స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కొందరు క్రైస్తవ ప్రముఖుల  వివరాలు|Christian Contribution to the Freedom Struggle|2023

Written by biblesamacharam.com

Updated on:

స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కొందరు క్రైస్తవ ప్రముఖుల  వివరాలు

Christian Contribution to the Freedom Struggle|2023

రెండు శతాబ్దాలకు పైగా బ్రిటీష్ వలస పాలన క్రింద బానిసగా మారిన భారతావని బానిస సంకెళ్లు తెంచి స్వతంత్ర భారత దేశంగా మార్చుటకు ఎందరో మహానుభావులు, అమర వీరులు కుల మత జాతి లింగ వర్గ భేదాలు లేకుండా యేళ్లతరబడి పోరాడి సాధించిన భారతదేశ స్వాతంత్య్రన్ని, నేడు కొందరు కుహనా మత మౌఢ్యం మదిలోకి జొప్పించుకున్న అనునాయుల వల్ల, భారత స్వతంత్ర  సంగ్రామంలో క్రైస్తవులు పాల్గొనలేదు బ్రిటీషర్స్ కి తొత్తులుగా వున్నారు అన్న అసత్య అపకీర్తి మూటగట్టుకునే ప్రమాదం ఏర్పడింది.

     కొందరు మతోన్మాదులు వారి రాజకీయ బ్రతుకుదేరువు కోసం పనిగట్టుకుని క్రైస్తవులను అవమాణిస్తూ విమర్శించినంత మాత్రాన చరిత్రను మాత్రం మార్చేలేమనే సంగతి మర్చిపోతున్నారు,గనుకనే చరిత్ర సాక్ష్యంగా నిలుస్తున్న స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కొందరు క్రైస్తవ ప్రముఖుల  వివరాలు …

1) తరేవ్తుందియిల్ తితుస్ (తితుస్ జీ )

తితుస్ జీ  కేరళ క్రైస్తవుడు. నోట్ల రద్దు కాకముందు ఉన్న 500 రూపాయల నోటుపై గాంధిజీతో స్వతంత్ర సమారయోధులు నడుస్తున్న చిత్రంలో గాంధిజీ తర్వాత 7వ వ్యక్తీ తితుస్ జీ… దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. తితుస్ జీ అనే పేరుని గాంధిజీ ముద్దుగా పిలిచేవారు.

titus ji

2.) కాళీ చరణ్ బెనర్జీ (1847-1902),

   కాళి చరణ్ బెనర్జీ లేదా కే.సి. బెనర్జీ లేదా K.C. , కలకత్తా క్రిస్టో సమాజ్  (క్రైస్తవ సమాజం) యొక్క స్థాపకుడు.భారత స్వతంత్ర సాయుధ ఉద్యమ మార్గదర్శకులలో బేనర్జీ ప్రముఖుడు. భారత జాతి విముక్తి  ఉద్యమ స్థాపకుడిగా ఉన్నారు మరియు భారతదేశ స్వతంత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు.

బెంగాల్ హెరాల్డ్ పత్రికలో బెనర్జీ అన్న మాటలు ఇలా ఉన్నాయి.

    “మేముక్రైస్తవులమే అయినప్పటికీ హిందువులుగా రద్దుచేయబడినవారంకాము, మేము హైందవ క్రైస్తవులం,మేము క్రైస్తవ్యన్ని అనుసరించువారం కానీ మా నర నరాన ఉన్నది జాతీయత్వం. మేము సహోదర భావం కలిగిన జాతీయవాదులం”బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలకు గాను కోల్ కత జైల్ లో బంధించబడి తీవ్ర మనోవ్యధకు గురిచేయబడుట చేత 1902 లో వీర మరణం పొందాడు.

Kalicharan_Banurji
Kalicharan_Banurji

2)కృష్ణ మోహన్ బెనర్జీ (24 మే 1813 -11 మే 1885)

   19 వ శతాబ్దపు భారతీయ ఆలోచనాపరుడు, హిందూ తత్వశాస్త్రం, మతం మరియు నైతికతలను క్రైస్తవ సిద్ధాంతాలకు అన్వయిస్తూ పరిశోదించేవాడు. తర్వాత స్వతహాగా సత్యాన్ని గ్రహించి క్రైస్తవుడు అయ్యాడు, మరియు బెంగాల్ క్రిస్టియన్ అసోసియేషన్ యొక్క మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు,ఈ బెంగాల్ క్రిస్టియన్ అసోసియేషన్ అనే సంస్థ బ్రిటీషర్స్ ప్రమేయం లేకుండా భారతీయులచే నిర్వహింపబడి, ఆర్ధికంగా ప్రోత్సాహించబడింది . ఈ వేదిక ద్వారా కృష్ణ మోహన్ బెనర్జీ బ్రిటీష్ వారిపై పోరాటం సాగించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. క్రైస్తవ మిషనరీగాను రచయితగాను భారత స్వతంత్ర సంగ్రామానికి క్రైస్తవులను పురికొల్పడానికి ఎంతో కృషి చేసిన కృష్ణ మోహన్ 11 మే 1885 న మరణించారు.

