అంశం:విడచి ముందుకు నడచినవారు.
Christian Telugu Messages Pdf
మూలవాక్యము : అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడచినవాడు … నిత్య జీవము పొందును
(మార్కు సువార్త) 10:28,29,30
28.పేతురు ఇది గోమేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను.
10:28 దేవుని సత్యాన్ని కేవలం ఎరిగి ఉండడం, లేక దాన్ని నోటితో వల్లించడం ఎవరికీ శాశ్వత జీవాన్ని ఇవ్వదు. రోమ్ 2:13; యాకోబు 1:22-25 పోల్చి చూడండి. ఈ మనిషి తనకు తెలిసిన సత్యాన్ని ఆచరణలో పెట్టలేదు (రోమ్ 3:23). మనుషులు ఇది చేస్తే జీవిస్తారు, కానీ చెయ్యరు.
10:28 A లేవీ 18:5; యెహె 20:11; మత్తయి 19:17; B నెహెమ్యా 9:29; గలతీ 3:12; C లూకా 7:43; రోమ్ 3:19; 10:4; D యెహె 20:13, 21; మార్కు 12:34
29.అందుకు యేసు ఇట్లనెను నానిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు
10:29 అనేకమంది మనుషులు చేసే పెద్ద తప్పు ఇదే. 16:15 చూడండి. సహజంగా తాము ఏమిటో అంతకన్నా మంచివారుగా మనుషులు తమ గురించి అనుకోవాలని చూస్తారు. తాము పాపులమనీ, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించలేని నిస్సహాయులమనీ ఒప్పుకునేందుకు ఇష్టపడరు. ఎవరైనా సరే తనను న్యాయవంతుడుగా ఎంచడం మాని, దేవుని ఎదుట తన దోషాన్ని ఒప్పుకోవాలి. అంతవరకు ఆశాభావానికి అతనికి ఆధారం ఏమీ లేదు (రోమ్ 3:19-20).
30.ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
10:30 జెరుసలం సముద్ర మట్టానికి దాదాపు 800 మీటర్లు ఎగువన ఉంది. యెరికో అక్కడికి 27 కి మీ దూరాన సముద్ర మట్టానికి దాదాపు 250 మీటర్లు దిగువన ఉంది. జెరుసలం మహా రాజైన దేవుని నగరం (మత్తయి 5:35). యెరికో శాపం కింద ఉన్న నగరం (యెహో 6:26). యెరికోకు వెళ్ళే ఏటవాలుగా బండ రాళ్ళతో ఉన్న దారిలో దోపిడీ దొంగలు పొంచి ఉండేందుకు వీలైన తావులు ఉన్నాయి. ఈ లోకం బండరాళ్ళ మయంగా ఉన్న ప్రదేశం. సైతాను, వాడి దాసులు మనుషుల దగ్గర ఉన్నదంతా దోచుకోవాలని పొంచి ఉన్నారు (యోహాను 8:44; 1 పేతురు 5:8). దేవుడు ఆదిలో మనుషులకిచ్చిన నీతినిజాయితీలను వారు దోచుకొని, మనుషుల్ని తీవ్రంగా గాయపరచి కొనప్రాణంతో వదిలిపోయారు – అంటే భౌతికంగా ప్రాణం ఉంది గానీ ఆధ్యాత్మికంగా కాదు (ఆది 2:17; 3:1-5; ఎఫెసు 2:1-3).
10:30-37 లూకా ఒక్కడే ఈ ఉదాహరణ రాశాడు. పైపైన చూస్తే పొరుగువాడు, ప్రేమ అంటే ఏమిటో ఇది తెలియ జేస్తున్నది. ధర్మశాస్త్ర పండితుడు అడిగిన రెండో ప్రశ్నకు జవాబిస్తున్నది. అయితే అతని మొదటి ప్రశ్నకు (వ 25) జవాబిచ్చే మరింత లోతైన భావం ఇందులో దాగి ఉండవచ్చు. ఆ ప్రశ్నకు ఈ ఉదాహరణ ద్వారా జవాబు ఇవ్వకపోతే యేసు అసలు ఆ ప్రశ్నకు ఇక్కడ జవాబియ్యలేదనే అనుకోవాలి. కానీ మనం అలా అనుకోవచ్చా? అయితే ఈ ఉదాహరణలో ఆధ్యాత్మిక అర్థాలను చెప్పేటప్పుడు ప్రతి విషయాన్ని వివరించి నొక్కి చెప్పడం కూడా వివేకం కాకపోవచ్చు. మత్తయి 13:18-23 నోట్స్ చూడండి.
1.) సమస్తమును విడిచిన అబ్రహాము.
