Apostle Paul’s growth| testimony|పౌలు ఎదుగుదల, సాక్ష్యము2023
Apostle Paul
1.అపొస్తలులందరిలో తక్కువవాడు (The Least of the Apostles).
(మొదటి కొరింథీయులకు) 15:9
9.ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.
15:9 అపొ కా 8:3; 9:1-2; ఎఫెసు 3:9; 1 తిమోతి 1:12-15. ఫిలిప్పీ 2:3 లో తాను ఇతరులకు ఏమి చెప్పాడో దాన్ని చేసి చూపించడం పౌలుకు ఆనందమే.
15:9 A అపొ కా 8:3; 2 కొరింతు 12:11; B ఎఫెసు 3:7-8; 1 తిమోతి 1:13-15; C అపొ కా 26:9-11; గలతీ 1:23; D అపొ కా 9:1-19; 22:4-5; 2 కొరింతు 11:5; గలతీ 1:13; ఫిలిప్పీ 3:6
15:9 అపొ కా 8:3; 9:1-2; ఎఫెసు 3:9; 1 తిమోతి 1:12-15. ఫిలిప్పీ 2:3 లో తాను ఇతరులకు ఏమి చెప్పాడో దాన్ని చేసి చూపించడం పౌలుకు ఆనందమే.
2.) పరిశుద్ధులందరిలో అత్యల్పుడు (Less Than the Least of Saints).
(ఎఫెసీయులకు) 3:7
7.దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
3:7-8 శుభవార్త పరిచర్యలో తన సేవను పౌలు ఏ విధంగా ఎంచుతున్నాడో చూడండి. అతని పాలిట అది దేవుని అద్భుత వరం. ఈ సంగతిని క్రైస్తవులందరూ ఈ విధంగానే చూస్తే క్రైస్తవ సంఘాలు ఎంత భిన్నంగా ఉంటాయి! “బలప్రభావాలు”– 2 కొరింతు 3:5-6; కొలస్సయి 1:29; అపొ కా 1:8. దేవుని బలప్రభావాలు మాత్రమే ఎవరినైనా దేవుని మంచి సేవకులుగా చేయగలవు.Apostle Paul
3:7 A ఎఫెసు 1:19; 3:2, 20; B యెషయా 43:13; రోమ్ 1:5; 1 కొరింతు 3:5; 15:10; 2 కొరింతు 3:6; కొలస్సయి 1:23-25, 29; 1 తెస్స 2:13; 1 తిమోతి 1:14-15; హీబ్రూ 13:21; C రోమ్ 15:16, 18-19; 2 కొరింతు 4:1; 10:4-5; గలతీ 2:8; ఎఫెసు 3:8; 4:16
3:7-8 శుభవార్త పరిచర్యలో తన సేవను పౌలు ఏ విధంగా ఎంచుతున్నాడో చూడండి. అతని పాలిట అది దేవుని అద్భుత వరం. ఈ సంగతిని క్రైస్తవులందరూ ఈ విధంగానే చూస్తే క్రైస్తవ సంఘాలు ఎంత భిన్నంగా ఉంటాయి! “బలప్రభావాలు”– 2 కొరింతు 3:5-6; కొలస్సయి 1:29; అపొ కా 1:8. దేవుని బలప్రభావాలు మాత్రమే ఎవరినైనా దేవుని మంచి సేవకులుగా చేయగలవు.
3.) పాపులలో ప్రధానుడు (The Chief of Sinners).
(మొదటి తిమోతికి) 1:15
15.పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
“ప్రముఖ పాపిని”– ఎఫెసు 3:8. మానవ చరిత్ర అంతటిలోను బ్రతికిన గొప్పవాళ్ళులో, పవిత్రులలో పౌలు ఒకడు. అయితే ఇక్కడ తన గురించి తాను అనుకున్నది ఏమిటో తెలియజేస్తున్నాడు. “గతంలో ఒకప్పుడు నేను ప్రముఖ పాపిని” అనకుండా, ప్రస్తుత సంగతిగురించి మాట్లాడుతున్నట్టు “ప్రముఖ పాపిని” అంటున్నాడు. దీని అర్థం పౌలు పాపకూపంలో ఉంటూ అందరికంటే ఎక్కువ దోషాలు చేస్తున్నాడని కాదు. కానీ స్వభావసిద్ధంగా వచ్చిన భ్రష్ట స్వభావం తనలో ఇంకా ఉందని విశదపరుస్తున్నాడు (గలతీ 5:16-17; రోమ్ 7:18, 25). అతణ్ణి రక్షించి అంతం వరకు కాపాడగలిగేది దేవుని అపార కృప మాత్రమే అని అతనికి తెలుసు. మరి మన గురించి మనం ఏమనుకుంటున్నాం? ఈ ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానం చాలా ముఖ్యమైన విషయం (లూకా 18:9-14 పోల్చి చూడండి).Apostle Paul
1:15 A మత్తయి 1:21; 9:13; 20:28; మార్కు 2:17; లూకా 5:32; 19:10; యోహాను 1:12; 3:16-17; 12:47; రోమ్ 5:8-10; 1 కొరింతు 15:9; ఎఫెసు 3:8; 1 తిమోతి 1:13; 4:9; 1 యోహాను 3:5; 4:9-10; B యోహాను 1:29; 3:36; అపొ కా 3:26; రోమ్ 3:24-26; 5:6; 1 తిమోతి 3:1; 2 తిమోతి 2:11; తీతు 3:8; హీబ్రూ 7:25; 1 యోహాను 3:8; 5:11; ప్రకటన 5:9; 22:6; C యెహె 16:63; 36:31-32; మత్తయి 18:10; అపొ కా 11:1, 18; 1 తిమోతి 1:19; ప్రకటన 21:5; D యోబు 42:6
4.) శ్రమ పొందుటలో అతిశయించాడు (Glorying in Suffering).
2 (రెండవ కొరింథీయులకు) 11:23,24,25,26,27,28,29,30,31,32,33
23.వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని
11:23-29 తాము క్రీస్తు సేవకులమని వారు చెప్పుకున్నారు (వ 23). అది నిజం కాదని పౌలు ఇంతకుముందే చెప్పాడు (వ 13-15) కాబట్టి మళ్ళీ చెప్పడం లేదు. దానికి బదులుగా వారికంటే తానే క్రీస్తు సేవకుణ్ణనేందుకు ఎక్కువ సాక్ష్యాధారాలు, రుజువులు ఉన్నట్టు చూపుతున్నాడు. ఈ సాక్ష్యాలు మూడు రకాలు – క్రీస్తుకోసం అతడు పడ్డ అధిక ప్రయాస (వ 23,26,27), క్రీస్తుకోసం అతడు అనుభవించిన అధిక కష్టాలు, బాధలు (వ 23-27), క్రీస్తు ప్రజలపట్ల అతనికున్న అధిక శ్రద్ధ (వ 28,29)..
24.యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;
25.ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.
26.అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను,సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.
27.ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.
28.ఇవియును గాక సంఘము లన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దిన దినమును నాకు కలుగుచున్నది.
29.ఎవడైనను బలహీను డాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?
30.అతిశయ పడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును.
31.నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.
32.దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను.
33.అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.
5.) హెచ్చింపులో అతిశయించలేదు (Not Glorying in Exaltation).
(రెండవ కొరింథీయులకు) 12:1,2,3,4,5,6,7
1.అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును.
12:1 A 2 కొరింతు 12:7; గలతీ 1:12; B సంఖ్యా 12:6; యెహె 11:24; దాని 10:5-10; యోవేలు 2:28-29; యోహాను 16:7; అపొ కా 9:10-17; 18:9; 22:17-21; 23:11; 26:13-19; 1 కొరింతు 10:23; 2 కొరింతు 8:10; 11:16-30; 12:11; గలతీ 2:2; 1 యోహాను 5:20; C యెహె 1:1-28; యోహాను 18:14; 1 కొరింతు 6:12; D ఎఫెసు 3:3
2.క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
3.అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
4.అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
5.అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను.
6.అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినినదానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిసయించుట మానుకొనుచున్నాను.
7.నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.
6.) పౌలు పరివర్తన (Paul’s Conversion) – ఒక పరిపూర్ణ మార్పు (A Complete Change)
(అపొస్తలుల కార్యములు) 9:3,4,5,6
3.అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.
9:3 దేవుడు అందరికంటే సంఘానికి గొప్ప శత్రువును అందరికంటే సంఘానికి గొప్ప ఉపదేశకుణ్ణిగా మార్చే సమయం వచ్చింది. ఇది దేవుని కృప, కరుణ, ప్రేమ వల్లే జరిగింది. 1 తిమోతి 1:12-16; 2 తిమోతి 1:9. ప్రకాశమానమైన ఒక్క క్షణంలో సౌలు జీవితం పూర్తిగా మారిపోయింది.
4.అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
9:4-5 క్రీస్తుకు చెందినవారిని హింసించడం అనేది క్రీస్తును హింసించడమే. అసలు, వారికి వ్యతిరేకంగా లేక వారికోసం మనం జరిగించేదేదైనా ఆయనకు వ్యతిరేకంగా లేక ఆయనకోసం జరిగిస్తున్నామన్నమాట. వారు శరీరం, ఆయన ఆ శరీరానికి శిరస్సు (1 కొరింతు 12:12-13; ఎఫెసు 1:22-23; కొలస్సయి 1:18). “శరీరాన్ని”, లేక దానిలో ఏ వ్యక్తిని అయినా హింసించే సమయంలో “శిరస్సును” హింసించకపోవడం అసాధ్యం. మత్తయి 10:40; 18:5; 25:34-46; లూకా 9:48; యోహాను 17:20-23 పోల్చి చూడండి. “యేసు” అనే ఈ మాట వినబడగానే సౌలుకు ఎంత కంగారు, ఎంత నివ్వెరపాటు కలిగి ఉండాలి! ఆ ఒక్క క్షణంలో అతని తలంపులన్నీ ఎలా తలకిందులైపోయాయో ఆలోచించండి.
5.ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించుచున్న యేసును;
6.లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.
9:6 సౌలు తాను 22:10లో తెలియజేసిన ప్రశ్న ఇప్పటికి అడిగాడు. ఈ ప్రశ్నవల్ల సౌలు ప్రభువుకు లొంగిపోతున్నాడనీ ఆయనకు విధేయత చూపేందుకు సిద్ధంగా ఉన్నాడనీ అర్థమవుతున్నది. సౌలు 26:16-18లో తాను ఏమి చేయాలో అప్పుడు కొంతమట్టుకు ప్రభువు తెలియజేశాడని చెప్పాడు.
7.) పౌలు ఒప్పుకోలు (Paul’s Confession) – ప్రధాన పాపి (Chief of Sinners).
(మొదటి తిమోతికి) 1:15,16
15.పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
16.అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.
8.) పౌలు నమ్మకము (Paul’s Persuasion) – నేను రూఢిగా నమ్ముచున్నాను (I am Persuaded).
(రోమీయులకు) 8:38,39
38.మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,
39.మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
8:38-39 నిజ విశ్వాసులు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమభరితమైన ఆలన పాలనలో భద్రంగా ఉన్నారన్న విషయాన్ని పౌలు ఇంతకన్నా గట్టిగా నొక్కి ఎలా చెప్పగలడు? విషమ పరీక్షలు, దుష్‌ప్రేరేపణలతో నిండిన ప్రపంచ జీవితం వారిని ఆయన నుంచి వేరుచేయలేదు. భవిష్యత్తులో వారికి తెలియని సంభవాలేవీ అలా చెయ్యలేవు. జీవితాంతంలో వారికెలాంటి మరణం వచ్చినా అది వారిని క్రీస్తు నుంచి వేరుచేయడం అసాధ్యం. ఏ దుష్ట శక్తి గానీ మంచి శక్తి గానీ వారినలా చెయ్యలేవు. కానీ ఎవరైనా “ఇక్కడ పాపం అనే మాట లేదు గదా” అనవచ్చు. అయితే జీవితంలో ఇప్పటి విషయాలైనా తరువాత వచ్చే విషయాలైనా అనడంలో పాపం కూడా ఉన్నట్టుంది. అంతేగాక విశ్వాసుల పాపం గురించి దేవుడు చెప్పిన మాటలను ఇంతకుముందే చూశాం గదా – వ 33,34; 4:8. కృప రాజ్యమేలుతున్నది (5:21)!
9.) పౌలు నిశ్చయత (Paul’s Determination) – నేను నిశ్చయించుకొంటిని (I Determined).
2.నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.
2:2 పౌలు నేరుగా ఏథెన్సు పట్టణం నుంచి కొరింతుకు వచ్చాడు. ఏథెన్సు తాను వేదాంతానికీ, జ్ఞానానికీ ప్రపంచవ్యాప్తంగా గొప్ప కేంద్రమని గొప్పలు చెప్పుకునేది (అపొ కా 17:15; 18:1.). శుభవార్తలోని ప్రధాన విషయాలను కల్తీ లేకుండా ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో కొత్తగా అతడు గ్రహించాడు.
2:2 A గలతీ 6:14; B యోహాను 17:3; 1 కొరింతు 1:22-25; గలతీ 3:1; ఫిలిప్పీ 3:8-10
Nice Bible verses..