బాప్తీస్మం ఎందుకు పొందాలి?
Do we need to take baptism? Why?
మూలవాక్యము : నమ్మి “బాప్తీస్మం” పొందినవాడు రక్షింపబడును. నమ్మనివానికి శిక్ష విధింపబడును.
(మార్కు సువార్త) 16:16
16.నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
16:16 బాప్తిసం గురించి నోట్ మత్తయి 3:6. రక్షణ, పాపవిముక్తి విశ్వాసం మూలంగానే (యోహాను 3:16; 5:24; 6:47; అపొ కా 16:31; రోమ్ 1:17; 3:22, 25; గలతీ 2:16; ఎఫెసు 2:8-9). విశ్వాసం తప్ప మరి దేనికీ అందులో పాత్ర లేదు. రక్షణ కలగడానికి బాప్తిసం అవసరం లేదు. అయితే యేసుప్రభువును ప్రభువుగా రక్షకుడుగా నమ్మినవారు బాప్తిసం తీసుకొని తమ నమ్మకాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి తాను క్రీస్తును నమ్ముకున్నానని చెప్పి, బాప్తిసాన్ని పొందేందుకు నిరాకరిస్తే అతని నమ్మకాన్ని సందేహించేందుకు మనకు న్యాయమైన కారణం ఉంది.
“బాప్తిసం పొందని వ్యక్తికి”– శిక్షావిధి కలుగుతుంది అనలేదు యేసు. ఇది గమనించండి. నమ్మనివ్యక్తికి శిక్షావిధి కలుగుతుందనే చెప్పాడు. యోహాను 3:17-18 పోల్చి చూడండి. ఇక్కడ “శిక్షావిధి” అంటే నరకం.
1.) పాపములు కడిగి వేసుకొనుటకు.
(అపొస్తలుల కార్యములు) 22:16
16.గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.
22:16 బాప్తిసం గురించి 2:38; మత్తయి 3:2; మార్కు 16:16 నోట్స్ చూడండి. అననీయస్ మాటలను బట్టి చూస్తే బాప్తిసం పాపంనుంచి అంతరంగ శుద్ధీకరణకు బహిరంగ సూచన. ఈ అంతరంగ శుద్ధి క్రీస్తు రక్తం మూలంగానే కలుగుతుంది (హీబ్రూ 9:14).
2.) క్రీస్తు మరణములో ప్రవేశించుటకు.
(రోమీయులకు) 6:3
3.క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?
6:3-4 పౌలు ఇక్కడ మాట్లాడుతున్న బాప్తిసం ఏమిటి? బాప్తిసం అనేది గ్రీకు భాషలోనుంచి వచ్చిన పదం. ఇక్కడ “బాప్తిసం పొందడం” అని కాకుండా ఆ గ్రీకు పదాన్ని తెలుగులోకి అనువదిస్తే ఇలా ఉంటుంది – “క్రీస్తులోకి ముంచబడిన”, లేక “క్రీస్తులోకి ప్రవేశించిన”, లేక “యేసుక్రీస్తులోకి తీసుకురాబడిన”. మనం “ఆయన మరణంలో ముంచబడ్డామని”, లేక “ఆయన మరణంలో ప్రవేశించామని”, లేక “ఆయన మరణంలోకి తీసుకురాబడ్డామని” అనవచ్చు. ఆ విధంగా ముంచబడడమంటే క్రీస్తులోకి మునగడమని అర్థం గానీ నీటిలోకి కాదు. అలాంటప్పుడు బాప్తిసం క్రీస్తుతో ఐక్యతను సూచిస్తుంది, ఆయనతో ఒక ప్రత్యేక సంబంధంలోకి ప్రవేశించడం, పవిత్రాత్మ మూలంగా ఆయన ఆధ్యాత్మికదేహంలో ఒక అవయవంగా మారడం అని దీని అర్థం (1 కొరింతు 12:12-13; యోహాను 17:21, 23). బాప్తిసం అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం క్రొత్త ఒడంబడికలో ఇతర చోట్ల చిహ్నంగా సాదృశ్య రూపకంగా వాడడం కనిపిస్తుంది. లూకా 12:50; 1 కొరింతు 10:2 చూడండి.
