భూమి గోళాకారంగా ఉంది – Bible Since Telugu

Written by biblesamacharam.com

Published on:

బైబిల్ చెప్పిన సైన్స్ – భూమి గోళాకారంగా ఉంది!! 

Bible Since Telugu

చాలా చాలా కాలం క్రితం భూమి చదునుగా, బల్లపరుపుగా ఉందని అనుకునేవారు. చూడడానికి మరి భూమి నిజంగానే బల్లపరుపుగా వుంటుందిగా! 

సముద్రం మధ్యలో మీరు ఓ పడవలో ప్రయాణిస్తున్నారని అనుకోండి. నీరు నలుదిక్కులా చదునుగా వ్యాపించి ఉంటుంది. నీలాకాశం బోర్లించిన గిన్నెలా దాని మీద చక్కగా అమరిపోయినట్టు ఉంటుంది. 

నింగీ, నీరూ కలిసే రేఖనే – “దిక్చక్రం” అని అంటారు. ఆ దిక్చక్రం నిజంగానే ఓ చక్రంగా వుంటుంది. ఆ చక్రానికి నీరే కేంద్రం. 

నేలమీద ఉన్నాకూడా దిక్చక్రం విస్తరించి ఉండటం కనిపిస్తోంది. అయితే భూమి మీద దిక్చక్రం సమంగా ఉండదు. చెట్లు, పుట్టలు, ఇల్లు, బళ్లు ఇవన్నీ ఉండటంతో ఎగుడు దిగుడుగా ఉంటుంది. 

భూమి అనంతంగా విస్తరించి ఉంటుందని పురాతన కాలంలోని మనుషులు నమ్మేవారు. భూమి, సముద్రం కలిసి ఇలా వెడల్పుగా అంచుల్లేని పళ్లెంలా విస్తరించి ఉందని అనుకునేవారు. 

మరి, అదే నిజమైతే సూర్యుడి సంగతేంటి? సూర్యుడు ఉదయాన్నే తూర్పున ఉదయిస్తాడు. విశాల ఆకాశమంతా దాటి సాయంకాలం పడమరన అస్తమిస్తాడు. మర్నాడు ఉదయం మళ్ళీ తూర్పున పైకి తేలుతాడు. దీన్ని వివరించడానికి రోజూ ఉదయం ఓ సూర్యుడు క్రొత్తగా తయారై పైకి వస్తాడని ప్రాచీనులు అనుకొనేవారు. 

యిలా, ఎవరి మనస్సుకి వచ్చిన ప్రకారముగా వారు తలంచుకొని సమర్థించుకొనేవారు. మరి దాని లోతు ఎంత? ఓ గొయ్యి తవ్వితే, అలా తవ్వుతూ పోతామా? ఆ తవ్వకానికి అంతు ఉండదా? భూమి ఓ మైలో, పోనీ పదిమైళ్లో, ఇంకా పోనీ యాభై మైళ్లో మందం ఉన్న దిమ్మలాంటిది అనుకుంటే? మరి అది కేవలం దిమ్మలాంటిదైతే ఎందుకు కిందపడదు? 

పెద్ద పెద్ద ఏనుగులు మోస్తున్నాయి గనుక భూమి కిందపడదు అనుకొనేవారు ప్రాచీన భారతీయులు. మరి ఏనుగులు దేనిమీద నించున్నాయి? పెద్ద తాబేలు మీద నించున్నాయి. మరి ఆ తాబేలు ఎక్కడ నించుంది? అది ఓ సువిశాల సముద్రంలో ఈదులాడుతూ ఉందట. అయితే ఆ సముద్రం అడుగున ఏముంది? ఆ సముద్రం దేనిపై నించుంది? 

దానికింక సమాధానం లేదు. కనుక భూమి బల్లపరుపుగా కనిపించినంత మాత్రాన అది బల్లపరుపుగా ఉందనుకోవడం అంత శ్రేయస్కరం కాదు అనిపించింది మేధావులకు! బల్లపరుపుగా ఉందను కోవడంలో వల్లమాలిన సమస్యలు అనికూడ వారు అనుకున్నారు. 

ప్రాచీనులలో తెలివైనవారు – భూమి మీద వివిధ ప్రాంతాలలో తారలను గమనించి అవి ఆయా ప్రాంతాలలో విభిన్నరీతులుగా ఉండడం గమనించారు. 

భూమి చదునుగా ఉంటే అలా జరుగదు. చదునైన భూమి మీద ఎక్కడున్నా అవే కనిపించాలి. కాని నిజానికి అలా లేవే! 