krishna mohgan benarji
krishna mohgan benarji

3)ఉత్కల్ గురాబ్ మధుసూదన్ దాస్ (28 ఏప్రిల్ 1848 – 4 ఫిబ్రవరి 1934)

    స్వతంత్ర సంగ్రామంలో తన కడవరకు పోరాడిన క్రైస్తవుడైనటువంటి బహు వ్రద్ధుడు మధుసూదన్ దాస్, ఒడిషా యొక్క మొదటి పట్టభద్రుడు మరియు న్యాయవాది. అతను ఒడిషలోని కటక్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో గల సత్యభమపూర్ గ్రామంలో 1848 ఏప్రిల్ 28 న జన్మించాడు. అతన్ని కులబ్రూధ్ అని పిలుస్తారు, అంటే కురు వృద్ధ మనిషి అని అర్ధం. దాస్ కవి మరియు స్వతంత్ర పోరాట యోధుడు. దాస్ కవిత్వాల్లో పద పదాన జాతియత్వం వెల్లువిరిచేది. అతని పద్యాలూ చదివిన ప్రతి ఒక్కరు జతీయత్వంతో పొంగిపోయేవారు కొన్ని ప్రముఖ పద్యాలు ఉత్కల్ సంతాన్, జాతి ఇతిహాస్ , జననిర ఉక్తి. తన చివరి శ్వాస వరకు స్వతంత్ర భారతావనికై పాటు పడిన దాస్ 1934 లో మరణించాడు.

utkal-gourab-madhusudan-das-
utkal-gourab-madhusudandas-

5)రాజకుమారి అమృత్ కౌర్ (2 ఫిబ్రవరి 1889 – 6 ఫిబ్రవరి 1964)

   భారతదేశంలో మొట్టమొదటి ఆరోగ్య మంత్రిగా జవహర్ లాల్ నెహ్రు కేబినేట్ లో 10 సం.లు ఉన్న కౌర్ ఒక విద్యావేత్త , సామాజిక సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు . కౌర్ భారతదేశ రాజ్యంగ రూపకర్తలలో ఒకరిగా ఉన్నారు. కౌర్ బహుముఖ ప్రజ్ఞాశాలి, వివిధ దేశాల్లో పలు కీలక వృత్తులు చేపట్టిన ఆమె రెడ్ క్రాస్ సొసైటి చైర్ పర్సన్ గా 14 సం.లు ఉన్నారు. నెహ్రు, గాంధి వంటి వారితో ముందుండి స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. దండి ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న కౌర్ గాంధీజీ యొక్క సెక్రెటరిగా 16 ఏళ్ళు పనిచేసారు.చాలా చిత్రాల్లో గాంధీజీ పక్కన ఈమెని చూడొచ్చు, “ఆల్ ఇండియన్ వుమెన్ కాన్ఫరెన్స్” సహా స్థాపకురాలుగా ఉన్న కౌర్ స్వతంత్ర సంగ్రామంలో ప్రత్యక్షంగా పాల్గొన్న క్రైస్తవులలో అతి ముఖ్య వ్యక్తీ అని  చెప్పవచ్చు.

rajkumari amrit kaur
rajkumari amrit kaur

6) హరేంద్ర కూమర్ ముకేర్జీ (1887-1956)

H.C. ముకేర్జీ బెంగాల్ క్రైస్తవ నాయకుడు, విద్యావేత్త, రాజకీయ నాయకుడు. భారతదేశం యొక్క విభజనకు ముందు భారతీయ రాజ్యాంగం యొక్క ముసాయిదా కమిటి ఉప-అధ్యక్షుడుగా ఉన్నాడు. అలాగే పశ్చిమబెంగాల్ యొక్క మొదటి గవర్నర్ గా పనిచేశారు. బెంగాల్ లో “ఆల్ ఇండియాన్ కౌన్సిల్ ఫర్ ఇండియాన్ క్రిస్టియన్స్” అనే సంస్థను ఏర్పరచి క్రైస్తవులు ఐక్యంగా స్వతంత్రోద్యమ్యంలో పాల్గొనుటకు కృషిచేసాడు.