(ఆదికాండము) 12:1,2,3,4
1.యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
12:1 దేవుడు అబ్రాహామును పిలవడం బైబిల్లో మరొక గొప్ప ఆరంభం. క్రీస్తుకు పూర్వం సుమారు 1900 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఇక్కడినుంచి క్రొత్త ఒడంబడిక గ్రంథంలో “అపొస్తలుల కార్యాలు” పుస్తకం వరకు అబ్రాహాము సంతతివారి చరిత్ర కనిపిస్తుంది. అబ్రాహాము యూద జాతికి తండ్రి. దేవునిలో అతడికున్న గొప్ప నమ్మకంవల్ల, దేవునిమీద నమ్మకం ఉంచినవారందరికీ అతణ్ణి తండ్రి అని పిలిచాడు పౌలు (రోమ్ 4:11). ఇతణ్ణి దేవుని సేవకుడు (26:24), ప్రవక్త (20:7), ఇస్రాయేల్ జాతికి పూర్వీకుడూ మూలపురుషుడూ (యెషయా 51:2; రోమ్ 4:1) అని కూడా అన్నారు. అయితే బహుశా అతనికున్న గొప్ప పేరు “దేవుని స్నేహితుడు” (యెషయా 41:8; యాకోబు 2:23). దేవుని పిలుపుపట్ల విధేయత, నమ్మకంతో ఇదంతా మొదలైంది (హీబ్రూ 11:8-10).
12:1 A ఆది 11:31-32; 15:7; యెహో 24:2-3; నెహెమ్యా 9:7; యెషయా 51:2; లూకా 14:26-33; అపొ కా 7:2-6; 2 కొరింతు 6:17; హీబ్రూ 11:8; B యెషయా 41:9; యెహె 33:24; ప్రకటన 18:4; C కీర్తన 45:10-11
2.నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
12:2 “గొప్ప ప్రజ”– 17:4-8; 18:17-18; 22:17; 46:3; నిర్గమ 1:7; ద్వితీ 26:5.
“దీవించి”– దీవెనలు ఇహసంబంధమైనవి కావచ్చు. ఆత్మ సంబంధమైనవీ కావచ్చు. ఆత్మ సంబంధమైన దీవెనలు భౌతిక దీవెనలకంటే ఎన్నో రెట్లు ప్రాముఖ్యమైనవి (మత్తయి 5:3-12; లూకా 6:20-26). అవి శాశ్వతమైనవి (మత్తయి 6:19-21). 24:35; సంఖ్యా 6:22-27; ద్వితీ 28:3-14; కీర్తన 1:1-2 దగ్గర నోట్స్ చూడండి. అబ్రాహాము దేవుని దీవెనలు పొందడం మాత్రమే గాక, ఇతరులకు దీవెన కారణమయ్యాడని గమనించండి.
3.నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా
12:3 “దీవిస్తాను”– 22:18-19, 21; 26:4; 28:14; అపొ కా 3:25-26; గలతీ 3:8-9. దేవునిపై నమ్మకం, ఆయనపట్ల విధేయత గొప్ప దీవెనలను తెస్తాయి – వీటిని కలిగివుండే వ్యక్తికి మాత్రమే కాదు, అతని మూలంగా అనేకమందికి కూడా.
4.యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.
2.) తన పనిని విడిచిన ఎలీషా.
(మొదటి రాజులు) 19:19
19.ఏలీయా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేర బోయి తన దుప్పటి అతని మీద వేయగా
19:19 “దున్నుతూ”– తరచుగా తన సేవకులు సాధారణమైన చిన్న చిన్న పనుల్లో ఉండగా దేవుడు వారిని పిలుస్తుంటాడు (మత్తయి 4:8; 9:9).
19:19 A 2 రాజులు 2:8; B 1 సమూ 28:14; 2 రాజులు 2:13-14; C నిర్గమ 3:1; న్యాయాధి 6:11; 1 రాజులు 19:13; కీర్తన 78:70-72; ఆమోసు 7:14; జెకర్యా 13:5; మత్తయి 4:18-19
3.) వస్త్రము విడిచిన యోసేపు.
(ఆదికాండము) 39:13
13.అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించు కొనిపోవుట ఆమె చూచినప్పుడు
4.) గురువును విడిచిన దేమా.
(రెండవ తిమోతికి) 4:10
10.దేమాయిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;
4:10 “ఈ లోకంమీద ప్రీతి కలిగి”– ఎవరి గురించి అయినా ఈ విధంగా చెప్పాలంటే చాలా విచారకరం. 1 యోహాను 2:15-17 చూడండి.
5.) సమస్తమును విడిచిన శిష్యులు.
(లూకా సువార్త) 18:28
28.పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా
6.) కుండను విడిచిన సమరయు స్త్రీ.
(యోహాను సువార్త) 4:28
28.ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి
7.) సమస్తమును నష్టముగా ఎంచుకొన్న పౌలు.
(ఫిలిప్పీయులకు) 3:7,8
7.అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.
3:7 ఈ కొత్త మనస్తత్వం, దృక్పథం దమస్కు దారిలో అతనికి కలిగిన అనుభవంతో ఆరంభం అయింది – అపొ కా 9:3-6. ఏవి నిజమైన విలువ గలవి అన్న జ్ఞానోదయం అతనికి కలిగింది. ఆధ్యాత్మికంగా ఏవి తనకు లాభమనుకున్నాడో నిజానికి అవి నష్టం అని గ్రహించాడు. గర్వం, తనలో నమ్మకం అతణ్ణి క్రీస్తుకు దూరంగా ఉంచాయి. ఇప్పుడు దానంతటినీ విడిచిపెట్టాడు. జన్మ గర్వం, మత గర్వం, తాను సాధించిన వాటిని బట్టి కలిగిన గర్వం మొదలైనవాటిని విసర్జించాడు. అతని ఆధ్యాత్మిక నేత్రాలు తెరుచుకోవడంతో అప్పటి వరకు అతనికి ఇష్టమైనవి పనికిమాలినవిగా, నీచమైనవిగా అనిపించాయి. పౌలు జీవితానికి అప్పటి వరకు “నేను” అనేది కేంద్రం. ఇప్పుడు క్రీస్తు ఆ కేంద్రం అయ్యాడు. నిజంగా జ్ఞానప్రకాశాలు అనుభవించి క్రీస్తును ఎరిగినవారందరి విషయంలోనూ ఇలానే జరుగుతుంది.
8.నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.
8.) సర్వసంపదలు విడిచిన మోషే.
(హెబ్రీయులకు) 11:24,25,26
24.మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
ప్రతిదానికీ ఉన్న సరైన విలువను గుర్తించేందుకు నమ్మకం తోడ్పడుతుంది. రాబోయే కాలంలో కలుగనున్న అదృశ్యమైనవి ఇప్పుడు లోకం ఇస్తున్న వాటన్నిటికంటే మరెంతో విలువ గలవన్న నిశ్చయాన్ని నమ్మకం కలిగిస్తుంది. ఫిలిప్పీ 3:7-8 పోల్చి చూడండి. నమ్మకానికీ పరిత్యాగానికీ ఉన్న సంబంధానికి మోషే ఉదాహరణ. 10:34; లూకా 14:33; 18:28-30; మత్తయి 4:18-22; 10:37-39; 16:24-28 చూడండి. నిజమైన నమ్మకం క్రీస్తుకోసం దేన్నయినా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. అలా చేయడానికి మనసు లేనివారు తమకు నమ్మకం ఉందని చెప్పుకున్నప్పటికీ, వారి నమ్మకం వాస్తవమైనదని ఇతరులు అనుకున్నప్పటికీ వారిలో బైబిలు సంబంధమైన నిజ విశ్వాసం లేదు. అలాగైతే మోషే, పౌలువంటివారి మార్గాన్ని త్రోసిపుచ్చి, క్రీస్తు కోసం బాధలు పడేందుకు నిరాకరించి, ఈ లోక సుఖభోగాలు లేక సంపదలు, లేక అధికారాల వెంట పరుగులెత్తేవారిని ఏమనాలి? ఈ గొప్ప సత్యాన్ని వారు నేర్చుకోవసిన అవసరత ఎంతైనా ఉంది – ఈ లోకం ధనధాన్యాల కన్నా క్రీస్తు కోసమైన నింద మేలు (వ 26; 13:13; అపొ కా 5:41; 1 పేతురు 4:12-16).
11:24-26 నిర్గమ 2:11-13; అపొ కా 7:23-26. నలభై ఏళ్ళ ప్రాయంలో మోషే ఈజిప్టా, లేక దేవుడా అన్న నిర్ణయం చేసుకున్నాడు. ఈజిప్ట్‌ను ఎన్నుకుంటే లోక సంబంధమైన అధికారం, వైభవం, సుఖం ఉంటాయి. దేవుణ్ణి ఎన్నుకుంటే అదంతా విడిచిపెట్టి అక్కడి బానిసలుగా ఉంటున్న దేవుని ప్రజలతోబాటు కష్టాలు అనుభవించాలి. మోషే దేవుణ్ణి ఎన్నుకుని మిగతావాటిని వదిలేశాడు. అతనికి నమ్మకం ఉంది కాబట్టే ఇలా చేయగలిగాడు.
25.అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,
26.ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను.
Christian Telugu Messages Pdf Christian Telugu Messages Pdf Christian Telugu Messages Pdf Christian Telugu Messages Pdf Christian Telugu Messages Pdf Christian Telugu Messages Pdf Christian Telugu Messages Pdf Christian Telugu Messages Pdf Christian Telugu Messages Pdf Christian Telugu Messages Pdf Christian Telugu Messages Pdf
66 పుస్తకాల వివరణ కొరకు.. Click here