ్రియైన దేవుడు మరియు కుమారుడైన దేవుడు అతనితో మాట్లాడి అతనికి “యాజకత్వాన్ని” అనుగ్రహించి, దానితోపాటు “భూమిపై వున్న సంఘపు తాళపు చెవుల”ను అప్పగించారని చెప్పాడు. ఆ తరువాత “మోరోని” అనే దేవదూత తనకు ప్రత్యక్షమై విశేషమైన “బంగారు పలకల” గూర్చి చెప్పినట్లు, వాటిని తాను న్యూఆర్క్ కుమోరా అనే స్థలంలో త్రవ్వకాల్లో కనుగొనినట్లు తెలిపాడు. వాటిలో వున్న విషయాలను తాను “బుక్ ఆఫ్ మోర్మన్” గా పొందుపరిచాడు. మోర్మన్స్ (Mormons) బుక్ ఆఫ్ మోర్మన్కు బైబిల్ కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు! 

 జోసఫ్ స్మిత్ బహు భార్యలు గలవాడు, 27 మంది భార్యలు అని రికార్డ్ తెలిపినా, కొంత మంది ఆయన 60 మంది కన్నా ఎక్కువ భార్యలు గలవాడని అంటారు. జోసఫ్ స్మిత్ వ్రాతలు, బోధలు, ప్రవర్తన వల్ల 1844లో జైలు పాలైయ్యాడు. అక్కడ గుర్తు పట్ట వీలు లేకుండ ముఖాలకు మసి పూసుకున్న 200 మంది, గుంపు దాడిలు చేసి జోసఫ్ స్మితను కాల్చి చంపారు. తాను కూడ తన తుపాకితో వారిపై కాల్పులు జరిపాడు. 

 జోసఫ్ స్మిత్ తరువాత బ్రిగమ్ యంగ్ నాయకుడైయ్యాడు. అతి త్వరలో పేరుగాంచాడు. మోర్మన్స్ రెండుగా చీలి స్మిత్ కుటుంబం అమెరికాలోని మిసోరి ఇండిపెండెన్స్కు వెళ్ళింది. బ్రిగమ్ యంగ్ తనతో మిగతా వారిని తీసుకుని సాల్ట్ లేక్ సిటీ, ఊటాలో స్థిరపడ్డారు. యంగ్ మొరటువానిగా, క్రూరునిగా పేరు పొందాడు. 1857లో బిషప్ జాన్ డి.లీ. చేత అక్కడికి వలస వచ్చిన మోర్మెన్స్ కాని 120 మంది స్త్రీ, పురుషులను మరియు పిల్లలను హతమార్చాడు. 20 సంవత్సరాల తరువాత లీ అమెరికా ప్రభుత్వం చేత ఉరితీయబడ్డాడు. 

 బ్రిగమ్ యంగ్ మరికొన్ని తప్పుడు సిద్ధాంతాల్ని ప్రవేశపెట్టి అనేకుల్ని భ్రష్టుల్ని చేసాడు. బహు భార్యత్వాన్ని పెంపొందించి, తాను 25 మంది భార్యల్ని కలిగి 56 మంది పిల్లల్ని కన్నాడు. అతని తరువాత ఎజ్రా టెఫ్ట్ బెన్సన్ ఆ తరువాత క్రొత్త నాయకులు సంస్థను నడిపి ప్రపంచ వ్యాప్తి చెందేట్టు చేసారు. ప్రస్తుతం గొర్డన్ బి. హిండ్లీ ప్రెసిడెంట్గా వున్నాడు. 

 మోరన్స్ అధికారికంగా “ద చర్చ్ ఆఫ్ జీస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సేయింట్స్” (The Church of Jesus Christ of latter-day saints) అని పిలువబడతారు. మోర్మోన్స్ సమాజంలో ఘనతా మర్యాదలు కలిగి యున్నప్పటికి, వారి సిద్ధాంతాలు, బోధలు భయంకరమైనవి, ఘనహీనమైనవి. 20 సంవత్సరాల వయస్సు రాగానే ప్రతి మోర్మన్ 2 సంవత్సరాల మిషనరీ సేవ తప్పనిసరిగా చేయాలి. ఎప్పుడూ వారు జంటలుగా తిరుగుతూ అమాయకులను ఎరవేసి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, టై కట్టుకొని, చొక్కాపై “ఎల్డర్” అన్న బిల్ల తగిలించుకొని ఎదురౌతారు. 

మోర్మన్స్ నమ్మకాలు

  • ఆదాము పాపం మనిషి జీవితానికి అవసరమైన ప్రణాళిక మరియు మన అందరి ఆశీర్వాదానికి కారణం అని నమ్ముతారు!
  • అపొస్తలుల కాలం తరువాత నుండి ఇప్పటి వరకు యేసు క్రీస్తు సంఘం కలుషితమై భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిందని, నిజమైన విశ్వాసులు కేవలం మోర్మన్స్ ఒక్కరేనని నమ్ముతారు.
  • బైబిల్ ఒక్కటే దేవుని వాక్యం కాదని, అది అసంపూర్ణమైనది గనుక దానితోపాటు బుక్ ఆఫ్ మోర్మన్, డాక్ట్రిన్ అండ్ కవనెంట్స్, ద పెర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రెస్, ద లివింగ్ ప్రొఫెట్స్ మొదలగు పుస్తకాలు అవసరమని నమ్ముతారు.
  • బహు భార్యత్వం – భార్య రాబోయే లోకంలో, నిత్యత్వంలో పిల్లల్ని కంటూనే వుంటుందని, కనుక అనేక భార్యల్ని పెళ్ళాడ్డం ప్రతి ఒక్కడి బాధ్యతగా భావించి భక్తి పూర్వకముగా చేయాలని నమ్ముతారు! ఏమి విపరీతం!? (మత్తయి22:23-30). 
  • యేసుక్రీస్తు బహు భార్యలు గలవాడని – లాజరు సహోదరియైన మార్త,మరియలు ఆయన భార్యలని, మగ్దలేనే మరియ ఇంకో భార్య అని, కానా వివాహం యేసు క్రీస్తు యొక్క ఒక వివాహమని బ్రిగమ్ యంగ్ ప్రచారం చేసాడు!! 
  • చనిపోయిన వారు కూడా “రెండవ అవకాశం” పొందగలరని, చనిపోయిన వారి నిమిత్తం బాప్తిస్మం ఇస్తారు. లక్షలాది మంది ప్రజలు బాప్తిస్మం పొందకుండానే చనిపోయారు కనుక, ఆత్మ లోకంలో వారికి వాక్యం ప్రకటించినప్పుడు చాలా మంది అంగీకరిస్తారు కాని వారు ఈ లోకంలో పొందాల్సిన బాప్తిస్మం అక్కడ పొందలేరు గనుక – వారి కొరకు సజీవులైన వారికి వారి బదులు ఇక్కడ బాప్తిస్మం ఇస్తారు.