   “మేము విశ్వాసాల వారిగా వేరైనప్పటికీజాతీయత పరంగా ఒకే దేశ పౌరులం ఒకే ఉద్దేశ్యంతో మందుకు సాగుతున్నాం, అదే మా దేశాన్ని ఆక్రమించి పాలిస్తున్న విదేశియుల్ని పారద్రోలడం” అని దాటిగా ప్రసంగించేవారు. బెంగాల్ గవర్నర్ గా పదవిలో ఉన్నప్పుడే అనారోగ్య కారణాల తుది శ్వాస విడిచారు.

harendra kumar mukarji
harendra kumar mukarji

7)పండిత రామబాయి సరస్వతి

   (23 ఏప్రిల్ 1858 – ఏప్రిల్ 5, 1922 ఈ పేరు మనలో చాలా మందికి సుపరిచితమేరామాబాయి ఒక భారతీయ సాంఘిక సంస్కర్త, మహిళల సాధికారత కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి , మరియు ఉత్తమ విద్యావంతురాలు. కలకత్తా విశ్వవిద్యాలయంలో సంస్కృత విద్యలో పట్టా పొందిన రామాబాయి “పండిట్ అని బిరుదు పొందిన భారతీయ తొలి మహిళ”.ఈమె బ్రాహ్మణ కుటుంబం లో జన్మించినప్పటికీ తాను వివిధ మతగ్రంధాలను పరిశోధించి సత్యాన్ని తెలుసుకొని క్రీస్తు మార్గంలో నడిచి క్రైస్తవురాలిగా గుర్తింపుపొందింది, రమాబాయి ముక్త్ మిషన్ ద్వారా ఎన్నో  సంస్కరణలకు తెరతీసింది, పేదరిక నిర్మూలన కోసం ఎంతో పాటు పడింది. సనాతన హైందవ సమాజంలో ఉన్న సాంఘీక దురాచారాలను రూపుమాపడానికి నిత్యం కృషి చేసింది. క్రైస్తవ సమాజంలో మహిళా సమనత్వం గురించి మహిళలకు ఉపదేశాలిస్తూ మహిళా సాధికారత కోసం మరియు సువార్త వ్యాప్తికై పాటుపడింది,   స్వాతంత్రోద్యమం లో పాల్గొనుటకు బహు ప్రయాసతో తోడ్పడింది. “స్వామీ వివేకానందుల వారు రమాబాయి గురించి గొప్ప క్రైస్తవ మహిళా అని ఉద్గాటించారు”

pandita ramabhai
pandita ramabhai

8) సుశీల్ కుమార్ రుద్ర (7 జనవరి 1861 – 29 జూన్ 1925)

భారతీయ విద్యావేత్త మరియు మహాత్మా గాంధీ మరియు సి.ఎఫ్ ఆండ్రూస్ యొక్క సహచరుడు, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో మొదటి భారతీయ ప్రిన్సిపాల్ గా పనిచేశారు. స్వాతంత్రోద్యమంలో మొదటితరం వారితోను రెండవతరం వారితోను ఉద్యమాల్లో పాల్గొన్న సుషీల్ కుమార్ రుద్రా ఉద్యమ పోరాట స్పూర్తిని చూసిన సౌతాఫ్రిక పౌరులైన ఆండ్రూ మరియు విలియం పియర్సన్ గాంధీతో పాటు ఇండియా వచ్చి స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు. బెంగాలి క్రైస్తవుడైన సుషీల్ కుమార్ వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహంతో మిషనరీగా సేవలు కూడా అందించాడు.

sushilkumar rudra
sushilkumar rudra

9) పాల్ రామస్వామి

ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్న వ్యక్తీ… స్వతంత్ర పోరాటం లో ఎన్నో ఏళ్ళు జైలు జీవితం గడిపాడు.

10)బ్రహ్మ బాంధవ్ ఉపాధ్యాయ్

ఉపాధ్యాయ్ ఒక విలేఖరి, హిందుత్వం నుండి క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. సంధ్య అనే పత్రిక ద్వారా స్వతంత్రోద్యమంలో మీడియా(పత్రికా మాధ్యమం ) కీలక పాత్ర పోషించేలా కృషిచేసాడు.

11)అక్కమ్మ చెరియన్

బ్రిటీష్ వారి అసాంఘిక పాలనకు వారి కట్టడాలకు ఎదురు నిలిచిన వీర వనిత, స్వతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నా ఈమె ధైర్య సాహసాలకు ముగ్ధుడైన మహాత్మా గాంధి చెరియన్ ను “ట్రావెన్ కోర్ యొక్క ఝాన్సి రాణి” అని బిరుదునిచ్చి సత్కరించాడు.

12)కుమారప్ప.

