Christian Telugu Message Pdf1 – యేసు శిష్యులకిచ్చిన బాహుమానాలు

Written by biblesamacharam.com

Updated on:

యేసు శిష్యులకిచ్చిన బాహుమానాలు

Christian Telugu Message Pdf1

 ప్రపంచచరిత్రలో పునరుత్థానమనేది ఒక మహత్తరమైన ఘట్టము. యేసుప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేవడమనేది ఆశ్యర్యకరమైన సంఘటన. అది యేసుప్రభువు దైవత్వాన్ని ఋజువుచేస్తున్నది. 

 యేసుప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు మనుష్యకుమారుడు మూడవరోజున సమాధిని జయించి తిరిగిలేస్తాడని అనేకసార్లు ముందుగానే ప్రకటించారు, ఆయన చెప్పినమాట ప్రకారము తిరిగిలేచారు. ఆయన అన్నమాట ప్రకారము కార్యాలు చేయువాడు. ఆయన అబద్ధములాడుటకు నరమాత్రుడు కాడు. ఆయన మాట చెబితే అది ఖచ్చితముగా జరుగుతుంది. అది యేసుప్రభువుకున్న మహాత్మ్యములో ఒకటిగా పరిగణించబడుతుంది. 

 యేసుప్రభువు తిరిగిలేచాడు అనటానికి అనేకమైన నిదర్శనాలు చరిత్రలో ఉన్నాయి. ఆయన తిరిగిలేచాడనటానికి ఖాళీ సమాధి మొదటి నిదర్శనం. ఆ తర్వాత 40 రోజులు అనేకమందికి ప్రత్యక్షమయ్యారు. అపూర్వమైన ప్రత్యక్షతలద్వారా యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగిలేచాడని అనేకమంది గుర్తించారు. అయితే యేసుప్రభువు మరణాన్ని జయించి తిరిగిలేచిన ఆదివారపు రోజున గలిలయకు వచ్చి ఆయన శిష్యులను కలుసుకున్నట్లుగా బైబిల్లో ఉన్నది. ఏ శిష్యులనైతే ఆయన ఏర్పాటుచేసుకున్నాడో, నా వెంబడి రండి మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తానని యేసుప్రభువువారు స్పష్టమైనరీతిలో పిలిచారో, వారిని ప్రేమించి వారిని వెతుక్కుంటూ వచ్చినట్లుగా పరిశు ద్ధలేఖనాల్లో మనము చూస్తున్నాం. 

 యోహాను 20:19-23 వరకు మనము చదివితే అక్కడ యేసుప్రభువు శిష్యులకు అనుగ్రహించిన బహుమానాలు స్పష్టముగా వ్రాయబడ్డాయి. మరణాన్ని జయించి తిరిగిలేచిన యేసుప్రభువు సర్వాధికారము గలవాడై, సార్వభౌమాధికారము గలవాడై, సమస్తముమీద ఆధిపత్యము గలిగినవాడై శిష్యులకు దర్శనమిచ్చాడు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటితలుపులు మూసికొనియుండగా యేసువచ్చి వారిమధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక! అని వారితో చెప్పెను. 

 శిష్యులు ఇంకా భయపడుతూనే ఉన్నారు. వారు గెత్సెమనే తోటలో యేసుప్రభువు ను పట్టుకొంటున్నప్పుడు భయపడి పారిపోయారు. అయితే పారిపోయిన తర్వాత యేసుప్రభువు మరణాన్ని జయించి తిరిగిలేచిన తర్వాతకూడా అదే భయాన్ని వారు కలిగియున్నారు. వారు యూదులకు భయపడి దాగుకున్నారు. ఎందుకోసమంటే అప్పటికే ఒక వార్త ఆ సమాజములో పొక్కిపోయింది. యేసుప్రభువు శిష్యులు ఆయన దేహాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టి యేసుప్రభువు తిరిగిలేచాడని ప్రకటిస్తున్నారు అనే వార్తను బట్టి శిష్యులు భయపడిఉండవచ్చు. సువార్తలను మనము గమనిస్తే అనేక సందర్భాల్లో ప్రభువునుండి మేలులు పొందుకొనిన వారు యూదులకు భయపడి సత్యాన్ని అంగీకరించలేకపోయారు. అయితే శిష్యులు కూడా యూదులకు భయపడుతూండడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ అది వారిలో ఉన్న మానవనైజాన్ని బయట పెడుతుంది. వారు కూడియున్న ఇంటితలుపులు మూసియుండగా యేసు వారి మధ్యకు వచ్చి నిలిచెను. 

