ధేవుడు గొప్పవాడు.
God Is Great Sunday School Story Telugu
డాక్టర్ మార్క్ గారు పేరుగాంచిన ఒక క్యాన్సర్ వైద్యనిపుణుడు.
వైద్యరంగంలో ఆయన అనేకమైన పరిశోధనలు కూడా జరిపాడు. ఆయన సాధించిన విజయాలకు గాను ఆయనకు పురస్కారము ఇవ్వాలని వేరొక పట్టణములో ఏర్పాట్లు చేయబడ్డాయి. ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి దానిలో ఆయనను సన్మానించి పురస్కారమును ఆయనకు అందజేస్తారు. God Is Great Sunday School Story Telugu
డాక్టర్ మార్క్ గారు ఎంతో సంతోషంతో ఆ పురస్కారాన్ని అందుకోడానికీ బయలుదేరాడు. తాను ఇంతకాలము కష్టపడిన దానికి తగిన గుర్తింపు ఇప్పుడు తనకొస్తుందని తలంచి ఆ సభను చేరుకోడానికీ ఆతృతపడసాగాడు. కాని తాను ప్రయాణిస్తున్న విమానము సాంకేతిక లోపానికి గురై దగ్గరలో నున్న ఒక విమానాశ్రయంలో దిగిపోయింది. ఒకవేళ తాను చేరుకోవలసిన స్థలానికి తగిన సమయంలో చేరుకోగలనో లేదో అని కంగారుపడిన మార్క్ గారు అక్కడున్న రిసెప్షన్కి వెళ్ళి – “తరువాత విమానము ఎన్ని గంటలకి” అని వాకబు చేశాడు. “తాను వెళ్లవలసిన స్థలానికి 1 ) గంటల వ్యవధి తరువాతనే విమానమున్నది” అని తెలిసికొనిన అతడు కలత చెందాడు. అయితే అక్కడున్న వారు “ఒక కారుని అద్దెకు తీసుకొని వెళ్లినచో 4 గంటల వ్యవధిలో వెళ్లిపోవచ్చును” అని సలహా యిచ్చారు.
చేసేదేమీ లేక ఆయన ఒక కారుని అద్దెకు తీసికొని తానే స్వయంగా నడుపుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే ఆయన కొంచెం దూరం ప్రయాణించిన తరువాత వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు జరిగి ఒక పెద్ద తుఫాను చెలరేగింది. కుండపోత వర్షము కురుస్తున్నందున దారి సరిగా తెలియక ఆయన దారితప్పాడు. God Is Great Sunday School Story Telugu
రెండు గంటలసేపు ప్రయాణించిన తరువాత తాను దారి తప్పానని గ్రహించాడు. ఒకవైపు వర్షము… ఇంకొకవైపు దారితప్పిన పరిస్థితి… ఈ స్థితిలో ఆయనకు ఆకలివేసి బాగా అలసిపోయాడు. కాని ఆ రోడ్డులో ఎక్కడా మనుష్య సంచారము గాని, ఆహారము దొరికే ఆనవాళ్లుగాని కనిపించలేదు. కొంతసేపైన తరువాత ఆయనకు పాడుబడిన ఒక ఇల్లు కనిపించింది. ఆయన కారు దిగి ఆ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఒక స్త్రీ తలుపు తెరచింది. ఆయన తన పరిస్థితిని వివరించి “మీ టెలిఫోన్ని ఒకసారి వాడుకోవచ్చా?” అని అడిగాడు. అందుకా స్త్రీ – “మా ఇంట్లో టెలిఫోన్ గాని ఇంకా ఏ ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు గాని లేవు. కాకపోతే మీరు లోపలికి వచ్చి వాతావరణం మెరుగుపడే వరకు యింట్లో వుండవచ్చును” అని బదులు పలికింది.
ఆకలితో తడిసి ముద్దయి విసిగిపోయి వేసారిపోయి ఉన్న ఆ డాక్టరు ఆమె ఆహ్వానాన్ని అంగీకరించి లోపలికి వెళ్ళాడు. ఆ స్త్రీ ఆయనకు వేడి వేడి టీ యిచ్చి తరువాత కొన్ని తినుబండారాలను కూడా ఆయన ముందు పెట్టింది. “మీరు నాతో కలిసి ప్రార్థిస్తారా?” అని అడుగగా, డాక్టర్ మార్క్ గారు నవ్వి – “నేను కష్టపడి పనిచేయడాన్ని మాత్రం నమ్ముతాను. మీరే వెళ్లి ప్రార్థన చేసుకోండి” అని సున్నితంగా జవాబిచ్చాడు. od Is Great Sunday School Story Telugu
ఆ స్త్రీ లోపలి గదిలోనికి వెళ్లి ప్రార్థించసాగింది. డాక్టరు గారు టీని సేవిస్తూ ఆమె క్రొవ్వొత్తుల మసక వెలుతురులో ఆ గదిలో నున్న ఊయల ప్రక్కన మోకరించి ప్రార్థనలో గోజాడుతూ ఉండటాన్ని గమనించాడు. “ఆమె పదే పదే ఏదో విషయాన్ని గురించి వేడుకొంటున్నది” అని ఆయనకు అర్థమయ్యింది. ఆమె ఎంతో గొప్ప అవసరతలో నున్నదని గ్రహించాడు.
ఆమె ప్రార్థన ముగించిన వెంటనే -“అమ్మా, నీవు దేవుని దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నావు? దేవుడు నిజముగా ప్రార్థనలను ఆలకిస్తాడను కుంటున్నావా?” అనడిగాడు. అంతటితో ఆగక “ఆ ఊయలలో నున్న పిల్లవాడు ఎవరు?” అని అడిగాడు. God Is Great Sunday School Story Telugu
అందుకా స్త్రీ విచారవదనంతో ఈ విధంగా పలికింది. “అయ్యా! ఊయలలో నున్న ఈ పిల్లవాడు నా కుమారుడే. కాని వీడు ప్రత్యేకమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వున్నాడు. దానికి వైద్యం చేయగల డాక్టరు మన దేశంలో ఒక్కరు మాత్రమే ఉన్నారట. ఆయన పేరు డాక్టర్ మార్క్ ఆయన చాలా పెద్ద డాక్టరైనందున ఆయన దగ్గర చూపించుకునే స్థోమత నాకు లేదు. అంతేగాక డాక్టరు మార్క్ గారుండే పట్టణం ఇక్కడ నుండి చాలా దూరం. మార్గం తెరువమని నేను దేవునికి మొఱ్ఱపెడుతూ ఉన్నాను. అయినా దేవుడు నా ప్రార్థనలకు ఇంతవరకు జవాబివ్వలేదు. కాని దేవుడు ఏదో ఒక దినమున తప్పక మార్గం తెరుస్తాడనే నమ్మకం నాకున్నది. అయితే లేనిపోని భయములు నా విశ్వాసాన్ని కదిలించకుండా జాగ్రత్తపడుతున్నాను” అని అంది.
డాక్టర్ మార్క్ గారు నిశ్చేష్టుడైపోయాడు. ఆయనకు నోటమాటరాలేదు. ఆయన చెక్కిళ్ళ మీదుగా కన్నీళ్ళు జలపాతంలా రాలాయి. “దేవుడు గొప్పవాడు” అని బిగ్గరగా పల్కాడు. ఆ దినమున తనకు జరిగిన సంభవములన్నింటినీ ఒక్కసారి క్రోడీకరించుకున్నాడు. విమానంలో సాంకేతిక లోపం, అకస్మాత్తుగా చెలరేగిన పెనుతుఫాను, తను దారితప్పిపోవటం; ఈ సంఘటనలన్నీ జరగడం మూలముగా దేవుడు ఆమె ప్రార్థనకు జవాబివ్వడమే కాదుకాని, తాను భౌతిక వాదము నుండి బయటపడి ప్రార్థన అనే ఆస్తి తప్ప వేరే ఏమీలేని అభాగ్యులకి సహాయపడడానికి తనకొక తరుణాన్ని ఇచ్చాడని గ్రహించాడు. God Is Great Sunday School Story Telugu
తరువాత ఆయన ఆ బిడ్డను తన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చికిత్స చేయగా ఆ బిడ్డ స్వస్థపడ్డాడు.
God Is Great Sunday School Story Telugu
ప్రత్యక్ష గుడారం subjcet కొరకు .. click here