సందర్భోచితంగా వాక్యం వాడుకోవాలి
Bible Messages Telugu
దైవ లేఖనంలో సమయమూ సందర్భమూ అన్వయమూ సమన్వయమూ చాలా ప్రాముఖ్యమైనది. ఒక ప్రసంగంలో – పరిచయమూ, సందర్భమూ, వివరణ, అన్వయింపు, ముగింపు అనేవి శ్రోతల హృదయాలలోకి సందేశము చేరుటకు సహకరిస్తాయి. అది అర్థవంతంగా ఉంటుంది.
చాలామంది విశ్వాసులు గాని, సేవకులు గాని సందర్భం లేకుండా వాక్యమును తమకు అనుకూలముగా వాడుతూ ఉంటారు. అది వక్రీకరింపబడి, అసలు మూలానికి సంబంధమే లేకుండాపోతుంది. ఒక వాక్యానికి – దాని పై వాక్యమూ, దాని క్రింది వాక్యమూ, కలుపుకుంటే సందర్భము అర్థమవుతోంది. అలా కాకుండా వాక్యములోని ఏదో ఒక మాట తీసుకుంటే, నీకనుకూలమైన అర్థం రావచ్చేమోకాని, వాక్యమునకు చెందిన వాక్యసారాంశం రాదు! Bible Messages Telugu
ఒక పాస్టరు గారు ఆదివారం ఆరాధనలో – సామెతలు 11:1 ఎత్తి – “దొంగత్రాసు యెహోవాకు హేయము, సరియైన గుండు ఆయనకిష్టము” అంటూ సందేశం చెప్పాట్ట. ఆ సందేశం వినిన ఓ కొత్త విశ్వాసి తర్వాతి ఆదివారం గుండు చేయించుకొని వచ్చాడట. “నువ్వెందుకలా గుండు చేయించుకున్నావు?” అంటూ పాస్టర్ అడుగగా “సరియైన గుండు ఆయనకిష్టము” అని మీరేగా చెప్పింది… అందుకే గుండు చేయించాను” అన్నాట్ట విశ్వాసి. దాని సందర్భం వేరూ, అతడు అర్థం చేసుకున్నది వేరు!
యెహోవా సాక్షుల శాఖకి చెందిన ఒకడు, యేసును దేవుడుగా నమ్మే ఓ వ్యక్తితో వాదించుచూ – “యేసు దేవుడు కాడు, యెహోవాయే దేవుడు, యేసు కేవలం ఒక ప్రవక్త మాత్రమే” నంటూ అనేక బైబిలు రిఫరెన్సులు తీసి చూపిస్తున్నాట్ట. Bible Messages Telugu
ఏమీ పాలుపోని మనవాడికి ఆ రోజున చదివిన వాక్యం ఒకటి గుర్తుకు వచ్చిందట. 115వ కీర్తన 1వ వచనంలో “మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక” ఈ వాక్యంలో – నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అనే మాటను వదిలేసి, ముందున్న మాట పట్టుకొని – “మాకు కాదు, యెహోవా మాకు కాదు – మీకే పో”” అంటూ లేచి వెళ్లాడట.
ఒక బోధకుడు “తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును” (లూకా 18:14) అనే వాక్యం ఎత్తుకొని “సత్యవాక్యమును సరిగా విభజించవలెను” (2తిమోతి 2:15) అంటూ పౌలు చెప్పిన మాటను బట్టి, ఎత్తిన వాక్యాన్ని 3 భాగాలుగా విభజించాడట. అందులో మొదటిది “తన్నుతాను” తీసుకున్నాట్ట. ఆ “తన్నుతాను”ను వివరిస్తూ “ప్రియులారా, దేవుడు ఇక్కడ తన్నుతాను అన్నాడు. దేవుడు ఎందుకు తన్నుతాను అన్నాడు? పాపం చేస్తే తన్నుతాడు! దేవుడు తన్నకుండా ఉండాలంటే, మీరు పాపం చెయ్యొద్దు అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పుకు పోయాడట. ఇక, ఆ సంఘం బలపడుట ఎట్లా? క్షేమాభివృద్ధి పొందేది ఎట్లా? ఆలోచించండి!
66 పుస్తకాల వివరణ .. click here