మెలకువలో ఉన్న ఉపయోగం.
Christian Books Telugu Pdf
మూలవాక్యము : ఆ దినమైనను గడియమైనను మీకు తెలియదు గనుక “మెలకువగా ఉండుడి”
(మత్తయి సువార్త) 25:13
13.ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
25:13 24:42, 44. ఈ ఉదాహరణనుంచి క్రీస్తు చూపుతున్న ఒకే ఒక గొప్ప పాఠం ఇదే – ఇందులో నేర్చుకోవలసిన ఇతర పాఠాలు మరింకేవీ లేవని కాదు. “మెళుకువగా ఉండండి” అంటే ఆధ్యాత్మికంగా సిద్ధమై ఉండండి అని అర్థం. ఈ ఉదాహరణలో పదిమంది కన్యలూ నిద్రపోయారు. కొంత సేపు ఒళ్ళు తెలియకుండా ఉన్నారు. అయినా వీరిలో ఐదుగురు వరుని రాక ప్రకటన కోసం సిద్ధంగానే ఉన్నారు. క్రైస్తవులను సిద్ధంగా ఉంచేది హృదయంలోని దేవుని ఆత్మ. ఆయన లేకుండా మత సారాంశమంతా అయినా, మంచిగా ఉందామన్న ఎన్ని ప్రయత్నాలైనా, వరుడైన క్రీస్తును కలుసుకోవాలన్న ఎంత ప్రయత్నమైనా వ్యర్ధమే. నిజమైన క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసినది లేకుండా, అంటే క్రీస్తు ఆత్మ లేకుండా, క్రైస్తవ జీవితం గడపాలని ప్రయత్నించడం ఎంత బుద్ధి తక్కువ పనో! పవిత్రాత్మ గురించి నోట్స్ 3:11, 16; యోహాను 14:16-17; మొ।।.
25:13 A మత్తయి 24:42-44; మార్కు 13:33-37; లూకా 21:36; 1 కొరింతు 16:13; 1 తెస్స 5:6; 1 పేతురు 5:8; ప్రకటన 16:15; B మత్తయి 24:50; అపొ కా 20:31; 1 పేతురు 4:7; C 2 తిమోతి 4:5
1.) శోధనలో ప్రవేశించకుండునట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయుడి
(మత్తయి సువార్త) 26:41
41.మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి
26:41 శిష్యులు గొప్ప పరీక్ష సమయాన్ని ఎదుర్కో బోతున్నారు. దానికి సిద్ధపడేందుకు సరైన పద్ధతి నిద్రపోవడం కాదు. విషమ పరీక్ష, దుష్‌ప్రేరేపణ సమయంలో శరీరస్వభావం ఎప్పుడూ మనకు అండగా నిలవదు. మన కౌగిట్లోనే ఉన్న ద్రోహి వంటిది శరీర స్వభావం. విషమ పరీక్ష, దుష్‌ప్రేరేపణలపై మన ఆత్మలు విజయం సాధించాలంటే మనకు రెండు విషయాలు ఎంతగానో అవసరం. అవి మెళుకువగా కనిపెట్టడం, ప్రార్థన (ఎఫెసు 6:10-11, 18).
26:41 A కీర్తన 119:35-37; యెషయా 26:8-9; మత్తయి 6:13; 24:42; 25:13; మార్కు 13:33-37; 14:38; లూకా 21:36; 22:40, 46; రోమ్ 7:18-25; 1 కొరింతు 10:13; 16:13; గలతీ 5:16-17; ఎఫెసు 6:18; 1 పేతురు 4:7; 5:8; 2 పేతురు 2:9; ప్రకటన 3:10; 16:15; B కీర్తన 119:1, 4-5, 24-25, 32, 117; సామెత 4:14-15; మత్తయి 26:38; లూకా 8:13; 11:4; రోమ్ 8:3; 1 కొరింతు 9:27; గలతీ 5:24; ఫిలిప్పీ 3:12-14; C కీర్తన 119:115
2.) ఆయనతో మెలకువగా ఉండుట.
(మత్తయి సువార్త) 26:38
38.అప్పుడు యేసుమరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతో కూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి
26:38 ఆ భారం, ఆ శోకం ఎంత దుర్భరమయ్యాయంటే అవి ఆయన ప్రాణాన్ని పిండివేస్తున్నాయి. ఇంత దుఃఖానికి కారణం ఏమిటి? ఆ పరిపూర్ణ పవిత్రుడు సిలువపై లోక పాపాలన్నీ భరించబోతున్నాడు. ఆ పాపానికి శిక్షను అనుభవించి, తండ్రియైన దేవునికి దూరం కాబోతున్నాడు (27:46; యోహాను 1:29; 2 కొరింతు 5:21). తన శిష్యులు కూడా తనతోబాటు మేల్కొని ఉండాలని కోరాడు. ఈ బాధ ఘడియలో ఆయన మానవ స్వభావం తోడు కోరిందా? కావచ్చు. నిస్సందేహంగా ఈ సంఘటనకు సాక్షులు ఉండాలని ఆయన కోరాడు.
3.) ప్రభువు వచ్చుట తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
(మత్తయి సువార్త) 24:42
42.కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.
24:42 వ 36; 25:13; మార్కు 13:37; ఫిలిప్పీ 3:20; 1 తెస్స 5:1-6; తీతు 2:13; హీబ్రూ 9:28; 2 పేతురు 3:12-13; ప్రకటన 3:3.
4.) విజ్ఞాపన చేయును మెలకువగా ఉండుడి.
(ఎఫెసీయులకు) 6:18
18.ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
6:18 పౌలు ఇంకా దేవుని సైనికుల గురించే రాస్తున్నాడు. ఆధ్యాత్మిక శత్రువులపై విజయ విధానాన్నే ఇంకా చూపిస్తున్నాడు. ప్రార్థన లేని స్థితి ఉండడమంటే ముందుగానే ఓడిపోవడంతో సమానమని అతనికి తెలుసు. కానీ విశ్వాసులు ప్రార్థన చేస్తుండడం చూస్తే సైతాను గజగజ వణకుతాడని కూడా అతనికి తెలుసు. ప్రార్థన లేకపోతే పైన చెప్పిన కవచమంతా మనల్ని సంరక్షించలేదంటున్నాడు. ప్రార్థనతో దాన్ని ధరించాలి, ప్రార్థనతో దానితో నిలబడాలి. ప్రార్థన గురించి కీర్తన 66:18; యిర్మీయా 33:3; మత్తయి 6:5-13; 7:7-11; 26:41; మార్కు 11:24-25; లూకా 11:5-13; హీబ్రూ 4:16; 10:19-22; యాకోబు 5:13, 16; 1 పేతురు 4:7.
శుభవార్త గురించి, క్రైస్తవ సిద్ధాంతాల గురించి సరైన అభిప్రాయాలు కలిగివున్నంత మాత్రాన సైతానుపై విజయం కలగదు. ప్రార్థన లేకుంటే సైతానుతో యుద్ధం చెయ్యడానికి మనలో ఆధ్యాత్మిక బలం ఉండదు. మనం ప్రార్థన చేయడం అనేది దేవుని ఆత్మలో జరగాలి – 2:18; రోమ్ 8:26; యూదా 20. ఆయనకు లోబడి ఆయన చూపించిన రీతిలో ప్రార్థించాలి. “అన్ని” సమయాల్లోనూ “అన్ని” విధాలుగా ప్రార్థించాలి. అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల విన్నపాలూ ఇతరుల కోసం విజ్ఞాపనలూ చేయాలి, కృతజ్ఞతలూ స్తుతులూ సమర్పించాలి (1 తిమోతి 2:1).
ఏకాంతంగా లేక బహిరంగంగా, మాటలతో లేక మాటలు లేకుండా లోలోపల ప్రార్థించవచ్చు. అన్ని రకాలుగా ప్రార్థనలు చెయ్యడం మంచిది. అన్నిటికీ దేని ప్రయోజనం దానికి ఉంది.
