ప్రత్యేకించబడాలి – Christian Telugu Pdf Files Free

Written by biblesamacharam.com

Published on:

అంశం:- ప్రత్యేకించబడాలి 

Christian Telugu Pdf Files Free

మూలవాక్యము :  కావున మీరు వారిమధ్య నుండి బయలువెడలి  ప్రత్యేకముగా ఉండుడి – 2కొరింథీ 6:17 

 (రెండవ కొరింథీయులకు) 6:17

17.కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

6:17 A సంఖ్యా 16:21, 26, 45; ఎజ్రా 6:21; 10:11; కీర్తన 1:1-3; సామెత 9:6; యెషయా 52:11; యిర్మీయా 51:6; యోహాను 6:37-38; అపొ కా 2:40; 2 కొరింతు 7:1; ప్రకటన 18:4; B రోమ్ 15:7.

6:17-18 ఈ భాగాన్ని సరైన రీతిలో ముగించేందుకు పౌలు కొన్ని పాత ఒడంబడిక లేఖనాల గురించి మాట్లాడుతున్నాడు. ఏ వచనాన్నీ ఉన్నది ఉన్నట్టుగా ఎత్తి రాయలేదు గాని అతని మనసులో బహుశా యెషయా 52:11-12; 2 సమూ 7:14; యిర్మీయా 31:9; యెషయా 43:6 వంటి వచనాలు ఉండి ఉండవచ్చు. ప్రత్యేక, పవిత్ర ప్రజగా ఉండేందుకు ఇష్టపడేవారి ఎదుట అతడు ఎలాంటి గంబీరమైన గొప్ప విషయాన్ని పెడుతున్నాడో చూడండి. వారు దుష్ట లోకంతో సహవాసం, సంతోషాలను కోల్పోతారు. కానీ దేవుని సహవాసాన్ని సంపాదించుకుంటారు. చాలామందికి ఈ రెండూ కావాలి, గానీ అది సాధ్యం కాదు.

1.) దేవుడు భవిష్యత్ ఎరిగినవాడు.

(మొదటి పేతురు) 1:2

2.ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. 

1:2 A యోహాను 15:16-19; అపొ కా 2:23; రోమ్ 8:29-30; 11:2; 16:26; ఎఫెసు 1:4-5; 2 తెస్స 2:13; హీబ్రూ 12:24; 1 పేతురు 1:22; 2 పేతురు 1:2; B మత్తయి 24:22, 24; మార్కు 13:20, 27; రోమ్ 11:5-7; 1 కొరింతు 6:11; 2 తిమోతి 2:10; హీబ్రూ 10:22; C ద్వితీ 7:6; యెషయా 65:22; దాని 4:1; లూకా 18:7; అపొ కా 15:18; రోమ్ 1:5, 7; 8:13, 33; 9:23-24; 15:16; 16:19; 2 కొరింతు 13:14; D మత్తయి 24:31; మార్కు 13:22; అపొ కా 20:32; రోమ్ 11:28; 2 కొరింతు 10:5; కొలస్సయి 3:12; హీబ్రూ 5:9; 11:28; 1 పేతురు 2:9; యూదా 2; E యెషయా 55:7; 1 కొరింతు 1:30; తీతు 1:1

1:2 భవిష్యత్ జ్ఞానం ప్రకారం– రోమ్ 8:29 నోట్. ఈ వచనంలో త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులనూ గమనించండి (మత్తయి 3:16-17; మొ।। చూడండి). విశ్వాసుల విముక్తికి మూలాధారం, ఆరంభం ఇక్కడ కనిపిస్తున్నాయి – అది దేవుని ఎన్నిక. వారు విశ్వాసులు అయిన విధానం, క్రమం – అది దేవుని ఆత్మ చేసిన పని. వారి నమ్మకానికి ఆధారం, పునాది – అది క్రీస్తు రక్తం. వారు విశ్వాసులు అయిన ఉద్దేశం, ప్రయోజనం – వారు క్రీస్తుకు విధేయులుగా ఉండడం. 2 తెస్స 2:13-14 పోల్చి చూడండి.

