ఆత్మల సంపాదనకు 7 మార్గాలు – Christian Messages Pdf Telugu

Written by biblesamacharam.com

Published on:

 ఆత్మల సంపాదనకు ఏడు మార్గాలు.

Christian Messages Pdf Telugu

1.) సంఘం అంతయు ఉపవాస ప్రార్థన చేయండి.

(మార్కు సువార్త) 9:29

29.అందుకాయన ప్రార్థనవలననే (అనేక ప్రాచీన ప్రతులలో-(వలనను)ఉపవాసము వలననే అని కూర్చబడి యున్నది) గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.

9:29 A దాని 9:3; మత్తయి 17:20; యాకోబు 5:15; B 1 రాజులు 17:20-22; మత్తయి 12:45; లూకా 11:26; అపొ కా 14:23; 1 కొరింతు 9:27; 2 కొరింతు 11:27; 12:8; ఎఫెసు 6:18; C అపొ కా 9:40-41; D 2 రాజులు 4:33-34; E 2 కొరింతు 6:5

2.) సంఘం అంతయు కరపత్రాలు పంచండి.

(నెహెమ్యా) 9:3

3.మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువ బడి, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చదువుచు వచ్చిరి,ఒక జాముసేపు తమ పాపములను ఒప్పు కొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి.

3.) సంఘమంతయు గృహాలు దర్శించండి.

(అపొస్తలుల కార్యములు) 20:20,21

20.మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు,

20:20-21 తనకు ఎంత కష్టం, బాధ, హింస వచ్చినా ప్రతి వ్యక్తీ క్రీస్తు శుభవార్త వినే అవకాశం కలగాలని అతడు నిశ్చయించుకొన్నాడు. వారు బహిరంగ సభలకు రాకపోతే అతడు వారిదగ్గరికి వెళ్ళాడు. పాపవిముక్తి, రక్షణ పొందగోరేవారికి తప్పక ఉండవలసినవి రెండు – పశ్చాత్తాపం, విశ్వాసం (అసలు, ఈ రెండు ఒకటే. నిజ విశ్వాసం, పశ్చాత్తాపం వేరుచేయ సాధ్యంకాని విధంగా కలిసి ఉన్నాయన్నమాట). ఈ రెంటిని పౌలు ఎప్పుడూ ప్రకటించేవాడు. పశ్చాత్తాపం గురించి 2:38; 17:30; మత్తయి 3:2; 4:17; లూకా 13:1-5; 24:47 చూడండి.

21.దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును.

4.) సంఘమంతయు ప్రయాసపడి పని చేయండి.

(అపొస్తలుల కార్యములు) 8:14

14.సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి.

8:14 రాయబారులు సమరయలో ఉన్న నిజ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని కోరారు, దేవుని వల్ల జరిగిన నిజమైన పనిని ఆమోదించాలని కోరారు.

8:14 A అపొ కా 8:1; B గలతీ 2:9; 1 తెస్స 2:13; 3:2; 2 తెస్స 2:10; C మత్తయి 13:23; లూకా 22:8; యోహాను 12:48; అపొ కా 2:41; 3:1-3; 11:1, 19-22; 15:4; 17:11

5.) సంఘమంతయు సమర్పణ, బాధ్యత కలిగి ఉండండి.

(అపొస్తలుల కార్యములు) 2:45

45.ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.

2:45 A 1 తిమోతి 6:18-19; 1 యోహాను 3:17; B సామెత 11:24-25; 19:17; యెషయా 58:7-12; మత్తయి 19:21; లూకా 12:33-34; 18:22; అపొ కా 4:34—5:2; 11:29; 2 కొరింతు 9:9; యాకోబు 2:14-16; C కీర్తన 112:9; ప్రసంగి 11:1-2; లూకా 16:9; 19:8; D యాకోబు 5:1-5

6.) సంగం అంతయు పరిశుద్ధాత్మ ద్వారా నడవండి.

(రోమీయులకు) 8:14

14.దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

8:14 దేవుని సంతానమంటే ఏమిటో వివరించే వచనం ఇది. దేవుని సంతానమంటే ఆయన ఆత్మమూలంగా పుట్టినవారు (యోహాను 1:12-13). అంతేకాదు, దేవుని ఆత్మ దారి చూపుతూ ఉండగా వారు అనుసరిస్తారు (యోహాను 10:27 పోల్చి చూడండి). ఆత్మ వారిని తమ శరీర క్రియలను చావుకు గురిచేసేలా నడిపిస్తాడు. దేవుని ఆత్మ ఎప్పుడూ విశ్వాసులను స్వార్థం నుంచీ పాపం నుంచీ దూరంగా నడిపిస్తాడు. ఈ అనుభవం లేని వ్యక్తిలో నిజమైన పశ్చాత్తాపం, నమ్మకం లేవన్నమాట. అతడు పాపవిముక్తి, రక్షణ పొందలేదన్నమాట (1 యోహాను 2:4-6; 3:3, 7-10; యోహాను 14:23-24). పౌలు విశ్వాసులను దేవుని సంతానం అంటున్నాడు. 6:16-22లో వారిని బానిసలు అన్నాడు. ఈ రెండూ పరస్పర విరుద్ధ భావాలేమీ కావు. బానిసత్వం అనడంలో బలవంతంగా దాస్యంలో ఉండడమని అతని ఉద్దేశం కాదు. సమ్మతించి ఆనందంగా దేవుణ్ణి సేవించడమే. సంతోషంగా దేవునికి బానిసలు కావడంద్వారా విశ్వాసులు తాము దేవుని సంతానమని రుజువు పరచుకుంటారు. దేవుని దాసులుగా ఉండేందుకు వారికి ఇష్టం లేకపోతే ఆయన సంతానంగా ఉండేందుకు వారు అర్హులు కాదని తమంతట తామే బయట పెట్టుకుంటున్నారన్నమాట. నిజానికి అలాంటివారు దేవుని సంతానం కారు.

8:14 కీర్తన 143:10; సామెత 8:20; యెషయా 48:16-17; హోషేయ 1:10; యోహాను 1:12; రోమ్ 8:5, 9, 16-17, 19; 9:8, 26; 2 కొరింతు 6:18; గలతీ 3:26; 4:6; 5:16, 18, 22-25; ఎఫెసు 1:5; 5:9; 1 యోహాను 3:1; ప్రకటన 21:7

7.) సంఘము అంతయు యేసును గూర్చి ప్రకటించండి.

(మొదటి కొరింథీయులకు) 1:23

23.అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.

“తెలివితక్కువతనం”– నేరస్థులను మాత్రమే సిలువ వేస్తారు గదా, సిలువ వేయబడిన నేరస్థుడికి ఎవరి విముక్తితోనైనా ఏమి సంబంధం ఉండగలదు? అనీ, తాము వెదికే జ్ఞానం అలాంటివారిలో ఎలా వెల్లడౌతుంది? అనీ వారు వాదించేవారు.

 

 

 

 

 

 

 

 

 

 

Christian Messages Pdf Telugu Christian Messages Pdf Telugu Christian Messages Pdf Telugu Christian Messages Pdf Telugu Christian Messages Pdf Telugu Christian Messages Pdf Telugu Christian Messages Pdf Telugu Christian Messages Pdf Telugu


ప్రశ్నలు – జవాబులు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: restricted