Father of Chloroform – Invension from Bible – Sir James Young Simpson – Discovered from Bible Facts1

Written by biblesamacharam.com

Published on:

బైబిల్ చదివి మత్తుమందు 

కనిపెట్టేశాడు ?

Father of Chloroform – Invension from Bible

 బైబిలు శాస్త్రీయం, ప్రవచనాత్మకం మరియు చారిత్రాత్మకం. అంటే బైబిలులో శాస్త్రీయ సంగతులు ఉన్నాయి. రాబోయే కాలానికీ, అనగా భవిష్యత్తుకాలానికీ సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే చరిత్రకు సంబంధించిన పాఠాలూ కోకొల్లలుగా ఉన్నాయి. బైబిలు సర్వే సర్వత్రా ఆమోద యోగ్యం! అభిలషనీయం! అనుసరణీయం! 

 ప్రపంచంలో విఖ్యాతిగాంచిన విజ్ఞాన వేత్తలు కనిపెట్టిన అతి ప్రాముఖ్యమైన వాటికీ బైబిలు మూలకారణముగా ఉండటం గొప్ప విషయం, లేదా సైంటిస్ట్లు కనిపెట్టిన సంగతులను ముందుగానే ప్రవచనాత్మకముగాను, ఉపమానార్థముగాను బైబిలు చెప్పుట విశేషం. 

 ఈనాడు క్లోరోఫాం (CHLOROFORM) వలన వైద్య ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. క్లోరోఫాం అనేది ఒక మత్తుమందు. దీనిని కనిపెట్టినవాడు సర్ జేమ్స్ సింప్సన్. ఇతడు ఎడెన్బర్గు యూనివర్శిటీ ప్రొఫెసర్గా పనిచేసాడు. క్లోరోఫాంను కనిపెట్టక పూర్వం ఒక రోగికి ఆపరేషన్ చేయాలంటే నలుగురైదుగురు ఆ మనిషిని గట్టిగా పట్టుకోగా, అతనికి ఆపరేషన్ చేసేవారు. చాలాసార్లు ఆపరేషన్లు విఫలమయ్యేవి. రోగి ఆ బాధకు, నొప్పికి తట్టుకోలేక, ఒక్కసారిగా భయానికి లోనై చనిపోతూ ఉండేవారు. అయితే సర్ జేమ్స్ సింప్సన్ గారి రాకతో వైద్య ప్రపంచంలో కొత్త ఆవిష్కరణ శకం ప్రారంభమైంది. 

 రోగికి మత్తుమందు (క్లోరోఫాం) ఇచ్చి సులభంగా థియేటర్లో ఆపరేషనులు చేస్తున్నారు. రోగికి నొప్పి అంటూ తెలియుటలేదు. నొప్పి లేకుండా మత్తుమందు ఇచ్చి ఆపరేషన్లు జరుగుట ద్వారా రోగులు కూడా భయాందోళనలు లేకుండా ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. 

 యింత గొప్ప మత్తుమందును కనిపెట్టిన ఈయనకు సన్మానం చేస్తూ – మిస్టర్ జేమ్స్ సింప్సన్ మీకిట్టి ఆలోచన ఎలా వచ్చింది? దీనిని మీరెలా కనిపెట్టారు? దీనిని మీరు కనుగొన్న తర్వాత ఆపరేషన్లు సులభమౌతూ సఫలమవుతూ ఎంతో మంది రోగులు బతికి బయటపడు తున్నారు అని అడిగారు. 

 ఆయన యిచ్చిన సమాధానము ఆస్తికులను నాస్తికులను మానవతా వాదులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆయన అన్నాడు నేను నా బాల్య దినముల నుంచి తల్లిదండ్రులకు విధేయుడను. వారు మంచి దైవభక్తిగలవారు. నేనును దైవభక్తి గలవాడను. సృష్టికర్తయగు ప్రభువునందు విశ్వాసం గల వ్యక్తిని. కాబట్టి నిత్యము బైబిలు చదవడం అలవాటు. బైబిలు చదవడం మరియు ప్రార్థన చేయడం లేకుండా నేను ఏ పనీ చేసేవాడను కాను. ఇట్లుండగా ఒకరోజు ఉదయకాలము నేను బైబిలు చదువుతుండగా దేవుడైన యెహోవా ఆదామునకు జరిగించిన మేజర్ ఆపరేషన్ గూర్చి చదివాను. “అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను” (ఆది. 2:21) అనే లేఖన భాగము చదివాను. ఈ మాటలు చదివినప్పుడు నాలో ఒక ఆలోచన మెరుపులా పుట్టింది. దేవుడు ఆదాముకు జరిగించిన ఆపరేషన్లో మొదటిగా ఆదామునకు “గాఢనిద్ర” కలుగజేసాడు అని నా స్పురణకు తోచింది. 

 గాఢనిద్ర అంటే ఒక విధమైన “మత్తు” కదా అని అర్థం చేసుకున్నాను. కాబట్టి ఆపరేషన్ చేయవలసిన రోగికి మొదట గాఢనిద్ర లాంటి స్థితి ఏదో ఒకదానిని కలుగజేయగలిగితే అప్పుడు ఆపరేషన్ సులభం అవుతుందని గ్రహించ గల్గాను. 

 ఆ దిశలోనే నేను ప్రయోగాలు చేయటం ప్రారంభించాను. చిట్టచివరికి నా ప్రయోగం ఫలించింది. కొన్ని మూలికలతో “క్లోరోఫాం” ను కనిపెట్టగలిగాను. ఒకవేళ ఆ రోజు ఉదయం నేను బైబిలు నందు ఆ భాగం చదివి ధ్యానించకపోయినచో నేడు ఈ మందును బహుశ కనిపెట్ట గలిగి ఉండకపోవచ్చును అంటూ సన్మాన సభలో ఉపన్యసించాడు. 

సర్ జేమ్స్ సింప్సన్ బైబిలును గూర్చి – అది ఒక విజ్ఞాన ఖని. విజ్ఞానులకు విజ్ఞానం నేర్పే పాఠ్య పుస్తకం… జ్ఞానులకు త్రోవచూపునది అని కొనియాడారు. బైబిలు ప్రాశస్థ్యం ఏమిటో తెలుసా… అది… 

బాధలలో మంచి బంధువు! 

చీకటి జీవితాలకు ఓ వెలుగు రేఖ!! 

దేశాలకు సవరింపలేని రాజ్యాంగ చట్టం!!!

లోకాన్ని వెలిగించే పరలోక చుట్టం!!!! 

Father of Chloroform – Invension from Bible Father of Chloroform – Invension from Bible Father of Chloroform – Invension from Bible Father of Chloroform – Invension from Bible Father of Chloroform – Invension from Bible Father of Chloroform – Invension from Bible


సేవకుల ప్రసంగాలు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted