అంశం :ఎలీషా గుణ లక్షణములు.
ELIJAH – 7 INTERESTING QUALITIES – TELUGU
మూలవాక్యము : … అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.
(మొదటి రాజులు) 19:21
21.అందు కతడు అతనిని విడిచి వెళ్లి కాడి యెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.
19:21 ఎలీషా దేవుని సేవ – అది ఎంత చిన్నదైనా సరే – చెయ్యడానికి ఆత్రుతగా ఉన్నాడు (2 రాజులు 3:11). తిరిగి వెనక్కు వెళ్ళే అవకాశాలన్నిటినీ తొలగించుకున్నాడు. తన జీవనోపాధిని చెడగొట్టేసి దేవుని కోసం బయలుదేరాడు. మార్కు 1:16-20 పోల్చి చూడండి.
19:21 A 2 సమూ 24:22; B నిర్గమ 24:13; లూకా 5:28-29; C సంఖ్యా 27:18-20; 1 రాజులు 18:43; 2 రాజులు 2:3; 3:11; అపొ కా 13:5; 2 తిమోతి 4:11; ఫిలేమోను 13
1.) శక్తి పొందినవాడు.
(రెండవ రాజులు) 2:15
15.యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలీయా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి
2:15 సంఖ్యా 11:25-29; 27:20; యెహో 3:7; 4:14; 2 రాజులు 2:7, 19; 4:1-4, 37; 6:1-7; యెషయా 11:2; 59:21; యోహాను 15:26-27; అపొ కా 1:8; 2 కొరింతు 12:9; 1 పేతురు 4:14
2.) పిలుపుకు లోబడినవాడు.
(మొదటి రాజులు) 19:20,21
20.అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తి-నేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు-పోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను.
19:20 A మత్తయి 8:21-22; లూకా 9:61-62; B అపొ కా 20:37; C మత్తయి 4:20, 22; 9:9; 19:27
21.అందు కతడు అతనిని విడిచి వెళ్లి కాడి యెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.
3.) ఆత్మీయ బలమును వెదకినవాడు.
(రెండవ రాజులు) 2:9
9.వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను.
2:9 “ఏం చెయ్యాలో”– ఏలీయా ఎలీషాను మూడు సార్లు పరీక్షించాడు. మూడు సార్లూ కూడా ఏం జరిగినా అంతం వరకు ఏలీయాతోనే ఉంటానని ఎలీషా ప్రకటించాడు. ఎలీషా నమ్మకం, శ్రద్ధాసక్తులకు ఇప్పుడు ప్రతిఫలం దొరుకుతుందన్న వాగ్దానం లభించింది. మార్కు 10:28-30 పోల్చిచూడండి. వారసుడికి రెండింతలు భాగం లభించాలని ద్వితీ 21:17 చెప్తున్నది. ఏలీయాకు ఆత్మసంబంధంగా వారసుడు ఎలీషాయే. తాను ఏలీయాకంటే ఆధ్యాత్మికంగా రెండింతలు శ్రేష్ఠంగా ఉండాలని ఎలీషా అడగడం లేదు గాని ప్రవక్తగా ఏలీయా తరువాత తాను ఉండాలని మాత్రమే కోరుతున్నాడు. ఒకవేళ తాను ప్రవక్తగా పని చేయాలంటే ఏలీయా ఆత్మకు రెండింతలు ఆత్మ తనకు అవసరమని భావించాడేమో. తాను ఏలీయాకంటే రెండింతలు బలహీనుణ్ణనీ, ఏలీయాకున్న అవసరత తనకు రెండింతలు ఉందనీ భావించాడేమో. దేవునినుంచి ఉచితంగా ఆత్మ వరాలను ఆశించడం గురించి 1 రాజులు 3:5, 9-12; 1 కొరింతు 12:31 చూడండి.
2:9 A సంఖ్యా 11:17; ద్వితీ 21:17; B సంఖ్యా 11:25; 27:16-23; ద్వితీ 34:9; 1 రాజులు 3:9; 2 రాజులు 13:14-19; 1 దిన 29:18-19; 2 దిన 1:9-10; కీర్తన 72:1, 20; జెకర్యా 9:12; 12:8; యోహాను 16:7; అపొ కా 20:25-36; 1 తిమోతి 5:17; C లూకా 24:45-51; యోహాను 17:9-13; అపొ కా 1:8; 8:17; 1 కొరింతు 12:31
4.) కల్మషములేనివాడు (ధనమును ఆశించనివాడు)
(రెండవ రాజులు) 5:16
16.ఎలీషా-ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసికొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పక పోయెను.
5:16 తనకేమన్నా బహుమతులు దొరుకుతాయని కాదు ఎలీషా దేవుణ్ణి సేవించేది. నయమాను ఇస్తున్న ఈ ఒక్క బహుమానం అతణ్ణి ధనవంతుడుగా చేసేదే (వ 5). అయితే ధన సంపాదనలో ఎలీషాకు ఆసక్తి లేదు. బిలాముకూ (2 పేతురు 2:15), అప్పటి నుంచి అనేకమందికీ, ఎలీషాకూ ఎంత తేడా! (తిమోతికి పౌలు హెచ్చరికను చూడండి – 1 తిమోతి 6:6-11).
5:16 A 2 రాజులు 3:14; 5:20, 26; B ఆది 14:22-23; 1 రాజులు 17:1; దాని 5:17; C 1 రాజులు 13:8; 18:15; మత్తయి 10:8; అపొ కా 8:18-20; 20:33-35; 1 కొరింతు 6:12; 10:32-33; 2 కొరింతు 11:9-10; 12:14
5.) ఆత్మీయ దర్శనము గలవాడు.
(రెండవ రాజులు) 6:17
17.యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.
6:17 A 2 రాజులు 2:11; కీర్తన 34:7; 68:17; 91:11; 119:18; యెషయా 42:7; జెకర్యా 6:1-7; మత్తయి 26:53; అపొ కా 26:18; హీబ్రూ 1:14; B 2 రాజులు 6:18-20; కీర్తన 91:15; 104:3; యెహె 1:13-16; జెకర్యా 1:8; ఎఫెసు 1:18; ప్రకటన 19:11, 14; C యాకోబు 5:16-18; ప్రకటన 3:7
“మంటల్లాంటి”– 2:11-12. దేవుడు తన సేవకులను సంరక్షిస్తుంటాడు. ఇందుకోసం పరలోక సైన్య సమూహాలన్నిటినీ సిద్ధంగా ఉంచుతాడు. దేవుని అనుమతి, జ్ఞానయుక్తమైన సంకల్పం లేకుండా ఎవరూ కూడా దేవుని ఏ సేవకుణ్ణీ కూడా బంధించలేరు, హాని చెయ్యలేరు.
6.) విజయమార్గములో జీవితము.
(రెండవ రాజులు) 6:15,16
15.దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చి నప్పుడు గుఱ్ఱములును రథములును గల సైన్యము పట్టణ మును చుట్టుకొని యుండుట కనబడెను. అంతట అతని పనివాడు-అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా
6:15 A మత్తయి 8:26; B నిర్గమ 24:13; 1 రాజులు 19:21; 2 రాజులు 3:11; 5:20, 27; 6:5; 2 దిన 20:12; కీర్తన 53:5; అపొ కా 13:5; C మత్తయి 20:26-28
16.అతడు-భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి
7.) మరణము తరువాత కూడా బలము యొక్క సువాసన
(రెండవ రాజులు) 13:20,21
20.తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమా ధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు
13:20 A 2 రాజులు 24:2; B 2 రాజులు 3:7; C న్యాయాధి 3:12; 6:3-6; 2 రాజులు 3:5, 24-27; 5:2; 6:23; 2 దిన 24:16; అపొ కా 8:2
21.కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.
13:21 A యెహె 37:1-10; B ప్రకటన 11:11; C అపొ కా 19:12; D 2 రాజులు 4:35; యెషయా 26:19; మత్తయి 27:52-53; యోహాను 5:25, 28-29; 11:44; అపొ కా 5:15
ELIJAH – 7 INTERESTING QUALITIES – TELUGU ELIJAH – 7 INTERESTING QUALITIES – TELUGU ELIJAH – 7 INTERESTING QUALITIES – TELUGU ELIJAH – 7 INTERESTING QUALITIES – TELUGU ELIJAH – 7 INTERESTING QUALITIES – TELUGU ELIJAH – 7 INTERESTING QUALITIES – TELUGU ELIJAH – 7 INTERESTING QUALITIES – TELUGU ELIJAH – 7 INTERESTING QUALITIES – TELUGU ELIJAH – 7 INTERESTING QUALITIES – TELUGU
66 పుస్తకాల వివరణ కొరకు .. click here