ప్రోక్షణ పాత ఒడంబడికలో జంతువుల రక్తాన్ని నాలుగు సంగతులను సూచించేందుకు చిలకరించారు: కడగడం (లేవీ 14:1-7), యాజులను అంకితం చేయడం (నిర్గమ 29:20-22), దేవుని ఒడంబడిక దృవీకరణ (నిర్గమ 24:1-8), ప్రాయశ్చిత్తం (లేవీ 16:14). క్రీస్తు రక్తం మూలంగా విశ్వాసులకు పాపక్షమాపణ, శుద్ధి దొరికాయి (ఎఫెసు 1:7; హీబ్రూ 9:14; 1 యోహాను 1:7), యాజులుగా దేవుని సన్నిధికి సంపూర్ణ ప్రవేశం కలిగింది (హీబ్రూ 10:19-22), క్రొత్త ఒడంబడికలో భాగస్థులయ్యారు (మత్తయి 26:28; హీబ్రూ 12:24).

2.) మనము దేవుని ఏర్పాటులో ఉన్నవారము.

(ఎఫెసీయులకు) 1:4,5,6

4.ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

1:4 A ద్వితీ 7:6-7; కీర్తన 135:4; యెషయా 41:8-9; 42:1; 65:8-10; మత్తయి 11:25-26; 24:22, 24, 31; 25:34; లూకా,1:74-75; యోహాను 10:16; 15:16; 17:24; అపొ కా 13:48; 18:10; రోమ్ 8:28-30, 33; 9:23-24; 11:5-6; 1 కొరింతు 1:8; గలతీ 5:13, 22; ఎఫెసు 2:10; 3:17; 4:2, 15-16; 5:2, 27; ఫిలిప్పీ 2:15; కొలస్సయి 1:22; 2:2; 3:12; 1 తెస్స 3:12; 4:7; 2 తెస్స 2:13-14; 2 తిమోతి 1:9; 2:10, 19; తీతు 1:1-2; 2:11-12; యాకోబు 2:5; 1 పేతురు 1:2, 20; 2:9; 2 పేతురు 1:5-10; 3:14; 1 యోహాను 4:16; ప్రకటన 13:8; 17:8; B గలతీ 5:6; C అపొ కా 15:18

1:4 “ఎన్నుకొన్నాడు” మార్కు 13:20; యోహాను 15:16, 19; రోమ్ 8:33; 2 తెస్స 2:13; 1 పేతురు 2:9. యోహాను 6:37; 17:6 పోల్చి చూడండి. విశ్వాసులు పుట్టకముందే, లోకం ఉనికిలోకి రాకముందే దేవుడు భవిష్యత్తులోకి దృష్టి సారించి ప్రతి విశ్వాసినీ చూచి క్రీస్తులో ఎన్నుకున్నాడు. వారిలో ప్రతి ఒక్కరినీ ఒక ఉన్నతమైన స్థలంలో ఉండేలా పూర్వ నిర్ణయం చేశాడు. రోమ్ 8:29-30, ఆ నోట్స్ చూడండి. ఇక్కడ వ 4-6లో దేవుడు విశ్వాసులను ఎన్నుకొని పూర్వ నిర్ణయం చేయడానికి మూడు కారణాలు చెప్తున్నాడు పౌలు.

ఒకటి, మనం “పవిత్రంగా, నిర్దోషంగా” ఉండాలని దేవుని కోరిక – వ 4; 5:22-27; యోహాను 17:17-19; ఫిలిప్పీ 2:15; తీతు 2:14.

రెండు, మనం ఆయన సంతానంగా ఉండాలని ఆయన కోరిక (వ 5). యోహాను 1:12-13; రోమ్ 8:15; 2 కొరింతు 6:17-18; 1 యోహాను 3:1-2 పోల్చి చూడండి.

5.తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

1:5 A యోహాను 1:12; 11:52; రోమ్ 8:14-17, 23, 29-30; 2 కొరింతు 6:18; గలతీ 3:26; 4:5-6; ఎఫెసు 1:11; 1 యోహాను 3:1; ప్రకటన 21:7; ఎఫెసు 1:9; హీబ్రూ 12:5-9; యిర్మీయా 3:19; హోషేయ 1:10; లూకా 10:21; 1 కొరింతు 1:21; 2 తెస్స 1:11; యిర్మీయా 3:4; దాని 4:35; యోహాను 20:17; రోమ్ 9:11-16; ఫిలిప్పీ 2:13; హీబ్రూ 2:10-15; మత్తయి 11:26; లూకా 11:32

6.మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

1:6 A మత్తయి 3:17; రోమ్ 3:22-26; ఎఫెసు 1:7-8, 12; ఫిలిప్పీ 4:19; కొలస్సయి 1:13; 1 పేతురు 2:9; B యెషయా 43:21; 2 కొరింతు 5:21; ఎఫెసు 1:14; 3:10-11; ఫిలిప్పీ 1:11; 1 పేతురు 4:11; C యెషయా 42:1; 45:24-25; 61:3; మత్తయి 17:5; లూకా 2:14; యోహాను 10:17; రోమ్ 5:15-19; 8:1; 9:23-24; 2 కొరింతు 4:15; 1 పేతురు 2:5; D కీర్తన 22:20; సామెత 8:30-31; 16:4; యెషయా 49:1-3; 61:11; యిర్మీయా 23:6; 33:9; యోహాను 3:35; ఎఫెసు 1:18; 2:7; ఫిలిప్పీ 3:9; 2 తెస్స 1:8-10; 1 తిమోతి 1:14-16; E కీర్తన 60:5; జెకర్యా 13:7

3.) లోకములోనుండి ఇశ్రాయేలీయులను ప్రత్యేకపరచెను

 (నిర్గమకాండము) 8:22

22.మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగలగుంపు లుండవు.

8:22 A నిర్గమ 9:4; 10:23; మలాకీ 3:18; నిర్గమ 9:6; 12:13; కీర్తన 110:2; యెహె 30:19; నిర్గమ 7:17; 8:10; 9:26, 29; 11:6-7; కీర్తన 74:12

8:22-23 నిజ దేవుడు తాను ఇస్రాయేల్ ప్రజల దేవుడిననీ, వారిమధ్య ఉన్నాననీ మరి కొన్ని రుజువులను చూపించబోతున్నాడు. తను సేవించి ఆరాధించేవారి పట్లా ఇతర దేవుళ్ళను ఆరాధించేవారి పట్లా వేరువేరు విధాలుగా వ్యవహరిస్తాడు. అయితే సరిగ్గా ఈజిప్ట్‌లో ఆయన అనుసరించిన విధానమే ప్రతి సారీ అనుసరించడు.

(లేవీయకాండము) 20:26

26.మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.

20:261 పేతురు 1:15-16; లేవీ 19:2; 20:7, 24; యెషయా 6:3; తీతు 2:14; ద్వితీ 7:6; 26:18-19; ప్రకటన 4:8; ద్వితీ 14:2; కీర్తన 99:5, 9; యెషయా 30:11; ప్రకటన 3:7

4.) చీకటినుండి ప్రత్యేకపరచుట

(మొదటి పేతురు) 2:9

9.అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

2:9 A నిర్గమ 19:5-6; ద్వితీ 4:20; 7:6; 10:15; 14:2; 26:18-19; కీర్తన 33:12; 106:5; యెషయా 9:2; 26:2; 41:8; 42:16; 43:20-21; 44:1; 60:1-3; 61:6; 66:21; మత్తయి 4:16; 5:16; లూకా 1:79; అపొ కా 20:28; 26:18, 28; రోమ్ 9:24; 1 కొరింతు 3:17; ఎఫెసు 1:6; 5:8-11; ఫిలిప్పీ 3:14; కొలస్సయి 1:13; 1 తెస్స 5:4-8; 2 తిమోతి 1:9; తీతు 2:14; 1 పేతురు 1:2; 2:5; ప్రకటన 1:6; 5:10; 20:6; B కీర్తన 22:30; 73:15; యోహాను 17:19; ఎఫెసు 1:14; 3:21; ఫిలిప్పీ 2:15-16; 1 పేతురు 4:11