సన్నిధి

 యేసుప్రభువు పునరుత్థానుడైన తర్వాత ఆయన వారికిచ్చిన మొదటి బహుమానము ఆయన ప్రత్యక్షత, ఆయన సన్నిధి. నేను మీతో కూడా ఉన్నాను, సదాకాలము మీతో కూడా ఉంటాను అని దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి ఆయన శ్రీకారము చుట్టారు. శిష్యులను దర్శించి వారిమధ్య నిలిచాడు, ప్రత్యక్షత అనుగ్రహించాడు. నిజంగా ఇది గొప్ప బహుమానము. మానవుడు దేవుని దగ్గరనుంచి పొందుకోగలిగే శ్రేష్టమైన బహుమానాలలో ఆయన సన్నిధి ఒకటి. యేసుప్రభువు ఎక్కడుంటే అక్కడ ధైర్యము, వెలుగు, నిరీక్షణ ఉన్నది. ఇదిగో నేను మరణాన్ని జయించి తిరిగిలేచాను, మరణబంధకము నన్ను బంధించి ఉంచలేకపోయింది అని చెప్పి యేసుప్రభువు తన ప్రత్యక్షతను వారికి అనుగ్రహించడంద్వారా వారిలో ఉన్న భయాన్ని, ఆందోళనను, కలవరాన్ని తొలగించాలని యేసుప్రభువువారు వారి మధ్య నిలిచారు. 

 ఈ మాటలు చదువుతున్న ప్రియ చదువరీ! ఒకవేళ నీ జీవితములో కూడా భయమున్నదా? గత జీవితాన్ని గురించిన భయముకాని, భవిష్యత్తును గురించిన భయముకాని, లోకసంబంధమైన విషయాలను గురించిన భయముకాని నీలో ఉంటే దేవుడు నీకివ్వాలనుకుంటున్న గొప్ప బహుమానము ఆయన సన్నిధి. దేవుని సన్నిధి మనతో ఉంటే గొప్ప ధైర్యముంది. దావీదు మహారాజు కీర్తన వ్రాస్తూ, దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అనే మాట వ్రాసాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషముంది… ఆయన సన్నిధిలో ప్రభావమున్నదని బైబిల్ సెలవిస్తుంది. 

 నీ జీవితములో ఓటమితో కృంగియున్నావా? బాధల్లో, కష్టాల్లో ఉన్నావా? నిందలు, అవమానాల మధ్య ఉన్నావా? నీ జీవితములో నిట్టూర్పుతో ఉన్నావా? నిరాశ, నిస్పృహల మధ్య జీవిస్తున్నావా? యేసుప్రభువు మరణాన్ని జయించి తిరిగిలేచాడు గనుక నీ జీవితంలో కార్యాలు జరిగించుటకు శక్తిగలవాడు. నా విమోచకుడు సజీవుడని భక్తుడైన యోబు తెలియచేస్తున్నాడు. నీ దేవుడు సజీవుడు మరియు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనుక నీవు భయపడనక్కరలేదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి మరణబంధకములను త్రెంచివేశాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసించారు. నీ జీవితములో, నా జీవితములో కార్యాలను జరిగించే సమర్థుడు ఆయనే. 

 ఒకవేళ ఇంకా భయము గుప్పిట్లో ఉన్నావా? దావీదు భక్తుడు అంటున్నాడు – దేవుడు నాకు వెలుగును, నాకు రక్షణయై యున్నాడు నేనెవరికి భయపడుదును. నిందలు, అవమానాలకు గానీ, అనారోగ్యాలకు గానీ, అప్పుబాధలకు గానీ, లోకసంబంధమైన వ్యక్తులకు గానీ, భక్తిహీనులకు గానీ, కఱ్ఱకు గానీ, ఖడ్గానికి గానీ, కాగితానికి గానీ దేనికీ భయపడాల్సిన అవసరత లేదు కారణం మన దేవుడు సజీవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనుక సంపూర్ణ ధైర్యము మన హృదయాల్లో క్రుమ్మరించబడినది. 