నీటి బాప్తిసం పౌలు ఇక్కడ చెప్తున్న ఆధ్యాత్మిక వాస్తవ విషయాలకు ఒక చిహ్నంగా సూచనగా మాత్రమే ఉండగలదు. నీటిలోకి వెళ్ళడం క్రీస్తుతో మరణానికీ పాతిపెట్టబడడానికీ సూచన. నీటినుంచి బయటికి రావడం క్రీస్తుతో సజీవంగా తిరిగి లేవడానికి సూచన. నీటి బాప్తిసం గురించిన నోట్స్ కోసం మత్తయి 3:6; 28:19; మార్కు 16:16; అపొ కా 2:38 చూడండి. పవిత్రాత్మ బాప్తిసం గురించి అపొ కా 1:5 మొదలైనవి చూడండి.
క్రీస్తులో దేవుడు మనకోసం చేసినదానంతటి ఉద్దేశం మనమొక కొత్త రకం జీవితం గడపాలనే, పాపం మరణాలు అనే బంధకాలనుంచి విడుదల అయిన పునర్జీవిత సంబంధమైన జీవితం మనకు కలగాలనే. 2 కొరింతు 5:17; తీతు 2:11-14 చూడండి.
3.) క్రీస్తులో తిరిగి లేపబడుటకు.
(కొలొస్సయులకు) 2:12
12.మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ లేచితిరి.
4.) దేవుని రాజ్యములో ప్రవేశించుటకు.
(యోహాను సువార్త) 3:5
5.యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
3:5-8 నూతన జన్మ ఎలా జరుగుతుందో ఈ వచనాల్లో యేసుప్రభువు వెల్లడిస్తున్నాడు. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ద్వారా ఇది కలుగుతుంది. “ఆత్మమూలంగా జన్మించడం” గురించి ఇక్కడ 3 సార్లు కనిపిస్తున్నాయి (వ 5,6,8).
వ 5లో “నీళ్ళ మూలంగా” అనే మాటల విషయంలో వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. పాత ఒడంబడిక గ్రంథంలో తరచుగా ఉన్నట్టుగానే ఇక్కడ కూడా నీళ్ళు శుద్ధీకరణకు గుర్తుగా ఉన్నాయని కొందరన్నారు. నిర్గమ 30:17-21; సంఖ్యా 19:9; 31:23; కీర్తన 51:7-10; యెషయా 44:3; యిర్మీయా 4:14; యెహె 37:25 చూడండి. యెహె 36:25-26ను “నీళ్ళమూలంగా దేవుని ఆత్మమూలంగా జన్మిస్తేనే” అనేమాటలతో పోల్చి చూడండి. యెహెజ్కేలులో నీళ్ళు చిలకరించడం దేవుడు చేసే పనే గానీ మనుషులది కాదని గమనించండి. అందువల్ల హృదయంలో నుంచి పాపాల కల్మషాన్ని కడిగివేయడం గురించే గానీ నీటి బాప్తిసం గురించి అది చెప్పడం లేదని స్పష్టం అవుతున్నది. తీతు 3:5 పోల్చి చూడండి. అక్కడ కొత్త జన్మాన్ని “స్నానం” అని రాసి ఉంది. నీరు శరీరాన్ని ఎలా శుభ్రం చేస్తుందో అలానే కొత్త జన్మం హృదయాన్ని శుభ్రపరుస్తుందన్న మాట. తీతు 3:5లో నీటి బాప్తిసం గురించిన మాట లేనే లేదు.
నీళ్ళమూలంగా అంటే దేవుని వాక్కుమూలంగా అని మరి కొందరు భావించారు. ఇక్కడ నీరు దేవుని వాక్కుకు సూచనగా ఉందని వారి అభిప్రాయం. దీనికి ఆధారంగా 15:3; ఎఫెసు 5:26; యాకోబు 1:18; 1 పేతురు 1:23 మొదలైన వచనాలను వీరు చూపిస్తారు.
మరి కొందరు ఇక్కడ నీళ్ళు 7:37-39లో లాగే దేవుని ఆత్మకు గుర్తుగా ఉందంటారు. “నీళ్ళమూలంగా, ఆత్మమూలంగా” అనడం ఒకే సంగతిని మరింత నొక్కి చెప్పిన విధానం అని వీరి ఉద్దేశం.
మరి కొందరు నీళ్ళు ఈ లోకంలో శారీరికంగా పుట్టడానికి గుర్తు అంటారు. “మనిషి మొదటి పుట్టుక సరిపోదనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని ఆత్మమూలంగా కూడా జన్మించడం అవసరం” అని ఇక్కడ యేసు చెప్తున్నాడని వీరి అభిప్రాయం.
మరి కొందరు పశ్చాత్తాపాన్నీ, పాపాలను ఒప్పుకొనే సంగతినీ గురించి చెప్పేందుకు “నీళ్ళమూలంగా” అనేమాట యేసు ఉపయోగించాడంటారు. వాటికి చిహ్నం నీటి బాప్తిసం గదా (మత్తయి 3:6 నోట్స్ చూడండి).
మరి కొందరు ఇక్కడ నీళ్ళు అంటే నీటి బాప్తిసం అనీ, నూతన జన్మకు నీటి బాప్తిసం తప్పనిసరి అని బల్లగుద్ది వాదిస్తారు. నీటి బాప్తిసం జరుగుతున్న సమయంలో దేవుని ఆత్మ దాన్ని ఉపయోగిస్తూ దాని ద్వారా పని చేస్తూ దాన్ని తీసుకున్నవారిలో నూతన జీవం కలిగిస్తాడని వారంటారు.
ఈ చివరిది తప్ప పైన చెప్పిన వివరణలన్నిటిలో ఏదైనా నిజం కావచ్చునని ఈ నోట్స్ రచయిత అభిప్రాయం. నూతన జన్మకు బాప్తిసం అవసరమని యేసుప్రభువు ఎక్కడా చెప్పలేదు. వ్యక్తులు నమ్మకం ద్వారా యేసుప్రభువును స్వీకరించినప్పుడు నూతన జన్మ కలుగుతుంది (1:12-13) గానీ బాప్తిసం ఆచారంలో పాల్గొన్నప్పుడు కాదు. నూతన జన్మ తరువాత బాప్తిసం తీసుకోవాలి గానీ బాప్తిసంవల్ల నూతన జన్మ కలగదు. దేవుడు మాత్రమే నూతన జన్మ అనే అద్భుతాన్ని చేయగలడు. మనుషులు యేసుప్రభువును నమ్మినప్పుడే వారిలో ఆయన ఈ అద్భుతాన్ని జరిగిస్తాడు. పాపవిముక్తీ దేవుని రాజ్యంలో ప్రవేశించడమూ ఇది లేకుండా సాధ్యం కాదు (వ 7).
5.పాప క్షమాపణ నిమిత్తం.
(అపొస్తలుల కార్యములు) 2:38
38.పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
2:38 పశ్చాత్తాపం, బాప్తిసం గురించిన నోట్స్ మత్తయి 3:2, 6; మార్కు 16:16; లూకా 13:3. యోహాను ఇచ్చిన బాప్తిసం లాగా కాక క్రైస్తవ బాప్తిసం యేసు పేరుతో, పవిత్రాత్మ అనే దేవుని ఉచిత వరంతో సంబంధం గలది. 19:5 కూడా చూడండి. పాపక్షమాపణ కావాలంటే బాప్తిసం తప్పకుండా తీసుకోవాలని పేతురు ఉపదేశించడం లేదు. క్షమాపణ మనుషులు చేయగల ఏ క్రియమీదా, ఏ ఆచారం, ఏ సంస్కారం మీదా ఆధారపడదని అతనికి బాగా తెలుసు. క్షమాపణ దేవుని కృపమూలంగానే కలుగుతుంది, నమ్మకంద్వారానే కలుగుతుంది. క్షమాపణ గురించి మత్తయి 6:12; 9:5-7; 12:31; 18:23-25; ఎఫెసు 1:7; 1 యోహాను 1:9; యెషయా 55:7 నోట్స్ చూడండి.
ఇక్కడ పేతురు మాటల భావం స్పష్టంగా ఉంది. ఈ మాటలలో ఆ భావాన్ని చెప్పవచ్చు – “యేసును గురించి మీరు మనసు మార్చుకొని, ఆయనను ఇస్రాయేల్ అభిషిక్తుడుగా, దేవుని కుమారుడుగా నిరాకరించిన పాపంనుంచి మళ్ళుకొని ఆయనను స్వీకరించండి. ఆయన పేర, అంటే ఆయన స్వభావం, పదవి, అధికారం ప్రకారంగా, ఆయనలో ఉన్న మీ నమ్మకానికి బహిరంగ సూచనగా బాప్తిసం పొందండి. అది తనమీద నమ్మకముంచినవారికి ఆయన ఉచితంగా ఇచ్చే పాపక్షమాపణకు కూడా సూచనగా ఉంటుంది”.
పాప క్షమాపణ కోసం బాప్తిసం పొందడం పాపక్షమాపణ దొరికేలా బాప్తిసం పొందడమని అర్థం కాదు. ఈ వచనం మత్తయి 3:11తో పోల్చి చూడండి. యోహాను బాప్తిసం ఇచ్చిన కారణం ప్రజలు పశ్చాత్తాప పడినందువల్లే.
“యేసుక్రీస్తు పేర” బాప్తిసం అంటే ప్రభువుగా అభిషిక్తుడుగా ఉన్న ఆయన అధికారం చొప్పున బాప్తిసం (వ 36). విశ్వాసులకు బాప్తిసమిస్తూ ఉన్నప్పుడు ఇచ్చేవారు పలకవలసిన మాటలను పేతురు ఇక్కడ ఇవ్వడం లేదు. మత్తయి 28:19 పోల్చి చూడండి.
దేవుడు పవిత్రాత్మను ఉచితంగా, కృపావరంగా ఇస్తాడని గమనించండి. యోహాను 7:37-39; 14:16-17; గలతీ 3:2 పోల్చి చూడండి. అపొ కా 10:44-48 చూడండి. కొర్నేలి, అతనితో ఉన్నవారు బాప్తిసం పొందకముందే పవిత్రాత్మను (పాపక్షమాపణను కూడా) పొందారు.
6.) నిర్మలమైన మనస్సాక్షి నిమిత్తం.
(మొదటి పేతురు) 3:21
21.దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.
7.) పరలోకపు తండ్రి ఆనందించుటకు.
(మొదటి పేతురు) 3:22
22.ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.
3:21 “బాప్తిసం”– మత్తయి 3:6, 13-16; 28:19; మార్కు 16:16; అపొ కా 2:38. జల ప్రళయం నీటి బాప్తిసానికి సూచన. నోవహు, అతని కుటుంబం ప్రాణాలు దక్కించుకున్నది నీటిలో ఉండడం ద్వారా కాదు, ఓడలో ఉండడం ద్వారానే. ఓడ క్రీస్తును సూచిస్తున్నది (ఆది 7:24). బాప్తిసం రక్షణకు సూచన. అది క్రీస్తు మరణ పునర్జీవనాలకూ, ఆయనతో మన ఐక్యతకూ గుర్తు (రోమ్ 6:3-10). కేవలం బాప్తిసం ఆచారం మనుషుల్ని రక్షిస్తుందని చెప్పడం తన ఉద్దేశం కాదని తెలిపేందుకు పేతురు మూడు సంగతులు చెప్తున్నాడు. బాప్తిసం అంటే శరీర స్వభావంలోని మాలిన్యం తీసివేయడం కాదు (“శరీర స్వభాపం”– రోమ్ 7:5, 18). బాప్తిసం “దేవునిపట్ల మంచి అంతర్వాణి ఇచ్చే జవాబు” (హీబ్రూ 9:14 పోల్చి చూడండి). అది విశ్వాసాన్నీ, నూతన జీవాన్నీ సూచించే గుర్తు. బాప్తిసం పొందుతున్నవారు తాము దేవుని ఇష్టానికి అనుగుణంగా జీవిస్తామనీ, తమ అంతర్వాణిని మరెన్నడూ అశుద్ధం చేసుకోమనీ, దాని నోరు మూయించమనీ బహిరంగంగా ప్రకటించడమే అందులోని ఒక ఉద్దేశం. మనల్ని దేవుని దగ్గరికి తెచ్చేది క్రీస్తు పడిన బాధలే (వ 18). మనలను రక్షించేది క్రీస్తు పునర్జీవనమే. రోమ్ 4:25 చూడండి. బాప్తిసం దాన్నే తెలియజేస్తున్నది. బాప్తిసమంటే జలప్రళయం నీళ్ళకు “అనుగుణమైన చిహ్నం” కాబట్టి మనమిలా చెప్పుకోవచ్చు – నోవహును రక్షించినది నీరు కానట్టే మనల్ని రక్షించేది బాప్తిసం కాదు (వ 20).
Do we need to take baptism? Why? Do we need to take baptism? Why? Do we need to take baptism? Why? Do we need to take baptism? Why? Do we need to take baptism? Why? Do we need to take baptism? Why? Do we need to take baptism? Why? Do we need to take baptism? Why? Do we need to take baptism? Why? Do we need to take baptism? Why? Do we need to take baptism? Why? Do we need to take baptism? Why?
ప్రసంగ శాస్త్రం కొరకు .. click here