6:18 A 1 రాజులు 8:52, 54; కీర్తన 4:1; 6:9; యెషయా 26:16; దాని 6:10; 9:20; హోషేయ 12:4; మత్తయి 15:25-28; 26:41; మార్కు 13:33; 14:38; లూకా 11:5-8; 18:1-8; 21:36; 22:46; అపొ కా 1:14; 10:2; 12:5; రోమ్ 8:26-27; 12:12; ఎఫెసు 1:16; 6:19; ఫిలిప్పీ 1:4; 4:6; కొలస్సయి 4:2; 1 తెస్స 5:17; 1 తిమోతి 2:1; 2 తిమోతి 1:3; హీబ్రూ 5:7; 1 పేతురు 4:7; యూదా 20; B ఆది 32:24-28; 1 రాజులు 8:59; 9:3; ఎస్తేరు 4:8; యోబు 27:10; జెకర్యా 12:10; అపొ కా 6:4; ఫిలేమోను 5; C లూకా 3:37; రోమ్ 8:15; ఎఫెసు 2:22; 3:8, 18; D గలతీ 4:6; కొలస్సయి 1:4
5.) జాగ్రత్తపడుడి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి.
(మార్కు సువార్త) 13:33
33.జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.
13:33 A మార్కు 13:35-37; లూకా 12:40; రోమ్ 13:11-12; ఎఫెసు 6:18; B మత్తయి 24:42-44; 25:13; 26:40-41; మార్కు 13:23; 14:37-38; లూకా 21:34-36; 1 కొరింతు 16:13; 1 తెస్స 5:5-8; 1 పేతురు 4:7; ప్రకటన 16:15; C రోమ్ 13:14; హీబ్రూ 12:15; 1 పేతురు 5:8; ప్రకటన 3:2
6.) మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి.
(అపొస్తలుల కార్యములు) 20:31
31.కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగాఉండుడి.
20:31 వ 19. క్రీస్తు నమ్మకమైన సేవకులకు సత్యమంటే ఎంతో ప్రీతి గనుక వారు దాన్ని వక్రం చేసే బోధకుల గురించి దేవుని ప్రజలను హెచ్చరిస్తారు. యేసు, ఆయన రాయబారులు పదేపదే ఇలా చేశారు – మత్తయి 7:15; 24:4-5; 2 కొరింతు 11:13-15; 1 యోహాను 2:18-19; యూదా 3,4 వచనాలు.
7.) నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి.
(మొదటి పేతురు) 5:8
8.నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది(సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
“మెళకువ”– ఎఫెసు 6:18; 1 తెస్స 5:6. ఆధ్యాత్మికంగా నిద్రపోయేవారినీ ఏమరుపాటుగా ఉండేవారినీ సైతాను వలలో చిక్కించుకోగలడు.
8.) ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
(మొదటి పేతురు) 4:7
7.అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
4:7 “దగ్గరలో”– రోమ్ 13:12; 5:9; ప్రకటన 1:3; 2 పేతురు 3:8-9; మత్తయి 24:36, 42. ఈ యుగాంతంలో గొప్ప బాధలు, విషమ పరీక్షలు వస్తాయి. గొప్ప మోసకరమైన పరిస్థితులు ఉంటాయి (మత్తయి 24:4-14, 21-25). క్రీస్తుకు విశ్వాస పాత్రంగా, స్థిరంగా నిలవాలంటే ప్రార్థన చాలా అవసరంగా ఉంటుంది. నిజమైన ప్రార్థనకు అవసరమైన రెండు లక్షణాలు ఇక్కడ చూడండి. లూకా 21:36; 22:40, 46 పోల్చి చూడండి.
Christian Books Telugu Pdf Christian Books Telugu Pdf Christian Books Telugu Pdf Christian Books Telugu Pdf Christian Books Telugu Pdf Christian Books Telugu Pdf Christian Books Telugu Pdf Christian Books Telugu Pdf Christian Books Telugu Pdf
ప్రత్యక్ష గుడారం మెటీరియల్ కొరకు.. click here