పక్షవాయువు గలవాడు -Jesus Heals The PARALYTIC MAN Telugu1

Written by biblesamacharam.com

Published on:

పక్షవాయువు గలవాడు.

Jesus Heals The PARALYTIC MAN Telugu

మూలవాక్యము : యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా “నీ  పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.

 (మార్కు సువార్త) 2:1,2,3,4,5,6,7,8,9,10,11,12

1.కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను

2.ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా

3.కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.

4.చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి.

5.యేసు వారి విశ్వాసము చూచికుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను.

6.శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి.

7.వారుఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి.

8.వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు?

9.ఈ పక్షవాయువుగలవానితో నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని చెప్పుట సులభమా?

10.అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి

11.పక్షవాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.

12.తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొందిమనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.

ఇతని స్వస్థతకు కారణం : తీసుకొచ్చిన నలుగురి విశ్వాసం

 ఎ. స్వస్థతకు కారణం : పాపం క్షమించబడుట.

 (మార్కు సువార్త) 2:15

15.అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండియుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబడించెను.

2:15 A నిర్గమ 4:22; సంఖ్యా 24:8; హోషేయ 11:1; B మత్తయి 1:22; లూకా 24:44; C మత్తయి 2:17, 19, 23; 4:14-15; 8:17; 12:16-18; 21:4; 26:54, 56; యోహాను 19:28, 36; D మత్తయి 27:35; అపొ కా 1:16; 12:1-4, 23-24

ఎన్ని రకాల స్వస్థతలు జరిగాయి:

1.) ఆత్మీయ స్వస్థత – పాప క్షమాపణ.

 (మార్కు సువార్త) 2:5

5.యేసు వారి విశ్వాసము చూచికుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను.

2:5 A మత్తయి 9:2; యాకోబు 5:15; B మత్తయి 9:22; మార్కు 2:9-10; C మార్కు 5:34; లూకా 5:20; 7:47-50; 8:48; యోహాను 2:25; 5:14; అపొ కా 5:31; 14:9; ఎఫెసు 2:8; యాకోబు 2:18-22; D ఆది 22:12; యోబు 33:17-26; కీర్తన 32:1-5; 90:7-9; 103:3; యెషయా 38:17; 53:11; అపొ కా 11:23; 1 కొరింతు 11:30; 2 కొరింతు 2:10; కొలస్సయి 3:13; 1 తెస్స 1:3-4

2.) శరీర స్వస్థత – రోగం పొవుట.

 (మార్కు సువార్త) 2:11,12

11.పక్షవాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.

12.తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొందిమనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.

3.) మానసిక స్వస్థత – ధైర్యపరచుట.

 (మత్తయి సువార్త) 9:2

2.ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా(మూలభాషలో-బిడ్డా) ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.

9:2 పక్షవాత రోగి విశ్వాసం మాత్రమే కాదు, అతణ్ణి తీసుకువచ్చిన వారి విశ్వాసాన్నీ యేసు చూచినట్టు రాసి ఉంది, గమనించండి. ఇతరులను క్రీస్తు చెంతకు తేవడంలో నమ్మకం ఎలా ఉపయోగపడుతుందో ఈ ఉదాహరణవల్ల తెలుస్తున్నది. ఈ మనిషి శారీరకంగా బాగుపడాలని కోరాడు. అంతకన్నా మరెంతో ఎక్కువ అతనికి లభించింది.

బి. విశ్వాసంలో రకాలు:

1.) తీసుకొచ్చినవారి విశ్వాసం – వారి విశ్వాసం చూచి.

 (మార్కు సువార్త) 2:5

5.యేసు వారి విశ్వాసము చూచికుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను.

2.) రోగి విశ్వాసం: కుమారీ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను.

 (మార్కు సువార్త) 5:34

34.అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.

5:34 మత్తయి 9:22. యేసు ఈ లోకానికి రావడంలో ఒక కారణం చెదరిన హృదయాలకు శాంతి చేకూర్చేందుకే – లూకా 2:14; యోహాను 14:1, 27; 20:19.

3.) యేసు యొక్క విశ్వాసం – చిన్నది లేపబడుట.

 (మత్తయి సువార్త) 9:24,25,26

24.స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి.

25.జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను.

26.ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.

Jesus Heals The PARALYTIC MAN Telugu Jesus Heals The PARALYTIC MAN Telugu  Jesus Heals The PARALYTIC MAN Telugu  Jesus Heals The PARALYTIC MAN Telugu  Jesus Heals The PARALYTIC MAN Telugu  Jesus Heals The PARALYTIC MAN Telugu 


ప్రసంగ శాస్త్రం మెటీరియల్ కొరకు.. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: restricted