పాపము – Excellent Christian Telugu Messages Pdf1

Written by biblesamacharam.com

Updated on:

అంశం:పాపము.

Excellent Christian Telugu Messages Pdf

మూల వాక్యము : “పాపము” చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును

 (మొదటి యోహాను) 3:4

4.పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.

3:4 పాపం అంటే దేవుణ్ణీ, మంచిచెడుల విషయంలో దేవుడు తెలియజేసినదాన్నీ మనసులో ఎదిరించడం, దేవుని చట్టం అంటే ఏమీ లేనట్టూ, లోకంలో న్యాయ సూత్రమేదీ లేనట్టూ ప్రవర్తించడం, తన స్వార్థపరమైన కోరికలనే ఎప్పుడూ చూచుకొంటూ ఉండడం.

3:4 A సంఖ్యా 15:31; రోమ్ 3:20; 4:15; 2 కొరింతు 12:21; 1 యోహాను 5:17; B దాని 9:11; రోమ్ 7:7-13; 1 యోహాను 3:8-9; C యాకోబు 2:9-11; D 1 సమూ 15:24; E 1 దిన 10:13; 2 దిన 24:20; యాకోబు 5:15

1.) సకల దుర్ణీతి పాపము.

 (మొదటి యోహాను) 5:17

17.దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.

5:17 3:4 మరణకరం కాని పాపం ఉన్నదన్న సత్యం మనల్ని పాపం చేసేందుకు పురికొల్పకూడదు. పాపం చేస్తే గనుక క్షమాపణ ఉందన్న ప్రోత్సాహాన్ని మాత్రమే కలిగించాలి.

2.) ప్రార్థన చేయకపోవుట పాపము 

 (మొదటి సమూయేలు) 12:23

23.నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.

12:23 “ప్రార్థించక పోవడంవల్ల”– ఇలా చెయ్యమని దేవుడు చెప్పినదాన్ని చెయ్యకపోవడం చెయ్యవద్దన్న దాన్ని చెయ్యడం రెండూ సమాన పాపమే. సంఖ్యా 32:23; మత్తయి 25:41-46 చూడండి. ఈ రెండు రకాల దోషాలు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి. కీర్తన 51:4 చూడండి.

“ఉపదేశిస్తాను”– సమూయేలు ముసలివాడు. ఇస్రాయేల్ వారి పై కార్య నిర్వాహణాధికారం అతనికి ఇకపై లేదు. అయితే ఆధ్యాత్మికమైన పరిచర్య భారాన్ని దేవుడింకా సమూయేలు పైనే ఉంచాడు. ప్రార్థించడం, ఉపదేశించడం అతడింకా చేయగల పనులు. ఉపదేశించడానికి కూడా శక్తి లేనప్పుడు ప్రార్థించడం కొనసాగించగలుగుతాడు. Excellent Christian Telugu Messages Pdf1 

3.) విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము.

 (రోమీయులకు) 14:23

23.అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషి యని తీర్పునొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.

4.) నా మాటలు వలన పాపము.

 (యోబు గ్రంథము) 15:5

5.నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.

15:5-6 యోబు కపటమైన రీతిలో తన నిర్దోషత్వం గురించి పదేపదే నొక్కి చెప్పడం ద్వారా తన పాపాలను దాచిపెడుతున్నాడనీ దేవుడంటే అతడు లెక్కలేకుండా మాట్లాడటమే అతను ఘోర పాపి అన్నదానికి రుజువు అనీ ఎలీఫజు నమ్మకం.

5.) మరణపు ముల్లు పాపము.

 (మొదటి కొరింథీయులకు) 15:56

56.మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.

15:56 మరణానికి స్వతహాగా విషపుకొండి లేదు. దాని కొండి పాపమే (రోమ్ 5:12; 6:23). పాపంలో చనిపోవడమంటే శాశ్వతంగా నశించిన స్థితిలో ఉండడమే. విశ్వాసుల పాపాన్ని తొలగించడం ద్వారా క్రీస్తు ఈ కొండిని తీసేశాడు. అందువల్ల వారికి మరణం అంటే క్రీస్తుతో జీవంలోకి దారితీసే ఒక తలుపు మాత్రమే (ఫిలిప్పీ 1:21-23). Excellent Christian Telugu Messages Pdf1 

“ధర్మశాస్త్రం”– మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. అది మనందరినీ నేరస్తులుగా నిలబెడుతుంది (రోమ్ 3:19-20), అతిక్రమించడానికి దోహదం చేస్తుంది (రోమ్ 4:15), మన భ్రష్ట స్వభావాలు దానిపై తిరగబడి మరింత పాపం చేసేలా చేస్తుంది (రోమ్ 7:5-11). ఈ విధంగా అది “పాపానికి బలం”. Excellent Christian Telugu Messages Pdf1 

6.) దురాశ పాపము.

 (యాకోబు) 1:15

15.దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

1:15 పాపానికి అంతిమ ఫలితం ఆత్మ మరణం. ఆది 2:17; రోమ్ 5:12; 8:6. పాప కార్యాలు కోరికల్లో నుంచే బయలుదేరుతాయి (ఆది 3:6; 2 పేతురు 1:4; 1 యోహాను 2:16). దేవుడిచ్చిన బలంతో విశ్వాసులు ఈ యుద్ధంలో పోరాడి, తమలోని కోరికలు తమను పాపంలోకి లాగకముందే విజయం సాధించాలి. Excellent Christian Telugu Messages Pdf1 

7.) మేలు చేయకపోవుట పాపము.

 (యాకోబు) 4:17

17.కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.

4:17 లూకా 12:47; యోహాను 9:41; 2 పేతురు 2:21. తెలియక ఈ విధంగా వారు ప్రవర్తించి ఉండవచ్చు. అయితే ఇప్పుడు సరిగా ప్రవర్తించే విధానం వారికి తెలుసు. కాబట్టి అలా చెయ్యకపోతే వారేమీ సాకు చెప్పలేరు. మంచి చెయ్యకుండా వదిలెయ్యడం అనేది చెడుతనం చెయ్యడం లాగానే పాపం అన్న సంగతి గమనించండి. సంఖ్యా 32:23; 1 సమూ 12:23; మత్తయి 25:41-46.

8.) మూర్ఖుని యోచన పాపము.

 (సామెతలు) 24:9

9.మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు.

9.ఆజ్ఞ అతిక్రమము పాపము.

 (మొదటి యోహాను) 3:4

4.పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.

3:4 పాపం అంటే దేవుణ్ణీ, మంచిచెడుల విషయంలో దేవుడు తెలియజేసినదాన్నీ మనసులో ఎదిరించడం, దేవుని చట్టం అంటే ఏమీ లేనట్టూ, లోకంలో న్యాయ సూత్రమేదీ లేనట్టూ ప్రవర్తించడం, తన స్వార్థపరమైన కోరికలనే ఎప్పుడూ చూచుకొంటూ ఉండడం. Excellent Christian Telugu Messages Pdf1 


66 పుస్తకాల వివరణ.. click here 

Leave a comment