సత్యాగ్రహం, దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాంధితో కలిసి పోరాడారు. యంగ్ ఇండియా అనే గాంధి యొక్క పత్రికకి ప్రధాన సంపాదకుడుగా వ్యవహరించే సమయంలో అతని రచనలకు గాను బ్రిటీష్ ప్రభుత్వం ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. గాంధి చొరవతో విడుదలైన కుమారప్ప ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి క్రైస్తవులంత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా నాయకుడిగా ముందుండి నడిపించాడు. చాల సార్లు జైలు జీవితం గడిపిన కుమారప్ప, జయప్రకాశ్ నారాయణ్ కాంగ్రెస్ కేబినేట్ లో ప్రముఖ నాయకుడిగా సేవలందించారు.

13)జో అకిం ఆల్వా

గాంధి భావనలకు ప్రేరేపితుడైన అకిం, తన యవ్వనాన్ని పూర్తిగా స్వతంత్రోద్యమానికి అంకితం చేసి ఉద్యమంలో యూత్ మూమెంట్ నాయకుడిగా కీలక భూమిక పోషించాడు. తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి పూర్తి జీవితం స్వతంత్ర భారతావనికై అంకితం చేసాడు.

14)చార్లెస్ ఫ్రియర్ ఆండ్రూస్

ఇంగ్లాండ్ విద్యావేత్త, క్రైస్తవ మిషనరీ,  ఐనటువంటి  చార్లెస్, గాంధితో స్నేహం కారణంగా భారత స్వతంత్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని, భారత స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో  కీలక సభ్యుడిగా కూడా సేవలందించారు.

15)జార్జ్ జోసెఫ్

ఇండియా యొక్క బారిస్టర్ మొదటి బ్యాచ్ విద్యావంతుడు జార్జ్. హోం రూల్ ఉద్యమంలో బ్రిటిష్ వారికి డిప్యుటేషన్ పంపిన వ్యక్తుల్లో ఇతను ఒకరూ.   భారత క్రైస్తవ ప్రజలంతా స్వాతంత్రోద్యమంలో ముందుకు సాగడానికి సుముఖంగా ఉన్నారు ఎందుకంటే వారు ఈ దేశ పౌరులే గనుక అంటూ నాయకుడై ముందుండి నడిపించాడు.

ఇంకా మరికొందరు :

అర్ధర్ జయకుమార్ – సహాయ నిరాకరనోద్యమం

N.H తుబ్బుస్ – సహాయ నిరాకరనోద్యమం

నిరాద్ బిశ్వాస్ – ఉప్పు సత్యాగ్రహం

శ్రీమతి వయొలెట్ ఆల్వా – గాంధి గారితో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు

జెరోం సల్దానా, మ్యురీస్ శ్రేష్ఠ –కాంగ్రెస్ కమిటి ద్వారా స్వాతంత్రోద్యమంలో   పాల్గొన్నారు

సిప్రిన్ మరియు అల్వాస్ – క్విట్ ఇండియా ఉద్యమం

జాన్ ఫ్రాన్సిస్ పింటో – గాంధి అనుచరుడు , గాంధి పింటో అని బిరుదు పొందాడు.వీరే కాకుండా 1887 లో మద్రాస్ లో జరిగిన  ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో హాజరైన 607 ప్రతినిధులలో 35 మంది క్రైస్తవ ప్రతినిధులు ఉన్నారు.

1944 లో సమావేశమైన “భారతీయ క్రైస్తవ సంఘాల సమాఖ్య”, భారత స్వతంత్రోద్యమానికి కలిసి కట్టుగా పనిచేయాలని ఉద్యమాన్ని తీవ్రతరంగా ముందుకు తీసుకెళ్లాలని  తీర్మానించాయి.కేరళ మరియు కర్నాటక నుండి మొదలైన క్యాథలిక్ క్రైస్తవుల “భారత స్వాతంత్రోద్యమ సాధన” జోకిం ఆల్వా నేతృత్వంలో దేశ క్యాథలిక్ క్రైస్తవులంత పాల్గొన్నారు.

ఇవన్ని కేవలం అధికారికంగా లభించిన ఆధారాలు మాత్రమె … ఇక తెరవెనుక క్రైస్తవుల పాత్ర వర్ణించలేనిది…

1951 స్వాతంత్య్ర భారత ప్రభుత్వ  జనాభా గణాంకాల ప్రకారం                         (8.3 మిలియన్) 80లక్షలకు పైగా క్రైస్తవులు ఉన్నారు. ఇదేదో క్రైస్తవ్యం గొప్పదనం చెప్పే ప్రయత్నం కాదుగాని కేవలం క్రైస్తవులపై ద్వేషంతో క్రైస్తవులు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు అని క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళ తొత్తులు అని అసత్యాలు చెప్పే వారికి చెంపపెట్టులా ఉంటూ నిజాన్ని తెలియజేసే ప్రయత్నం. మరియు క్రైస్తవులకి అవగాహన కల్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం…


ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

click here

Leave a comment