“పవిత్ర జనం” భూమిపై ఇతరులందరిలోకీ ప్రత్యేకంగా ఉన్న జాతి. నిర్గమ 19:5-6; యోహాను 17:6 పోల్చి చూడండి. పేతురు సంఘాన్ని “నూతన ఇస్రాయేల్” అని గానీ “ఆధ్యాత్మిక ఇస్రాయేల్” అని గానీ పిలవడం లేదు. అతడు యూదుల్లోని విశ్వాసులకు రాస్తున్నాడు. నిజమైన ఇస్రాయేల్ అంటే వారే, క్రీస్తును తిరస్కరించినవారు కాదు. ఇస్రాయేల్ జాతిని దేవుడు ఇకపై పట్టించుకోబోవడం లేదని పేతురు చెప్పడం లేదు (అపొ కా 1:6-7 పోల్చి చూడండి). క్రొత్త ఒడంబడిక గ్రంథం రాసిన వారిలో ఎవరూ సంఘాన్ని కొత్త ఇస్రాయేల్ అని పిలవలేదు. ఇతర ప్రజల్లో విశ్వాసులైనవారిని పాత ఇస్రాయేల్ అనే చెట్టుకు అంటుకట్టడం జరిగింది. రోమ్ 11 అధ్యాయం; ఎఫెసు 2:11-19 చూడండి.

“వెలుగు”– అపొ కా 26:18; 2 కొరింతు 4:6; ఎఫెసు 5:8; కొలస్సయి 1:13; 1 యోహాను 1:5-7.

5.) లోకము నుండి ప్రత్యేకపరచెను .

(యోహాను సువార్త) 15:19

19.మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. 

15:19 A యోహాను 15:16; 17:14-16; ఎఫెసు 1:4-11; 2:2-5; తీతు 3:3-7; 1 యోహాను 4:4-5; 5:19-20; B లూకా 6:32; 1 పేతురు 2:9-12; 1 యోహాను 3:12; C 1 పేతురు 4:3; D ప్రకటన 20:7-9; E ప్రకటన 12:17

15:19 లోకానికి అంటే నిజ దేవునికి విధేయత చూపని అవిశ్వాస లోకం. 1 యోహాను 2:16; 5:19 చూడండి. ఆ లోకం చీకటిలో ఉంది, అక్కడే ఉండిపోవాలనుకుంటున్నది.

6.) తల్లి గర్భమునుండి ప్రత్యేకమైన ఏర్పాటు.

 (యిర్మీయా) 1:4,5

4.యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

5.గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.

1:5 A నిర్గమ 33:12, 17; కీర్తన 71:5-6; 139:16; యెషయా 44:2; 49:1, 5; యిర్మీయా 1:10; 50:34; లూకా 1:15, 41, 76; రోమ్ 1:1; 8:29; గలతీ 1:15-16; ఎఫెసు 1:22; 4:11-12; 2 తిమోతి 2:19-21; యిర్మీయా 25:15-26

1:5 “రూపొందించే ముందే”– కీర్తన 139:13; 119:73; యెషయా 44:24; 49:5.