ప్రాచీన కాలంలో – ఎంతోమంది సుదీర్ఘ యాత్రలు చేసినవాళ్ళు ఉన్నారు. ఉత్తరానికి ప్రయాణం చేసినవారు అక్కడ ఆకాశంలో తారలు కాస్త వేరుగా ఉండడం గమనించారు. వాళ్ల సొంత ఊళ్ళో దక్షిణ దిక్చక్రంలో కనిపించే తారలు ఈ ఉత్తర ప్రాంతంలో అసలు కనిపించేవి కావు, కాని మళ్ళీ తమ సొంత గ్రామానికి తిరిగి వచ్చి చూస్తే ఉత్తరములో కనిపించని తారలు మళ్ళీ కనబడేవి. 

దక్షిణంగా ప్రయాణించిన వారి అనుభవం కూడా అలాగే వుంది. సొంత ఊరిలో దక్షిణ దిక్చక్రానికి ఆవల కనిపించని తారలు ఇప్పుడు చక్కగా కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వచ్చాక అవన్నీ మళ్ళీ మాయం అయ్యేవి. 

ఉత్తర దిక్చక్రం విషయంలో కూడా ఈ విషయం నిజమయ్యింది. స్వగ్రామంలో కొన్ని తారలు ఉత్తర దిక్చక్రానికి కొద్దిగా కిందికి దిగడం కనిపిస్తుంది. కొంచెం ఉత్తరాదిగా ప్రయాణించి చూస్తే ఆ తారలు దిక్చక్రం కిందికి దిగకుండా కాస్తంతా పైనే ఉండడం కనిపిస్తుంది. అదే విధంగా స్వగ్రామంలో ఉత్తర దిక్చక్రానికి కొద్దిగా పైని కనిపించిన తారలు దక్షిణంగా ప్రయాణిస్తే దిక్చక్రం కిందికి దిగడం కనిపిస్తుంది. 

ఇంతకీ ఆ మేధావులకు అర్థమైందేమిటంటే – భూమి మీద అన్ని చోట్ల నుంచి అన్ని తారలు కనిపించవు. కాబట్టి భూమి బల్లపరుపుగా లేదు అని అర్థమైంది. 

భూమి ఆకృతిని తెలుసుకోవడానికి మన పూర్వీకులు మరో పద్ధతి ఉపయోగించారు. ఆ పద్ధతి సముద్రం ఆధారంగా కొనసాగింది. భూమి బల్లపరుపుగా ఉంటే తీరం నుండి క్రమంగా దూరం అవుతున్న ఓడ ఇంకా ఇంకా చిన్నగా కావడం కనిపించాలి. అలా చిన్నగా అవుతూ, చివరికి చిన్న బిందువై మాయమవ్వాలి. 

కాని వాస్తవంగా అలా జరుగదు. దూరం అవుతున్న ఓడని చూస్తే ఓడ మొత్తం కనిపిస్తుంది. కింద చెక్కతో చెయ్యబడిన అడుగుభాగం, పైన తెరచాపలు రెండూ కంపిస్తాయి. కాని కాసేపు అయ్యాక అడుగు భాగం మాయమవుతుంది. నీటి మట్టం దానిపైకి వచ్చినట్టు కనిపిస్తుంది. తెరచాపలు మాత్రం కనిపిస్తాయి. 

ఆ తర్వాత తెర చాపల పై కొసలు మాత్రమే కనిపిస్తాయి. తరువాత ఓడ మొత్తం మాయమవుతుంది. 

అంటే ఓడ మునిగిపోతుందనా? నీరు పైపైకి వచ్చి ముందు అడుగు భాగాన్ని, తరువాత తెరచాపలని ముంచేస్తోందని అర్థమా? కాదు! ఎందుకంటే రోజూ ఓడ సముద్రయానానికి వెళ్ళి సురక్షితంగా తిరిగి రావడం చూస్తూనే ఉన్నాం. తిరిగి వచ్చిన ఓడలలోని నావికులు సముద్ర నీటి మట్టం ఓడ అడుగుభాగాన్ని మించి పైకి రాలేదు అనే నమ్మకంగా చెప్పేవారు. 

మరి దీనిని వివరించేదెలా? 

బహుశ, భూమి ఉపరితలం వంపుగా ఉందేమో. ఓడ ఆ వంపు వెంట పయనిస్తూ వంపుకి అవతల మాయమవుతుంది. అడుగు భాగం ముందు మాయం కావటం సహజమే కదా? 

ఓడలు ఏ దిశలో ప్రయాణించినా అడుగుభాగం ముందు కనుమరుగు అవుతుంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వెళ్లినా ముందు అడుగు భాగమే కనుమరుగు అవుతూ వస్తోంది. 

అంతేకాక అవి ఎప్పుడు ఒకే వేగంతో కనుమరుగు కావడం కనిపిస్తోంది. ఓడ ఏ దిశలో ప్రయాణించినా, రెండు మైళ్ల దూరంలో ఉన్నప్పుడు, అడుగు భాగంలో కొంత భాగం కంటికి కనబడకుండా పోతుంది. 

దీనిని బట్టి భూమి ప్రతీ దిశలోనూ ఒకే విధంగా వంపు తిరిగి వుంది అని అర్థమైంది. 

అన్ని దిశల్లోనూ ఒకే విధంగా వంపు తిరిగి ఉండే ఆకృతి ఏమిటి? ఆ ఆకృతి “గోళం” మాత్రమే కదా! 

ఒక పెద్ద బంతి మీద ఓ బిందువు తీసుకొని అక్కడ నుండి ఏ దిశలోనైనా ఓ గీత గీస్తే, ప్రతి దిశలోనూ ఆ గీతలు ఒకేవిధంగా వంగి ఉంటాయి కదా? ఓడల గమనాన్ని బట్టి చూస్తే భూమి ఒక గోళంలా ఉంది అని అర్థమైపోతుంది. అంటే ఆకాశం అనే మహాగోళంలో భూమి అనే పెద్ద గోళం ఉందన్నమాట. భూమి పెద్ద గోళమే! అయినప్పటికీ మనకు కనిపించే భూభాగం చాలా పెద్దది కనుక అది చదునుగా కనిపిస్తోంది. 

గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టడం వలన, మాజిలాన్ సముద్రయాత్ర వలన, కెప్టెన్ కుక్ వంటి సాహస యాత్రికులు క్రొత్త ఖండాలను కనిపెట్టడం వలన చివరికి అక్టోబరు 4, 1957నాడు భూగోళాన్ని చుట్టి వచ్చిన ఉపగ్రహం వలన శాస్త్ర ప్రపంచానికి తెలియవచ్చిందేమిటంటే, భూమి బంతివలే గుండ్రంగా, గోళాకారంలో ఉంది అని అర్థమైంది. 

ప్రియులారా! మన పూర్వీకులు ఇన్ని తిప్పలు పడితే గాని – ఇవన్నీ ప్రయోగాలు చేస్తే గాని భూమి గుండ్రంగా, గోళం వలె ఉందని అర్థం కాలేదు! 

ఏ టెలిస్కోపు లేనప్పుటడు, ఏ ఉపగ్రహాలు లేనప్పుడు, వేలాది సంవత్సరముల క్రితమే బైబిలు – భూమి గుండ్రముగా, గోళాకారంలో ఉంది అని చెప్పింది. 

యోబు చరిత్ర మనం పరిశీలిస్తే క్రీ.పూ.18 వందల సంవత్సరముల క్రితం నాటివాడు యోబు అని తెలుస్తుంది. అప్పుడు ఆ హయాంలో పలుకబడిన మాట యోబు గ్రంథంలో రాయబడి ఉంది – “ఆయనవలన నడిపించబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద…” అంటూ రాయబడి వుంది (యోబు 37:12) 

నేటికి – భూమి గోళాకారంలో వుందని కనుగొనబడి, నిర్ధారించ బడింది కేవలం 490 సంవత్సరములు మాత్రమే. కాని బైబిల్లో చెప్పబడిన విషయాన్ని బట్టి చూస్తే 3,322 సంవత్సరముల క్రితమే భూమి గోళాకారములో ఉంది అని రాయబడింది. బైబిలు వెలుగులో భూమి ఎలా ఉంది? అనే విషయం పరిశోధన లేకుండానే తెలిసింది. బైబిలు దేవుని వాక్కు! అది సత్యవేదం! శాస్త్రము లేనప్పుడు, దాని మూలాలను తెలియజేసింది ఈ బైబిలు గ్రంథం! 

ఎవరో నన్ను అన్నారు – “నీకు బైబిలు బువ్వ పెడుతుందా?” అని! 

“అవ్వ చేయని పనిని, బువ్వ చేయని పనిని బైబిలు చేసిపెడుతుంది” అన్నాను. 

బైబిలే శాస్త్ర గని – నమ్మితే పొందవు ఏ హాని! 

దేవుడే ఇస్తాడు హామి – పరమందు నీకుండదు లేమి!! 

Bible Since Telugu Bible Since Telugu Bible Since Telugu Bible Since Telugu Bible Since Telugu Bible Since Telugu Bible Since Telugu Bible Since Telugu Bible Since Telugu


మిషనరీ జీవిత చరిత్రలు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted