ఆదివారము ఆరాధన దినము అనడానికి ముఖ్య కారణాలు | Bible Question And Answers In Telugu

ఆదివారము ఆరాధన దినము అనడానికి ముఖ్య కారణాలు?

Bible Question And Answers In Telugu

“ప్రభువు దినము” ఈ మాటలను గురించి వేద పండితుల మధ్య అభిప్రాయ వ్యత్యాసములు కలవు. 

  1. ప్రభువు దినము అనగా యెహోవా దినమను భావమని వారి అభిప్రాయమైయున్నది.న్యాయతీర్పు దినముగాను, ప్రతి దండన దినముగాను దీనిని వివరించి యున్నాడు.అయితే వారముల యొక్క మొదటి దినము పరిశుద్దులు దేవుని ఆరాధించుటకు వచ్చిన ఆదివార దినమనియు చాలా మంది నమ్ముచున్నారు. (యోహాను 20:19; అపో.కా. 20:7; 1కొరింథీ 16:1) ప్రభువు దినమును గురించి 12 అపోస్తలుల బోధలు అని తెలియబడుచున్న Deadache అను గ్రంథములో ప్రభువు దినమందు మేము ఏకముగా కూడి రొట్టె విరుచుచుండెను అని వ్రాయబడెను. (Dedache 14:1) 
  2. అంతియొకయ లోని (Ignatius క్రైస్తవులను గురించి ఈలాగు వ్రాసిరి. క్రైస్తవులు ఎన్నడు సబ్బాతు కొరకు బ్రతుక లేదు. ప్రభువు దినము కోసం జీవించుచున్నారు. మరియు క్రైస్తవులైన ప్రతి వ్యక్తియు ప్రభువు దినము ఒక పండగ దినము గాను పునరుత్థాన దినముగాను ఆచరించుచున్నారు.
  3. సార్థీస్ ని మెలితో ప్రభువు దినమును గురించి ఈలాగు వ్రాసినాడు. 2వ శతాబ్ధం యొక్క ప్రారంభములో సబ్బాతును తిరస్కరించెను. ప్రభువు దినమును క్రైస్తవ దినముగా అంగీకరించు అనుదానికి ఇవి సాక్ష్యమైయున్నది. క్లెమంత్ AD 153-217 వరకు నూస్ట్రిక్ మతస్థులకు విరోధముగా ఇలాగు వ్రాస్తున్నారు. ప్రభువు దినము పునరుత్థాన దినముగా చూస్తున్నాము. సువార్తకు లోబడి ప్రభువు దినము ప్రభువు పునరుత్థాన దినముగా మేము స్తుతించుచు, ఆరాధించుచున్నాము. (II.P. 545) తర్ తల్యన్ (AD 145-220) ప్రభువు దినమును 8వ దినముగా యెరిగి యున్నాడు. (III. P. 70) పరిశుద్ధ అపొస్తలు వారి పరిపాలన అను గ్రంథములో AD 250-325 వరకు మా ప్రభువు పునరుత్థాన దినమందు మేము సంతోషముగా సమావేశమౌతున్నామని వ్రాయబడియున్నది.(VII P. 423).
  4. మన ప్రభువు మరణమును గెలిచి తిరిగి లేచిన దినము ఆదివారము.
  5. కనిపెట్టి ప్రార్ధన చేసిన శిష్యుల మీద పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన దినము ఆదివారము(అపో.కా. 2:1)
  6. ప్రభువు సంఘము భూలోకములో ప్రారంభించబడిన దినము ఆదివారము (అపో.కా. 2:1, 41, 22)
  7. శిష్యులు అనగా ప్రారంభ సంఘము ఆరాధించి రొట్టె విరిచిన దినము ఆదివారము (అపో.కా. 20:7; 1కొరింథీ 16:2) 
  8. ఆ రీతులలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఆదివారం దేవుని ఆరాధించుచున్నారు. గనుక ఆదివారము గురించి భయభక్తులు గలిగి ఉండుట మంచిది. Bible Question And Answers In Telugu

 అయితే ఆదివారము ప్రభువు దినమని రూఢి పరచుటకు తగిన ఆధారము లేమియు క్రొత్త నిబంధన యందు మనము చూడలేము. ప్రభువు కాని అపోస్తలులుగాని ఆదివారమును పరిశుద్ధ దినముగా ఆచరించవలెనని ఆజ్ఞాపూర్వకమైన హెచ్చరికలు ఇవ్వలేదు. ఆదివారం ఆరాధించుటకు వచ్చిరి అని వ్రాయబడి యున్నది గాని దానికి మించి ఋజువులు లేవు. 