మోర్మన్స్ సిద్ధాంతాలు

  • త్రిత్వమును తప్పుగా త్రిప్పి బోధిస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మూడు శరీరాలను కలిగి యున్నారు కనుక వారు ఒక్క దేవుడు కాదు ముగ్గురు దేవుళ్ళని బోధిస్తారు.
  • “ఎలోహిమ్” అనే హెబ్రీ పదానికి “దేవుళ్ళు” అని అర్థం. కనుక ఎంతో మంది దేవుళ్ళు వున్నారని అది రుజువు చేస్తోందని జోసఫ్ స్మిత్ బోధించాడు.
  • పరలోకంలో చాలా మంది దేవుళ్ళు వున్నారని – వారికి ఆత్మపిల్లలు (Spirit Children) పుడుతున్నారని, ప్రతి దేవునికి భార్య లేక భార్యలు వున్నారనిచెబుతారు. 
  • లూసిఫర్ (సాతాను) యేసుక్రీస్తు యొక్క ఆత్మ సహోదరుడని బోధిస్తారు!
  • ఇంగ్లీషు (KJV) బైబిల్ తర్జుమాను తప్పుగా అర్థం చేసుకుని పరిశుద్ధాత్మను రెండుగా చేసారు. (Holy Ghost-Holy Spirit) హోలీ ఘోస్ట్ పరలోక తల్లిదండ్రులకు జన్మించిన ఆత్మ శిశువని, మనుష్యాకారము కలిగియున్నాడని, త్రిత్వమైన ముగ్గురు దేవుళ్ళలో ఒక్కరని అంటారు. హోలీ స్పిరిట్ – కేవలం దైవికమైన ప్రభావం, ప్రపంచమంతా వున్న మోర్ మన్స్ అనుభవించగలిగె “అనుభూతి” అని చెబుతారు.
  • యేసు క్రీస్తు పేరు యెహోవా అని, ఆయన ఎలోహిమ్ దేవుడు మరియు మరియ కలయికల వల్ల జన్మించాడని బోధిస్తారు. (ఇది పిశాచి బోధ కాకపోతేమరి ఏంటి?) 
  • క్రీస్తు విమోచన కార్యం కేవలము ఆదాము పాపము వరకే పరిమితమని, ప్రతి వ్యక్తి సొంత రక్షణ యేసు ప్రాయశ్చిత్తంతో ప్రారంభమై వారి సొంత కార్యాల చేతనే పూర్తి అవుతుందని బోధిస్తారు. కొన్ని పాపాల నుండి యేసు విడిపించలేడు గనుక ప్రతి వాడు తానే ఆ పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి!
  • బాప్తిస్మం ద్వార రక్షణ అని నొక్కి చెబుతారు.
  • దేవుడు ఒకప్పుడు మనిషి అని కనుక మనిషి భవిష్యత్తులో దేవుడౌతాడని బోధిస్తారు. ఆదాము నరుడు కాడు దేవుడని అంటారు!
  • క్షమాపణ పోందాలంటే మోర్మోన్ సిద్ధాంతాలకు లోబడి వుండాలి. జోసఫ్ స్మిత్ ప్రవక్త అని నమ్మాలి. బుక్ ఆఫ్ మోర్మన్ నందు విశ్వాసముంచాలి. అనేక రకాలైన ఆచారాలకు కట్టుబడి మోర్మన్ సంఘానికి లోబడి వుండాలి.

ఇటువంటి అనేకమైన, భయంకరమైన, వినాశకరమైన బోధలు మనిషిని నిత్యనాశనానికి లాక్కుపోతున్నాయి. లక్షలాది మోసపోతున్నారు. మోర్మన్స్ మీకు ఎదురుపడితే జాగ్రత్త!! హైదరాబాద్లో వారి చర్చ్స్ పెరుగుతున్నాయి. మోర్మన్స్ అనేకులు తమ పనిని వేగంగా చేసుకుపోతున్నారు. వారి మర్యాద, ముచ్చట చూసి మోసపోకండి, కళ్ళు తెరవండి, క్రీస్తుని చూడండి, వాక్యం చదవండి, వారి కొరకు ప్రార్థించి పరిశుద్దాత్మ ద్వారా వారి కళ్ళు తెరిపించండి. 

Mormonism History In Telugu Mormonism History In Telugu Mormonism History In Telugu Mormonism History In Telugu Mormonism History In Telugu Mormonism History In Telugu Mormonism History In Telugu Mormonism History In Telugu Mormonism History In Telugu


బైబిల్ ప్రశ్నలు – సమాధానాలు కొరకు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted