మరియమ్మను పూజించకూడదా?
Bible Question And Answers In Telugu
విమర్శ: యేసు తల్లియైన మరియను పూజింపవచ్చునా? కూడదా? మనకు అవసరమైన వాటిని మరియ ద్వారా ప్రభువు నుండి పొందలేమా? ఆమెను ఆరాధించ వచ్చునా?
జవాబు : క్రీ.పూ. 750 సం॥ల క్రితం కన్యక గర్భ వతియై కుమారుని (మెస్సియా ను) కనునని యెషయా ప్రవచించియుండుట చేత మెస్సీయా నా గర్భమునే పుట్టా లని అనేక మంది యువతులు పెండ్లిచేసికొనకయే కన్యకలుగా జీవిస్తూ మెస్సీయా కొరకు కనిపెట్టుచుండిరి; వారిలో మరియ అతి పరిశుద్దత కలిగి సద్భక్తి పరురాలైనందున దేవుని దయకు ప్రాప్తురాలైంది, ఆ సమయానికి మరియు లేకపోయుంటే ఏ ఎల్లమ్మ పుల్లమ్మ కడుపులోనైనా పుట్టక తప్పదు, ప్రవచనము నెరవేరక తప్పదు, అయినను నేటి క్రైస్తవులలో కొందరు ఊహిస్తున్నట్లు ఆనాడు కొందరు అమ్మగారి సిఫారసు కోరి మరియను తీసుకొని వెళ్ళి విందులో యేసుతో చెప్పారు. అచ్చట యేసు నా సమయము ఇంకను రాలేదని ఆమె గారి సిఫారసును నిరాకరించినట్లు యోహాను 2:4 లో చూడగలము. యేసు తన సమయము రాలేదని చెప్పాడు కదా? అప్పుడు ఈమె శక్తి ప్రభావాలు కలిగినదై నీళ్ళను ద్రాక్షారసముగా చేయవచ్చును కదా అట్లు చేయక, వేరే ప్రయత్నము చేయక పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. (యోహాను 2:5) ఆ పై అమ్మగారి సిఫారసు లేకయే పరిచారకులు ఆయన యొద్దనిలువగా అప్పుడాయన నీళ్ళను ద్రాక్షరసముగా మార్చినట్లుగా పరిశుద్ధగ్రంథములో చదువుచున్నాము. కావున ఇక ఆమె సిఫారసు ఎంత వరకు వర్తిస్తుందో మీరే ఆలోచించి ఆరాధించండి. కొందరైతే ఆమె జగద్రక్షకునికి తల్లిగా ఆమెను ప్రశసించుట (పూజించుట) ధన్యత అనుకుంటున్నారు. (లూకా 11:27-28) వచనములలో గమనించినపుడు ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను, మరియ ధన్యురాలే గాని, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ఆమె కంటే ధన్యులని యేసు ప్రభువు వారు స్పష్టం చేశారు. ఎస్. ఐ. ఇన్స్పెక్టరుకు, ఇన్సెస్పెక్టర్ డి.ఎస్.పి కి, డి.ఎస్.పి ఎస్.పి కి నమస్కరించి సన్మానించుట ధర్మమనునది జగమెరిగిన వాస్తవం, అట్లయినచో దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు, మరియమ్మ కంటే ధన్యులైన వారు, ఆమెకు నమస్కరించుట ఎంతమట్టుకు సమంజసమోయని ఆలోచించి సత్యాన్ని అన్వేషించి తీర్మాణమునకు రండి, (మత్తయి 12:46-50, మార్కు 3:32-35) భాగములో గమనించినపుడు యేసు యింటిలో బోధిస్తున్నపుడు, అనేకులు ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చియుండిరి. ఇంతలో ఆయన తల్లియు సహోదరులును యేసును చూచుటకొచ్చి స్థలము లేనందున బయట నిల్చొని కబురు పంపారు, అక్కడ వారు యేసునకు వర్తమానం పంపగా ఆయన వారితో, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులును సహోదరియు తల్లియునని చెప్పెను, అమ్మగారొచ్చారని అనగా మరియమ్మ వచ్చినదని అనగా యేసయ్య తల్లి (Bible Question And Answers In Telugu)
యేసయ్య తల్లియని హడావిడి చేస్తుంటే .. యేసు వారిని చూచి ఎవరు నా తల్లి? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లియు, నా సహోదరుడును, సహోదరియని స్పష్టం చేస్తున్నాడు. ఈ కారణము చేత నేను దేవుని చిత్తానుసారముగా ప్రవర్తిస్తున్నాను, నేను యేసయ్యకు తల్లిని నాకు కూడా ఒక దేవాలయము కావలెనని గోపురములను కట్టించుకొనుటకు ప్రయత్నిస్తా వేమో?.. దేవుని చిత్తాన్ని జరిగించువారిని గౌరవించాలే గాని ఆరాధించ కూడదు ఎందుకనగా పూజకు పాత్రుడు స్తోత్రమునకు అర్హుడు ముక్తిదాతయు, జగద్రక్షకుడునైన యేసుక్రీస్తు వారు మాత్రమే నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు, ఆమెన్ అని రోమా 9:5 లో భక్త పౌలు గారు సూచించి యున్నాడు. ఇది సర్వసత్యమైయున్నది కావున, జగద్రక్షకుని గర్భము ధరించిన ఆ మహా పరిశుద్ధురాలగు మరియ (మ్మ)ను గౌరవిద్దాం. స్తోత్రార్హుడైన దేవుని మాత్రమే పూజిద్దాం! (Bible Question And Answers In Telugu)
రచయిత:డా.. వసంత బాబు గారు.
మిషనరీ జీవిత చరిత్రలు కొరకు క్లిక్ చేయండి.. క్లిక్ హియర్
Yes మీరు చెప్పిన ది అక్షర సత్యం