నియమించాను తన ప్రజల్లో ప్రతి ఒక్కరికీ తగిన స్థలాన్నీ, పనినీ దేవుడు నిర్ణయించాడు (రోమ్ 12:3-8; 1 కొరింతు 12:27-31). మనం ఏమి చేసినా దేవుడు మనలను ఆ పనికి నియమించాడన్నది గ్రహించి చెయ్యాలి. మనం ఉనికిలోకి రాకముందే మన విషయమంతా దేవునికి తెలుసు. ఆది 20:7లో “ప్రవక్త” గురించి నోట్స్ చూడండి. యిర్మీయా విషయంలో దేవునికి చాలా ఉన్నతమైన ఉద్దేశం ఉంది. అతడు కేవలం ఇస్రాయేల్ వారికి మాత్రమే కాదు, లోక జాతులకు కూడా ప్రవక్తే – వ 10; 25:15-26; 46—51 అధ్యాయాలు.

7.) ఆచారాల నుండి .

 (మొదటి తిమోతికి) 1:3,4

3.నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును,

1:3 A గలతీ 1:6-7; 1 తిమోతి 6:3; తీతు 1:9-11; 2 యోహాను 7, 9-10; కొలస్సయి 2:6-11; 1 తిమోతి 4:6, 11; అపొ కా 18:19; 19:1-10; 20:1-3; ఎఫెసు 4:14; ఫిలిప్పీ 2:24; 1 తిమోతి 5:7; 6:10, 17; ప్రకటన 2:1-2, 14, 20

1:3 ఈ వచనాన్ని బట్టి చూస్తే ఎఫెసులో ఉన్న సంఘానికి తిమోతి ప్రముఖ నాయకుడు అనిపిస్తుంది. సంఘంలోని సమస్యల గురించి పౌలు తిమోతికి రాస్తున్నాడు. సంఘంలో తప్పుడు బోధలను అరికట్టే అధికారం తిమోతికి ఉంది. “తప్పుడు బోధలు” అంటే క్రీస్తు తన రాయబారులకు వెల్లడి చేసిన సత్యాలకు వ్యతిరేకమైనవి. దేవుడు వారికి ఇచ్చిన అధికారంతో రాయబారులు ఆ సత్యాలను ఉపదేశించారు కాబట్టి ఆ సత్యాలను నమ్మవలసిన బాధ్యత క్రైస్తవులందరికీ ఉంది (4:6; గలతీ 1:6-12; రోమ్ 6:17తో సరిచూడండి). సంఘం కాపరులు, పెద్దలు సంఘాన్ని కనిపెడుతూ, పై విచారణకర్తలుగా ఉండడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు (అపొ కా 20:28-31). పై విచారణ చేస్తున్న వారి ఆధీనంలో ఉన్న క్రైస్తవులకు దేవుని సత్యాలకు వ్యతిరేకమైన బోధనలను నేర్పడానికి అనుమతి ఇవ్వకూడదు. అలా అనుమతిస్తే వారు విశ్వాసఘాతకులై సంఘానికి తీవ్రమైన కీడును కలిగిస్తున్నారన్నమాట. మొదటి శతాబ్దం క్రైస్తవులలాగా ఈనాటి క్రైస్తవులు కూడా “రాయబారుల ఉపదేశానికి” లోబడి ఉండాలి (అపొ కా 2:42). పౌలు తిమోతికీ తీతుకూ రాసిన 3 లేఖల్లో సరైన సిద్ధాంతాల గురించీ, ఉపదేశాల గురించీ ఎక్కువగా చెప్పాడు (11వ వచనం; 4:6, 13, 16; 5:17; 6:1, 3; 2 తిమోతి 3:10, 16; 4:2-3; తీతు 1:9; 2:1, 7, 10).

4.విశ్వాస సంబంధమైన దేవుని యేర్పా టుతో(మూలభాషలో-గృహనిర్వాహకత్వముతో) కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. 