సమాధానము

 యేసుప్రభువు పునరుత్థానుడైన తర్వాత ఆయన వారికిచ్చినరెండవ బహుమానము సమాధానము. యేసుప్రభువు వారికి కనబడి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ప్రతీసారీ యేసుప్రభువు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చిందే సమాధానాన్ని తీసుకురావడానికి, ఆయన కలువరి సిలువలో మరణించిందే సమాధానమివ్వడానికి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచింది సమాధానమివ్వడానికి. దేవుడిచ్చు సమాధానము లోకజ్ఞానానికి మించినదని బైబిల్ సెలవిస్తుంది. ప్రయాసతో ఉన్నవారలారా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని పలికిన యేసుప్రభువు ఆయా సందర్భాలలో సమాధానాన్ని ప్రజలకిచ్చారు. శిష్యులకు సమాధానాన్ని ప్రకటించిన యేసుప్రభువు నీ జీవితంలో కూడా సమాధానాన్ని దయచేయగలరు. 

 ప్రియ చదువరీ! నీ జీవితంలో సమాధానమును వెదుకుతున్నావా? డబ్బులో, అందంలో, అంతస్థులో, భౌతిక సంబంధమైన కార్యాల్లో సమాధానముకోసం వెతికివెతికి అలసిపోయి కృంగిపోతున్నావా? శాంతి, సమాధానములేక అలసిపోతున్నావా? యేసుప్రభువు నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. 

 ఒకసారి నేను బేకరీలో నండేస్కూలు పిల్లలకొరకు చాక్లెట్లు, బిస్కెట్లు కొంటున్నప్పుడు ఒక వ్యక్తి షాపు యజమాని దగ్గరకు వచ్చి నీ పేరుమీద శాంతి చేయిస్తానని 15 రూ॥ ఉంటే ఇవ్వమని అడిగాడు. షాపు యజమాని మారు మాట్లాడకుండా 15 రూపాయలు తీసి ఇచ్చేసాడు. కేవలం 15 రూపాయలకే శాంతి వస్తుందా? అని ఆలోచన చేయడం ప్రారంభించాను. రూపాయలకే శాంతి వచ్చేస్తే ఈ లోకములో ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నవారందరూ ఆ 15 రూపాయలు లేకనేనా? 

 సమాధానము డబ్బుతో వచ్చేదికాదు, సమాధానము అంతస్థులతో వచ్చేదికాదు, భోగభాగ్యాలతో వచ్చేదికాదు. సమాధానము దేవుని నుండి వచ్చేది. ఆయన సమాధానకర్త గనుక ఆయన మాత్రమే సమాధానాన్ని ఇవ్వగలడు. ఆయన శరణు కోరిన ఎందరో శాంతిని అనుభవించారు. సమాధానాన్ని రుచి చూశారు. యేసుప్రభువు శిష్యులను చూచినతర్వాత పునరుత్థానమైన యేసుప్రభువు శిష్యులకిచ్చిన రెండవ బహుమానము మీకు సమాధానము కలుగును గాక! 

పరిశుద్ధాత్మ

 యేసు ప్రభువు పునరుత్థానుడైన తర్వాత ఆయన వారికిచ్చిన మూడవ బహుమానము పరిశుద్ధాత్మ. పరిశు దాత్మను యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు అనుగ్రహించినట్లుగా యోహాను 20:22లో మనము చూస్తాము. ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశు ద్ధాత్మను పొందుడి. యేసుక్రీస్తు శిష్యులందరు కూడా యేసుక్రీస్తు ప్రభువు చేత వాగ్దానము చేయబడిన ఆత్మను వారు పొందుకున్నారు. యోహాను 16:7 వచనం మనము చదివితే, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుటవలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళనియెడల ఆదరణకర్త, ఉత్తరవాది మీయొద్దకు రాడు. నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. అనేమాట యేసుప్రభువు తెలియజేశారు. పరిశుద్ధాత్మను కానుకగా అనుగ్రహించారు. 