 యోహాను వారములో మొదటి దినమని గాని ఆదివారమని చెప్పక ప్రభువు దినమని మాత్రము ప్రస్తావించెను. కనుక ఈ దినము ఆదివారమని చెప్పుట సులభము కాదు. వాక్యా ధారము లేకుండా ఒక తీర్మానము చేయుట సరియైన పద్ధతి కాదు. దేవుడు శుద్ధీకరించిన, అనుగ్రహించిన దినము ఒకటి కలదు. అదియే 7వ దినమైన శనివారమై యున్నది. (ఆది. 2:3). తన స్వజనులైన ఇశ్రాయేలీయులు ఆచరించుటకు నిత్య నిబంధనగా దీనిని దేవుడు అనుగ్రహించెను. “విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెనని జ్ఞాపకము ఉంచు కొనుము. 6 దినములు కష్టపడి నీ పనియంతా చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము… 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినము పరిశుద్ధపరచెను. (నిర్గమ. 20:8,11) అయితే క్రైస్తవులు ఆదివారం ఆరాధించుటకు గల ప్రాముఖ్యత ఏమనగా పైన మనము చూసిన విధముగా ప్రభువు పునరుత్థాన దినము ఆదివారం గనుకను అపొస్తలులు ఆ దినమున ఆరాధించిరి. గనుక క్రైస్తవులు ఆదివారమున ఆరాధించుచున్నారు. గనుక అది సబ్బాతు లేక విశ్రాంతి దినము కాదు. విశ్రాంతి దినము అనగా ప్రభువు నందు నమ్మిక యుంచువారు అనుభవించు చున్న రక్షణానందము లేక నెమ్మది, విశ్రాంతి దీనికి శనివారము ఛాయయైయున్నది. బలులు ప్రభువు మరణమునకు సూచన అనియు సున్నతి విశ్వాసులు మారుమనస్సుకు సూచనైయున్నది. విశ్రాంతి దినము మనము అనుభవించుచున్న ఆత్మీయ విశ్రాంతికి సూచనయని హెబ్రీ గ్రంథకర్త స్పష్టముగా బయలు పరచెను. “కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియై యున్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అని ప్రభువు చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. (హెబ్రీ 4:3,4) మరియు “ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను”. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.     (కీర్తన 118:22-24) Bible Question And Answers In Telugu

 ఇల్లు కట్టువారు అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. వారు నిషేధించిన రాయి ప్రభువైన యేసుక్రీస్తుయైయున్నాడు. “మనుష్యుని చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చినవారై, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.” (1 పేతురు 2:4,5). “క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులను ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.”              (ఎఫెస్సీ 2:20). “అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే.” (1కొరింథీ 10:4) మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని యెదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. (మత్తయి 16:18). ప్రస్తుత వాక్యమును బట్టే ఇల్లు కట్టువారనియు ఇశ్రాయేలీయులు నిషేధించిన రాయి యేసు క్రీస్తు యైయున్నాడు. అది యెహోవా వలన కలిగినది.  Bible Question And Answers In Telugu

 అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. యూదులు సిలువ వేసిన యేసును, దేవుడు సజీవుడుగా తిరిగి లేపిరి. “మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను” (అపో.కా. 2:24). ప్రభువు మరణించి సమాధి చేయబడిన 3వ దినము అనగా ఆదివారం తెల్లవారు జామున ఆయన తిరిగి లేచెను. (మత్తయి 28:1; మార్కు 16:1; లూకా 24:1; యోహాను 20:1). కనుక ఆదివారం యెహోవా ఏర్పాటు చేసిన దినము అందును బట్టి క్రైస్తవులు ఆదివారమున ఉత్సహించి సంతోషించుచూ దేవునిని ఆరాధించుచున్నారు. మరియు ప్రత్యేకమైన హెచ్చరిక ఏమనగా ‘అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చు నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవు నాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. (కొలొస్స 2:17,18).  Bible Question And Answers In Telugu


Pdf Files Download….Click Here

Leave a comment

error: dont try to copy others subjcet.