1:4 A 1 తిమోతి 4:7; 6:3-5; 2 తిమోతి 4:4; తీతు 1:14; 3:9; 2 పేతురు 1:16; 1 తిమోతి 6:11, 20; 2 తిమోతి 2:14, 22; హీబ్రూ 13:9; 1 తిమోతి 3:16; 2 తిమోతి 2:16-18; 2 కొరింతు 7:9-10; ఎఫెసు 4:12-16; తీతు 1:1; 2 కొరింతు 1:12

1:4 కల్పిత కథలూవంశ వృక్షాలు బైబిలు కనబడని సంగతులు, వంశ వృక్షాల గురించి చెప్తున్నాడు పౌలు. బహుశా ఇవి యూదులకు చెందినవి. తీతు 1:14 పోల్చి చూడండి. ఇలాంటి ఉపదేశాలు భూమిమీద దేవుని పనికి ఏ విధమైన సహాయమూ చేయవు. దేవుని వాక్కైన పవిత్ర గ్రంథాన్ని నమ్మి దాన్ని ప్రకటించేవారి ద్వారానే, దాన్ని ఉపదేశించేవారి ద్వారానే దేవుని పని నెరవేరుతుంది.

8.) పరిశుద్ధులు – పాపులనుండి.

 (రెండవ కొరింథీయులకు) 6:14

14.మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?

6:14నిర్గమ 34:16; లేవీ 19:19; ద్వితీ 7:2-3; 22:9-11; 1 సమూ 5:2-3; 1 రాజులు 18:21; ఎజ్రా 9:1-2, 11-12; 10:19; నెహెమ్యా 13:1-3; కీర్తన 16:3; 26:4-5; 44:20-21; 101:3-5; 106:35; 119:63; 139:21-22; సామెత 22:24; 29:27; మలాకీ 2:11, 15; యోహాను 7:7; 15:18-19; అపొ కా 4:23; రోమ్ 13:12-14; 1 కొరింతు 5:9; 7:39; 10:21; 15:33; ఎఫెసు 4:17-20; 5:6-14; ఫిలిప్పీ 2:15; 1 తెస్స 5:4-8; యాకోబు 4:4; 1 పేతురు 2:9-10; 4:2-4; 1 యోహాను 1:5-7; 2 దిన 19:2; కీర్తన 26:9-10; సామెత 8:18-19; 1 యోహాను 3:12-14; నెహెమ్యా 13:23-26

6:14-18 ఈ ముఖ్యమైన సత్యాన్ని పౌలు ఇక్కడ విశదపరుస్తున్నాడు: క్రీస్తులోని విశ్వాసులు దేవుని ప్రత్యేక ప్రజ. దానికి తగినట్టుగానే వారు నడుచుకోవాలి. ద్వితీ 7:3-6; 1 పేతురు 2:9-12; యోహాను 17:6-10, 17-19. వ 14లో అన్ని కాలాల్లో అన్ని చోట్లా అందరు విశ్వాసులకూ వర్తించే సూత్రాన్ని పౌలు తెలుపుతున్నాడు. అవిశ్వాసులతో వారెలాంటి దగ్గర సంబంధమూ పెట్టుకోరాదు. “జతగా” ఉండడమంటే ఒకే ఉద్దేశంతో కలిసి ఒక పనిలో పాల్గొనడం. ద్వితీ 22:10 చూడండి. విశ్వాసులు క్రీస్తుతో జతపడ్డారు (మత్తయి 11:28-29). కాబట్టి క్రీస్తును తిరస్కరించిన వారితో జత కట్టకూడదు. విశ్వాసికీ, అవిశ్వాసికీ మధ్య వివాహాన్ని ఇది ఖచ్చితంగా నిషేధిస్తున్నది (1 కొరింతు 7:39; ఎజ్రా 9:1-2; నెహెమ్యా 13:23-27; మలాకీ 2:12 కూడా చూడండి). అబద్ధమైన శుభవార్తను బోధించేవారితో, బైబిల్లోని ఏదో ఒక మూల సత్యాన్ని కాదనే దుర్బోధకులతో సహవాసాన్ని కూడా ఇది నిషేధిస్తున్నది. అవిశ్వాసులు పని చేస్తున్న చోట విశ్వాసులు పని చేయకూడదని పౌలు అనడం లేదు, లేక తమ పని చేసేందుకు అవిశ్వాసులను జీతానికి పెట్టుకోవద్దనడం లేదు. అవిశ్వాసులతో ఎలాంటి సంబంధం లేకుండా దూరంగా ఉండాలని దీని అర్థం కాదు (1 కొరింతు 5:9-10). అవిశ్వాసులను క్రీస్తుదగ్గరికి నడిపించాలని పౌలు స్వయంగా వారితో కలిసిమెలిసి ఉన్నాడు (1 కొరింతు 9:19-23). కానీ ఇక్కడ వారితో దగ్గర సంబంధం, ఒకటే గమ్యం ఉండకూడదనీ, బైబిలు సూత్రాల విషయంలో రాజీపడేలా చేసే సంబంధం, క్రీస్తుతో వారి సహవాసాన్ని చెరపగల ఎలాంటి సంబంధం వారితో ఉండకూడదనీ చెప్తున్నాడు. ఈ నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ విశ్వాసి అయినా కష్టాలను కొనితెచ్చుకుంటున్నాడు.

14-16 వచనాల్లో విశ్వాసులు అవిశ్వాసులతో కలవడం ఎంత పొరపాటో, ఎంత తెలివితక్కువతనమో చూపించే ఐదు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎక్కడా పొంతన లేని విషయాలను గానీ వ్యక్తులను గానీ ఒకటిగా చూడకూడదు. దుర్మార్గమంతటి నుంచీ, దుర్మార్గులందరినుంచీ వేరుపడడమన్నది తన ప్రజలకు దేవుని ఆదేశం.

9.) అబద్ద బోధ నుండి .

 (రెండవ తిమోతికి) 3:15

15.నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.

3:15 A కీర్తన 119:98-99; సామెత 22:6; మత్తయి 22:29; లూకా 24:27, 45; 1 కొరింతు 15:3-4; 2 తిమోతి 1:5; 2 పేతురు 1:20-21; కీర్తన 19:7; 71:17; సామెత 8:17; లూకా 2:40; యోహాను 5:39-40; 1 సమూ 2:18; 2 దిన 34:3; దాని 10:21; లూకా 24:32; అపొ కా 10:43; 13:29; 17:2; రోమ్ 1:2; 16:26; ప్రసంగి 12:1; అపొ కా 13:38-39; 1 పేతురు 1:10-12; 2 పేతురు 3:16; ప్రకటన 19:10; లూకా 1:15; 1 యోహాను 5:11-12

3:15 చిన్నప్పటినుంచీ 1:5. బహుశా దీని అర్థం ఇది: వారు క్రైస్తవులు కాకముందే తిమోతి తల్లి, అమ్మమ్మ అతనికి పాత ఒడంబడిక గ్రంథాన్ని (“పవిత్ర లేఖనాలు”) నేర్పారు. ద్వితీ 6:6-7; మొ।। వచనాల్లో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను శిరసావహించారు. ఈ రోజుల్లోని క్రైస్తవ తల్లిదండ్రులు ఇంతకన్నా తక్కువ చేయవచ్చా? – ఎఫెసు 6:4. ఇప్పుడు “పవిత్ర లేఖనాలు” అంటే పాత, క్రొత్త ఒడంబడికల గ్రంథాలు రెండూ కలిసివున్న ఒకే పవిత్ర బైబిలు గ్రంథం. పాత ఒడంబడికను సరిగా అర్థం చేసుకున్నప్పుడు అది మనుషులకు “మోక్షం కోసమైన జ్ఞానాన్ని” కలిగిస్తుంది. లూకా 24:25-27, 45-47; యోహాను 5:39, 46 పోల్చి చూడండి.

 

 

 

 

 

 

ప్రసంగ శాస్త్రం .. click here 


 

Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free Christian Telugu Pdf Files Free

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: restricted