 నిజమే, అపొ. పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ యేసుక్రీస్తు ప్రభువును మన సొంతరక్షకునిగా అంగీకరించినప్పుడు మనము పరిశుద్ధాత్మద్వారా ముద్రింపబడతామనే దివ్య సత్యాన్ని ప్రబోధించారు. మీరు రక్షణ సువార్తను విని అనగా సత్యవాక్యమును విని పరిశు ద్ధాత్మచేత ముద్రింపబడ్డారు అని అ.పొ పౌలు తెలియజేశాడు. ఒక వ్యక్తి తాను పాపినని గుర్తించి ప్రభువు ఆత్మ నీతినిగూర్చియు, తీర్పును గూర్చియు పాపమును, లోకమును గూర్చియు ఒప్పింపజేసినప్పుడు ఆ ఒప్పుదలకు లోబడి ప్రేరేపణకు లోబడి యేసుక్రీస్తు ప్రభువును సత్యదేవుడుగా గుర్తిస్తారో వారు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు. వారు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడతారు. దేవుని ఆత్మచేత ముద్రింపబడినప్పుడు,దేవుని ఆత్మద్వారా నింపబడినప్పుడు అనేక ప్రాంతాల్లో సాక్షులుగా మనము ఉంటాము. 

 అపొస్తలుల కార్యములు 1:8 ప్రకారం, పరిశు ద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు గనుక యూదయ, సమరయ, గలిలయ ప్రాంతములంతటిలో మీరు నాకు సాక్షులైయుంటారని యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడారు. అవును, యేసుక్రీస్తు ప్రభువు ఆనాటి శిష్యులను ఆశీర్వదించాడు. ఏ శిష్యులైతే యేసుక్రీస్తు ప్రభువును గెత్సేమనే తోటలో బంధిస్తున్నప్పుడు పారిపోయారో అదే శిష్యులు దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించారు.

 మరణమెదురైనా దేవుని సువార్తను ప్రకటించారు. గొంతుకలు కోస్తున్నా, చర్మములు ఒలిచివేస్తున్నా, సిలువలు వేస్తున్నా వారు యేసే దేవుడని, ఆయనే సత్య మార్గమని నిర్భయంగా, నిస్సందేహంగా అనేకమందికి ప్రకటించారు. ఇంతగొప్ప ధైర్యము ఎక్కడనుండి వచ్చిందంటే పరిశుద్ధాత్మద్వారా అనుగ్రహింపబడిన ధైర్యము. 

 ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా! ఈ మాటలు చదువుతున్న నీవు పునరుత్థానుడైన యేసుక్రీస్తు నేటికి సజీవుడు గనుక ఆనాడు శిష్యులకు ఇచ్చిన బహుమానములు మనకును ప్రసాదించాలని కోరుకొనుచున్నాడు. ఆయన మన మీద ఉంచిన బాధ్యతను నెరవేర్చుటకు అవి అవసరమైయున్నవి. 

మీరు సమస్త లోకమునకువెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. తండ్రి నన్ను పంపిన ప్రకారము మిమ్మును కూడా పంపుచున్నాను గనుక అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, సత్యాన్ని బోధించండని యేసుక్రీస్తు ప్రభువు బృహత్తరమైన బాధ్యత మన భుజాలమీద పెట్టాడు. ఈ మాటలను బట్టి ప్రేరేపితమవుదాం, మనల్ని మనము పురికొల్పుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు సేవ చేయడానికి, ఆయన కృపలో వర్ధిల్లడానికి, ఆయన నామమును ప్రచురము చేయడానికి మనమందరము కూడా ముందుకు సాగిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నామము మహిమ పరచబడుతుంది. అనేకమంది సత్యాన్ని తెలుసుకొని యేసుప్రభువు బిడ్డలుగా జీవిస్తారు. అలాంటి కృప యేసుక్రీస్తు ప్రభువు మనకు దయచేయును గాక! ఆమెన్!! 

Christian Telugu Message Pdf  Christian Telugu Message Pdf Christian Telugu Message Pdf Christian Telugu Message Pdf Christian Telugu Message Pdf Christian Telugu Message Pdf Christian Telugu Message Pdf Christian Telugu Message Pdf Christian Telugu Message Pdf Christian Telugu Message Pdf Christian Telugu Message Pdf


ప్రత్యక్ష గుడారం మెటీరియల్ కొరకు………….Pdf

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted